ఇస్రో బయటికి ఏం చెప్పినా… ఏం చెప్పాల్సి వచ్చినా…. ఇండియా ఓ కీలకమైన ఆపరేషన్ కంప్లీట్ చేసింది… విషయమేమిటంటే… మేఘ-ట్రోపికస్ అనే మన సొంత ఉపగ్రహాన్ని మనమే భూవాతావరణంలోకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేశామనేది వార్త… ఇది అప్పుడెప్పుడో 2011లో ప్రయోగించాం… మూడేళ్లు అనుకుంటే పదేళ్లు నిక్షేపంగా పనిచేసింది… ఇంకా తిరుగుతూనే ఉంది… మన నియంత్రణలోనే ఉంది… సరిపడా ఫ్యుయల్ ఉంది… కానీ కూల్చేశాం దేనికి..?
సింపుల్… మనం గతంలోనే అంతరిక్షంలోని ఏ శాటిలైట్‌నైనా సరే, టార్గెట్ చేసి కొట్టగల సామర్థ్యాన్ని నిరూపించుకున్నాం… అంటే రేప్పొద్దున ప్రపంచ యుద్ధం జరిగితే ఏదైనా దేశం తమ రాకెట్లతో మన ఉపగ్రహాల్ని టార్గెట్ చేస్తే… వాటిని మధ్యలోనే అడ్డుకోవాలి, మన ఉపగ్రహాల్ని రక్షించుకోవాలి ప్లస్ వాళ్ల ఉపగ్రహాల పనిపట్టాలి… అదీ మన ప్రయోగాల లక్ష్యం… అయితే అంతరిక్షంలో ఉపగ్రహ శిథిలాల సమస్యపై ఓ అంతర్జాతీయ సమన్వయ కమిటీ ఉంది…
ఇలా అంతరిక్షంలో ఉపగ్రహాల్ని పేల్చేసే ప్రయోగాల పట్ల అది అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది… అసలే కాలం చెల్లిన ఉపగ్రహాలు, వాటి శిథిలాల బెడద ఎక్కువైపోయింది… పనిచేస్తున్న ఉపగ్రహాల పరిభ్రమణాలకు అవి అడ్డుతగులుతున్నాయి… ఉపగ్రహాలకు నిర్ణీత కక్ష్యలు ఉన్నా సరే, అదుపు తప్పి తిరిగే శిథిలాలు, డీఫంక్ట్ శాటిలైట్ల వల్ల ముప్పే… అక్కడ పేల్చేయకూడదూ అనుకుంటే, టార్గెట్‌ను భూవాతావరణంలోకి తీసుకొచ్చి మరీ కూల్చేస్తాం, చూస్తారా అని ఇండియా చేసి చూపించింది…
Ads
నిజానికి మన కంట్రోల్‌లో ఉంచుకుని, ఓ ఉపగ్రహాన్ని తిరిగి భూవాతావరణంలోకి తీసుకురావడం ఓ టాస్కే… కాకపోతే మేఘ ట్రోపికస్ ఇంకా మన కమాండ్ కంట్రోల్‌లోనే ఉంది… అందుకే దాన్ని మన వాతావరణంలోకి తీసుకురాగలిగారు… ఒకరకంగా ఇది విజయమే… కానీ మన అదుపాజ్ఞల్లో లేని విదేశీ ఉపగ్రహాలను ఇలా భూవాతావరణంలోకి తీసుకురాగలమా..? ఈ ప్రశ్నకు ఇంకా ఇస్రో వద్ద జవాబులేదు… అంతరిక్షంలో పేల్చేయడం వేరు… సేఫ్ జోన్‌లోకిి తీసుకొచ్చి మరీ ‘ఖతం’ చేయడం వేరు… ప్రస్తుతం ఇస్రో ఈ ప్రయోగాల్లోనే ఉంది…
అంతరిక్షంలో బోలెడు ఉపగ్రహాలు ఆయుష్షు తీరాక కూడా విధి లేక అలా కక్ష్యలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి… తప్పదు… వాటిని ఇక ఆయా దేశాలు పట్టించుకోవు, కొత్తవి తమ అవసరాల కోసం ప్రయోగిస్తుంటాయి… మరి ఆ పాత ఉపగ్రహాల ట్రాష్ మాటేమిటి..? ఈ సమస్య ఇప్పుడు అంతర్జాతీయగా అంతరిక్ష సర్కిళ్లలో చర్చను, మథనాన్ని లేవదీసింది… ప్రతి దేశం కాలం చెల్లిన తమ ఉపగ్రహాల్ని సేఫ్‌గా మన వాతావరణంలోకి తీసుకొచ్చి డిస్పోజ్ చేసే బాధ్యతను స్వీకరిస్తాయా..? అసలు ఆ పరిజ్ఞానం ఎన్ని దేశాలకు ఉంది..? సో, మనం ఆ సమస్యపై ఏమీ కాన్సంట్రేట్ చేయడం లేదు… మన లక్ష్యం వేరు, సంకల్పం వేరు, ఆలోచన వేరు…
బోరవిరుచుకుని తిరిగే చైనా కూడా ఈ పరిజ్ఞానంలో ఫెయిల్… అమెరికా, రష్యా చేయగలవు, కానీ చేయవు… కంట్రోల్డ్ డిస్పోజ్ మేం చేయగలం అని మనం నిరూపించుకున్నాం సరే… కానీ రేప్పొద్దున యుద్ధవాతావరణంలో ఈ కంట్రోల్డ్ డిస్పోజ్ వంటి టైమ్ వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్ ప్రయోగాలు ఏమీ ఉండవు… టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం, ఉపగ్రహాన్ని కొట్టేయడం… ప్రత్యేకించి నిఘా ఉపగ్రహాలను..! సపోజ్, మనం గనుక చైనా నిఘా ఉపగ్రహాలను కూల్చేయగలిగితే… భూమ్మీద నుంచి ప్రయోగించే మిసైళ్లు ఎట్సెట్రా ఆయుధాలన్నీ నిర్వీర్యం చేసినట్టే… సగం విజయం దక్కినట్టే… సో, ఇండియా ప్రయోగాలకు చాలా ప్రాధాన్యం ఉంది… ఉంది…! చైనాకు ఏమాత్రం నచ్చనిది, మింగుడుపడనిదీ ఇదే…!
Share this Article