Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేంద్రానికి తమిళనాడు తలవంచదు అని కనిమొళి ఎప్పుడూ అనలేదు…!!

March 8, 2023 by M S R

ఎవరో మహిళా మంత్రి ప్రకటన… ‘‘1) మహిళా దినోత్సవం రోజే కవితకు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యే.. 2) రాజకీయ దురుద్దేశంతోనే కవితకు ఈడీనోటీసులు 3) కేంద్రం విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారు. 4) కేంద్రంపై మరింతగా పోరాడుతాం. 5) కేంద్రం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడబోము. 6) ఇట్లాంటి కక్షపూరిత చర్యలు బీజేపీ పతనానికి నాంది..

7) దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్య.. 8) మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమవడంతో బీజేపీకి భయం పట్టుకుంది.. 9) మహిళలంతా తిరుగుబాటు చేస్తారనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. 10) ఈడీ, బోడీలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేషాలు వేసినా భయపడేదే లేదు…’’

బీజేపీ పెట్టించే కేసులు, రాజకీయపరమైన కక్షసాధింపులు, కక్షపూరిత చర్యలు అనేది పెద్ద డిబేట్… కానీ ఈడీ చర్య కక్షపూరితమైతే, ఎందుకు కవితపై కక్ష..? కక్ష సాధింపు అయితే అంతకుముందు కవితపై ఈడీకి, లేదా ఈడీ బాస్‌కు ఎందుకు కక్ష పెరిగింది..? ఆమె ఏం చేసింది..? కేంద్రంపై మరింత పోరాడటం వరకూ వోకే… అయితే కేంద్రంపైనా..? బీజేపీపైనా..? కేంద్రం అంటే అందులో తెలంగాణ కూడా ఉంటుంది… అదేమీ విదేశీ ప్రభుత్వం కాదు… మన దేశ ప్రభుత్వమే..?

Ads

మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ధర్నాకు సిద్ధపడితే మోడీ గడగడా వణికిపోయాడా..? మహిళలంతా తిరుగుబాటు చేస్తారని వణికిపోతున్నాడా..? ఇలాంటి స్టేట్‌మెంట్లను చూపి తెలంగాణ సమాజం నవ్వాలా..? జాలిపడాలా..?

ఇక కవిత అయితే ఏకంగా తెలంగాణ తలవంచదు అని ఓ బహిరంగ లేఖ రాసింది… అది చదివి తెలంగాణ సమాజం నవ్వుకోదా..? ఒక వ్యక్తి చేసిన నేరాానికీ, ఒక సమాజానికీ- ప్రాంతానికీ ఏం సంబంధం..? తప్పులు వ్యక్తి చేస్తే, ప్రాంతాన్ని అడ్డుపెట్టుకోవడం ఏమిటి..? రేప్పొద్దున తప్పులు చేేసే ప్రతి ఒక్కరూ మాది ఈ కులం కాబట్టి కేసు పెట్టారు.., మాది ఈ మతం కాబట్టి కేసు పెట్టారు.., మాది ఫలానా పార్టీ కాబట్టి కేసు పెట్టారు.., అని షీల్డ్ తీసుకునే ప్రయత్నం చేస్తే..?

అయితే కవితపై పెట్టింది తప్పుడు కేసే కావచ్చుగాక… రాజకీయ సంబంధమైన కేసే అనుకుందాం… ఐనాసరే, తెలంగాణ పేరు ఎందుకు వాడుకోవడం..? కవితకూ బీజేపీకి నడుమ పోరాటం… బీజేపీకి తెలంగాణకు నడుమ పోరాటం ఎలా అవుతుంది..? కవిత మీద కేసు పెడితే తెలంగాణ సమాజం ఎందుకు ఆగ్రహించాలి..? తెలంగాణ నెటిజనం కూడా ఈ ప్రకటన పట్ల వ్యతిరేకంగా స్పందించింది…

కరుణానిధి బిడ్డ కనిమొళి మీద కేసు పెడితే… ఏయ్, తమిళనాడు కేంద్రానికి ఎన్నడూ తలవంచదు అన్లేదు ఆమె… పైగా ఆ పార్టీ కూడా భాగస్వామిగా ఉద్దరిస్తున్న కేంద్రమే అప్పుడు..! లాలూ ప్రసాద్ యాదవ్ బిడ్డ మీసా భారతి మీద కేసు పెడితే, లాలూ భార్య రబ్రీదేవి ఇంట్లో దాడులు చేస్తే… బీహార్ ఎన్నడూ తలవంచదు అన్లేదు వాళ్లు… వాళ్లు చట్టబద్ధంగా పోరాడుతూనే ఉన్నారు… పోవాల్సిన పద్ధతుల్లోనే పోతున్నారు… అంతే తప్ప వాళ్ల ప్రాంతీయతను రక్షణగా వాడుకునే ప్రయత్నాలేమీ చేయలేదు…

మాయావతి మీద కూడా కేసులు పడితే… ఇది ఉత్తరప్రదేశం మీద కక్షసాధింపు, ఈ రాష్ట్రం తలవంచదు అన్లేదు ఆమె… ఐనా సీబీఐ, ఈడీ కేసులు రాజకీయంగా మైనస్ ఏమీ కాదు… జగన్‌ను చూడండి… ఎంచక్కా సీఎం అయిపోయాడు… కేసులు పెడితే ఏమవుతుందట..?! ఇలాంటప్పుడే మాటల్లో పరిణతి, స్పందనలో సంయమనం అవసరం…!! అయినా…. జాతీయ పార్టీగా ఎదిగీ ఇంకా తెలంగాణాకు మాత్రమే పరిమితమైతే ఎలా అక్కా…!!



కవిత ప్రకటన ఇలా ఉంది………..

తెలంగాణ తల వంచదు !! రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నాకు నోటీసులు జారీ చేసింది. కానీ ధర్నా మరియు ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బిజెపి తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకాంక్షాపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము. జై తెలంగాణ !! జై భారత్ !!



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions