కార్పొరేట్ కంపెనీలు, తమ వాణిజ్య ప్రకటనల్లో హిందూ పండుగలకు వ్యతిరేకతను కనబరిస్తే… గతంలోలాగా హిందూ సమాజం ఊరుకోవడం లేదు… సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతోంది.. చాలామంది ప్రకటనకర్తలకు. హిందూ పండుగలంటే అలుసైపోయిందనే విమర్శలు కొన్నాళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే… ఇతర మతాల పండుగలకు శుభాకాంక్షలు చెప్పే ప్రకటనకర్తలు హిందూ పండుగలు అనగానే నీతులు చెబుతున్నాయనేది ఆ విమర్శల సారం…
తాజాగా స్విగ్గీకి ఓ చేదు అనుభవం ఎదురైంది… హిందూ పండుగలు అనగానే అది చేయొద్దు, ఇది సరికాదు అని ప్రచారం చేసే కంపెనీల్లో స్విగ్గీ కూడా ఒకటి… హోలీ పండుగ సందర్భంగా స్విగ్గీ పలుచోట్ల బిల్ బోర్డులు పెట్టింది… ప్రత్యేకించి ఢిల్లీలో ఎక్కువగా… హోలీ సందర్భంగా గుడ్లను ఒకరిపైనొకరు విసురుకోవద్దనీ, ఒకరి తలలపై మరొకరు పగులగొట్టొద్దనీ వాటిల్లో పేర్కొంది…
దీపావళి అనగానే పటాకులు కాల్చొద్దు, కాలుష్యం నింపొద్దు అని నీతులు చెబుతారు సరే, ఈ గుడ్లతో వచ్చిన ప్రమాదం ఏమిట్రోయ్ అని నెటిజన్లు ఇక ఆడుకోవడం మొదలుపెట్టారు… #BoycottSwiggy #HinduphobicSwiggy హ్యాష్ ట్యాగులతో స్విగ్గీ వ్యతిరేక ప్రచారం హోరెత్తించారు… అవి ట్రెండింగులోకి వచ్చాయి…
Ads
స్విగ్గీ ప్రచారం ఎందుకు యాంటీ హిందూగా పరిగణిస్తామో చెబుతూ స్విగ్గీ యాప్స్ డీయాక్టివేట్ చేయడం (అన్ ఇన్‌స్టాల్) స్టార్ట్ చేశారు… వాటి స్క్రీన్ షాట్లు మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయసాగారు… కొన్ని ట్వీట్లకు వేల సంఖ్యలో రీట్వీట్లు కనిపిస్తున్నాయి…
The recent Billboard advertisement of @Swiggy is a clear attempt to defame Holi & create a negative perception among people. The lack of similar Ads for non-Hindu festivals shows a clear bias. Show some sensitivity and Apologize to Hindu community. #HinduPhobicSwiggy pic.twitter.com/vSomzhSiBO
— Elvish Yadav (@ElvishYadav) March 7, 2023
HINDU WILL #boycottswiggy pic.twitter.com/yCRyjjzlSR
— Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) March 6, 2023
I sent a mail to
support@swiggy.com
To deactivate my Account as they just attacked our Holy Religious Festival and Hindu Religion.#Swiggy#boycottswiggy pic.twitter.com/XknSGXkqaO
— Paramanand ࿗ (@paramanand_3) March 5, 2023
– On Christmas – Merry Christmas
• On Eid – Eid Mubarak
• On Holi – BuraMatKhelo/Dont use EggSuch Exclusive Gyan can be expected only from @Swiggy#HinduPhobicSwiggy pic.twitter.com/KRmoS9z0Vl
— Elvish Yadav (@ElvishYadav) March 7, 2023
ఈమధ్యే ఓ విమర్శ స్విగ్గీపై వినిపించింది… హనుమాన్ టెంపుల్‌కు మటన్ డిష్ సప్లయ్ చేయడానికి నిరాకరించినందుకు ఓ డెలివరీ పార్టనర్‌ను స్విగ్గీ తీసేసిందని ఓ వీడియో గత వారం వైరల్ అయ్యింది… ఈ తాజా బిల్‌బోర్డులతో ఆ వివాదంలో ఆజ్యం పోసినట్టయింది… ఇక ఆ బిల్ బోర్డులను స్విగ్గీ తొలగించింది…
హిందూ పండుగల వేళ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు ఇచ్చి, బదనాం అయిపోయి, చివరకు వెనక్కి తీసుకుని, క్షమాపణలు కూడా చెప్పినవి బోలెడు…
- కొన్నేళ్ల క్రితం సర్ఫ్ ఎక్సెల్ ప్రకటన… అందులో ఓ ముస్లిం యువకుడు ప్రార్థన కోసం వెళ్తుంటే ఎవరూ అతనిపై హోలీ రంగులు చల్లకుండా ఓ హిందూ యువతి సాయం చేస్తుంది… నిజానికి ఇందులో పెద్ద వివాదం ఏమీ లేదు కానీ, ఇది లవ్ జీహాద్ ప్రచారం అంటూ హిందుత్వవాదులు కస్సుమన్నారు…
- 2021లో ఫ్యాబ్ ఇండియా #JashnERiwaz అంటూ ప్రచారం చేస్తే… దీపావళి సందర్భంగా ఇది కావాలని చేస్తున్నదే అంటూ హిందూత్వవాదులు పెద్ద ఎత్తున నెగెటివ్ క్యాంపెయిన్‌కు దిగారు… హిందూ పండుగ క్యాంపెయిన్‌కు ఉర్దూ పదబంధాల్ని ఉపయోగించడంపై వివాదం తలెత్తినట్టుంది…
- 2021లోనే డాబర్ కర్వా చౌత్ పండుగ వేళ స్వలింగ సంపర్కాన్ని చూపే ఓ ప్రకటన జారీ చేసి, చేతులు కాలి, యాడ్ విత్ డ్రా చేసుకుంది…
- ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమే…
(మొన్నటి శివరాత్రి సందర్భంగా శివుడి రూపంలోని బాలుడికి జగన్ పాలు తాపిస్తుంటాడు ఓ బొమ్మలో… అంటే లింగానికి పాలాభిషేకం దేనికి..? పౌష్టికాహారం లేని పిల్లలు ఎందరో ఉండగా ఈ క్షీర వృథా దేనికని అంతరార్థం… దీనిపై వచ్చిన విమర్శలకూ వైసీపీ నేతలు ఏవో అర్థం కాని కౌంటర్లు కూడా వేశారు… నిన్నటి హోలీ సందర్బంగా… పౌష్టికాహారం లేని పిల్లలు ఎందరో ఉన్నారు, ఈ గుడ్లను వేస్ట్ చేయకండి అని జగన్ పేరిట ఇంకేదో ప్రచారచిత్రం వస్తుందని అనుకున్నాం గానీ రాలేదు… అవునూ, అన్యమతాల పండుగలపై, ఆధ్యాత్మిక ఆచరణపై ఇలాంటి అద్భుత చిత్రాలు వెలువరించగలవా జగనాలూ..?)
Share this Article