వాళ్లు ప్రొఫెషనల్ సినిమా రివ్యూయర్లు కాదు… కానీ ఏదైనా సినిమా చూసినప్పుడు, ఆనందపడినప్పుడు… లేదా దుఃఖపడినప్పుడు… ఆ ఫీలింగ్‌ను అందరితోనూ షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు… తమ ఫీలింగును క్రమపద్ధతిలో అక్షరీకరిస్తే… అంతకుమించిన రివ్యూ మరొకటి ఉండదు… ఈ రివ్యూలకు ఫార్మాట్లుండవు… మనస్సులో ఏముంటే అది రాసేయడం… అందుకే ఇలాంటి సమీక్షల్లో జీవం ఉంటుంది… నిజాయితీ ఉంటుంది… కొన్నిసార్లు కలం సినిమాను కూడా దాటిపోయి ఏవేవో సంగతులు కూడా చెప్పేస్తుంది… మీరు చదవబోయేది ఓ రివ్యూ… కాదు, ఒక ఫీల్… కడుపులో నుంచి మత్తడి దూకిన ఫీల్… అదే ‘బలగం’ అనే సినిమా మీద…
Bala Yugandar Chittalooru ::: సప్పుడు జెయ్యిర సప్పుడు చెయ్యి….బలగం వచ్చింది!!! ఆల్ల బల్గం పెద్దదే, ఈల్ల బల్గం పెద్దదే అని మా గౌలిగూడ లక్ష్మిబాయక్క మా అక్కలతొని చెప్తుంటే చిన్నపుడె ఇన్న….అక్కడినుండి నా బలగం వీక్షణం మొదాలు! ఈ బలగం పదం వెనుకనే పెద్ద చరిత్ర ఉంది… ఏమి చెపుతుంది… మనుషులంటేనే సంఘ జీవులని, ఒకరితొ ఒకరికి సంబంధాలుంటయని, ఒకరి నుంచి ఒకరు బలం పుంజుకొంటారని కూడ అనుకొవొచ్చు! Etymology aside, మొట్ట మొదాలు…. అరె వేనుగా, ఏం సిన్మా తీసినవ్ర …. (with greatest affection)
బలగం చావు చెప్పిన బతుకు ఎటువంటి కథ … అచ్చమైన తెలంగాణ, అచ్చమైన మనుషుల, స్వచ్చమైన కథ. కొందరు విశ్లేషకులు ఇధి సింపుల్ కథ కాని బాగ తీశిండు అంటుండ్రు… that’s missing the whole point. ఎందుకంటె ఇటువంటి కథ ఏ శెఖర్ కమ్ములనొ, ఇంకెవరొ చచ్చిన చెప్పలేరు, తియ్యలేరు….where’s the wind is blowing అని చూశెటొనికి అచ్చమైన అనుభూతుల గురించి ఏం తెలుస్తది….ఎంకి పాటలు, గుంటూరు కుర్రాల్లు, బాపు 16 అణాల అమ్మాయి తెలుగు సినిమా నిండా అదే తెలుగు జీవన విధానం, జీవన సౌందర్యమని బలవంతంగా standardize చేసి ఇంకా రుద్దుతున్న కాలంలొ…. గొరేటి అద్భుతంగ చెప్పిన, వర్ణించిన తెలంగాణ జీవన్ సౌందర్యం, వ్యక్తిత్వం, ఆత్మ, అభినివేశం అన్నీ పునికి పుచ్చుకొన్న ‘బలగం’ గొప్ప కథ కూడ !
Ads
విజయ దేవరకొండ తెలంగాణ representative అనే భావ దారిద్రంలొ ఉన్నాం మనమిప్పుడు….99% ఇంకా సినిమాలు వీర, శూర, వాల్టైర్ టైపు… it’s not progress if ‘Telangana’ heroes act in main stream faaltu movies wholly removed from our culture, issues, feelings, sensibilities and identities!
బలగం గొప్ప గుణమేందొ తెలుసా….అంటే నాకనిపించింది… వేణు ఎక్కడా ముత్తెకంత గూడ సంకరం చెయ్యలేదు. ప్రాంతం, భాష, కట్టు బొట్టు, మాట, తిట్లు… అభివ్యక్తీకరణ అంతా అచ్చమైన తెలంగాణ. రవి తేజ లాంటొల్లు తెలంగాణ మాట్లాడుతున్న ఈ సంధి కాలంలొ ఇంతా నిక్కచ్చిగ, సహజంగ తీయడం అద్భుతమే. నేనేం కథ చెప్ప… కాని ఒక సందర్భంలొ ఊరి పెద్ద మనిషి ‘మీరు మీరు కొట్టుకుంటె ఎట్లా అంటడు… కొట్టుకొవద్దు అని చెప్పకుండ, కొట్టుకొండి కాని తశ్వ మేము జేస్తం అని ఉద్దేశ్యం…. పడి పడి నవ్వుకున్న! హీరొ దొస్తు సడన్ గా అరె మందేస్తె ఎట్లుంటదిర… ఉపొద్ఘాతం లేకుండ…. అట్ల ప్రతీ character జీవితమ్నుండి వచ్చిందె….
ఒరెక్క అనిపించె ప్రతీ పాత్ర వ్యవహారం…. మన మామూలు జీవితంలొ ఉన్న hypocrisy, కల్మశం, చికాకు, రంధి, స్వార్దం అనీ సహజాతి సహజంగ ఉన్నయి…. అన్నీ క్లేశాలు కాష్టంలొ కాలి పునీతమవ్వడమూ ఉంది. సినిమా అంతా మజాక్ మజాక్ అని మనం కూడ హీరొ లెక్క అనుకుంటున్న సమయంలొ నిజమైన ఎడబాటు, వేదన, బంధాలు, ప్రేమలు…చెంప చెల్లు మన్నంత హ్రుద్యంగ ఆవిష్కరించిండు వేణు.
అరె నిజంగ ఒక మనిషి జరిగిపొయిండు, ఆయనతో ఉన్న బంధాలు, బాందవ్యాలు, ప్రేమలు, కోపాలు ఇంక స్మ్రుతులేన అని గబుక్కున అనిపించి మన సొంత లొల్లిల నుండి బయటపడి బావురునుమనడం…. climax లొ బుడగ జంగాల పాట గుండల్ని పిండి పిండి పునీతం జెస్తది… crescendo of emotions….grief cleansing souls…. almost everyone truly realizing/experiencing what it means to be really ‘human’
ఇంక పాటలు, సంగీతం…. తెలంగాణ జీవితంలొ సహజంగ అద్భుతంగ ప్రతిద్వనించే శబ్దాలు, పదాలు, దరువు… బలరామ నరసయొ balaraama narasayo is simply majestic…piturization. choreography, sounds juxtaposing death and celebration…… గొంతులొ జీర… simply wow! నటులందరు నటించలేదు…. జీవించిండ్రు… మేనత్తనైతే అద్బుతం… గిప్పుడె తిడ్తది, గప్పుడే దగ్గర తీస్తది. బతకమ్మ పండుగల చెల్లెలని మర్శిపొయినవ్ అని పెద్దన్న చిన్న తమ్ముని కొట్టిన సంధర్భం ఆమె చెప్పుడు.. గుక్క పట్టి ఏడ్వకపోతె ఒట్టు.
సినిమా అంతా గల్లాలు పట్టుకొని కొట్టుకొన్న బావ, బామ్మర్దులు బుడగ జంగాల పాటలొ విలపించి, విల విలలాడడం, పెద్ద బామ్మర్ది తల్లడిల్లి బావ కాల్ల మీద పడి ఏడ్వడం, బావ చిన్నపిల్లగాని ఒదార్చినట్లు ఒదార్చడం పతాకకే పతాక! ఒరెక్క అంతా చెప్పినట్లున్న…. ఎంత చెప్పినా తక్కువే…
Last but not least….request to Venu….I am sure he will get many opportunties but pls don’t do commercial, stereotypical movies. It’s not an exaggeration to say I see traces of the great Shyam Benegal….and zillion thanks for making me cry buckets!
Share this Article