ఆదానీ గ్రూపుకి అప్పులు ఇవ్వడానికి బాంకులు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఆదానీ గ్రూపు పట్ల విశ్వాసం చూపిస్తూ వస్తున్నారు ఇంకా ! ఆదానీ గ్రూపు షేర్ల ధరలు తగ్గడం గ్రూపు పని తీరు మీద ఆధారపడి జరగలేదు. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది నిజమే అనుకుని భయంతో అమ్ముకున్నారు చాలామంది…. కానీ ఆదానీ గ్రూపు దివాళా తీయలేదే ?
అదే ఒక అమెరికన్ కమర్షియల్ బాంక్ దివాళా తీయడం, అందులోనూ కష్టాలలో ఉన్నాం, భారీ పెట్టుబడులు పెట్టండి అని అడిగినా ఎందుకు ఎవరూ ముందుకు రాలేదు? ఆదానీ గ్రూపు షేర్లు అమ్ముకున్నవాళ్ళు లాభపడ్డారు, అలాగే కొత్తగా షేర్లు కొంటున్నవాళ్ళు కూడా లాభపడుతున్నారు ఎందుకని ?
ఒక అమెరికన్ కమర్షియల్ బాంక్ ని నమ్మని ఇన్వెస్టర్లు ఆదానీ లాంటి వ్యాపారవేత్తని ఎలా నమ్ముతున్నారు? ఒక్క రోజులోనే 80 బిలియన్ డాలర్లు ఆవిరి అయిపోయాయి. గత శుక్ర,శనివారం రోజుల్లో ! నష్టపోయిన వాటిల్లో SVB తో పాటు ఇతర అమెరికన్ బాంకులు మరియు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి !
Ads
FDIC [Federal Diposit Insurance Corporation ] ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది ! SVB కి ఉన్న ఆస్తులని అమ్మి డిపాజిటర్స్ కి చెల్లింపులు చేస్తుంది అన్నమాట ! కానీ గరిష్టంగా ఒక లక్షా యాభైవేల డాలర్ల వరకే ఇస్తుంది. అదే మనదేశంలో తీసుకుంటే గరిష్టంగా 5 లక్షల రూపాయలు ఇన్స్యూరెన్స్ కింద డిపాజిటర్లకి దక్కుతుంది. ఇది డాలర్ రూపీని లెక్క చేయకుండా చూస్తే మన దేశంలో ఏదన్నా బాంక్ దివాళా తీసే డిపాజిటర్స్ దక్కే ఇన్స్యూరెన్స్ మొత్తం అన్నమాట ! 1962 – 2020 వరకు కేవలం లక్ష రూపాయల ఇన్స్యూరెన్స్ మాత్రమే దక్కేది ఒకవేళ బాంక్ దివాళా తీస్తే… కానీ మోడీ ప్రభుత్వం ఒక లక్ష నుండి 5 లక్షలకి పెంచింది 2020 నుండి !
*********************
ఇంతకీ అమెరికన్ రెగ్యులేటర్లు ఏం చేస్తున్నట్లు ? ఒక్క రోజులో ఒక పెద్ద కమర్షియల్ బాంక్ దివాళా తీసేవరకు వీళ్ళు ఏం చేస్తున్నట్లు ? పైగా భారత దేశ బాంకులు, వాటి ఆర్ధిక నిర్వహణ బాగాలేవు అంటూ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇదొక రకం భేషజం ! అంతా బాగుంది అని చెప్పుకోవడానికి మరియు నిర్వహణ అంటే మేమే చేయాలి అనే దురహంకారం మాత్రమే ! తీరా చూస్తే అంతా డొల్ల !
******************
మొత్తం 4 అమెరికన్ షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థల మీద అమెరికా కోర్టులో క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి 2021 నుండి!
1. హిండెన్బర్గ్ రీసర్చ్ మీద మొత్తం 3 క్రిమినల్ కేసులకి సంబంధించి విచారణ జరుగుతున్నది. ఈ సంస్థ బాంక్ అక్కౌంట్లని సీజ్ చేసినా వేరే అకౌంట్లని ఓపెన్ చేసి మరీ ఆదాని గ్రూపు షేర్లు కొన్నది !
2. హిండెన్బర్గ్ రీసర్చ్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టు ఆంక్షలు విధించినా ఆదానీ మీద రిపోర్ట్ ఇచ్చారు అంటే ఉద్దేశ్యం ఏమిటో తెలియట్లా ?
3. మడ్డీ వాటర్స్ [Muddy Waters ]. ఈ సంస్థ మీద కూడా క్రిమినల్ విచారణ జరుగుతున్నది మరియు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టు నిషేధం విధించింది.
4. మెల్విన్ కాపిటల్ [Melvin Capital ] . ఈ సంస్థ మీద కూడా కోర్టు క్రిమినల్ విచారణ చేస్తున్నది.
5. సిట్రాన్ రీసెర్చ్ [Citron Research ]. ఈ సంస్థ మీద కూడా క్రిమినల్ విచారణ జరుగుతున్నది.
*****************************
ఆదానీ గ్రూపు మీద దాడి జరగకముందే మోడీ ఒక నిర్ణయం తీసుకున్నారు తెలుసా ? మన దేశ పారిశ్రామిక, ఆర్ధిక సంస్థల ఆడిటింగ్ విదేశీ సంస్థలు అయిన S&P, Moody’s, Fich లాంటి వాటి చేత ఇకముందు రేటింగ్-ఆడిటింగ్ చేయించకుండా మన దేశ ఆడిటింగ్ సంస్థల చేత చేయించాలి అనేది ఆ నిర్ణయం. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆడిటింగ్ సంస్థలకి సాఫ్ట్ వేర్ ఇచ్చేదీ భారతీయ సాఫ్ట్ వేర్ సంస్థలే ! వాటి నిర్వహణ చేసేది భారతీయులే ! అటువంటప్పుడు మనం ఎందుకు విదేశీ సంస్థల చేతికి మన దేశ సంస్థల వివరాలు ఇచ్చి ఆడిటింగ్ చేయించుకోవాలి ? చైనా ఇలాంటివి జరుగుతాయి అని తెలిసీ, ముందు జాగ్రత్తగా చైనా సంస్థల చేతనే ఆడిటింగ్ చేయిస్తుంది తప్పితే మల్టీ నేషనల్ సంస్థకి ఇవ్వదు…
******************
అసలు విషయం ఏమిటీ ? అందరికీ తెలిసిందే ! వ్యభిచారం ! అఫ్కోర్స్ దానికి ముద్దుగా లాబీయింగ్ అనే పేరు ఉంది ! నోబెల్ బహుమతి రావాలంటే లాబీయింగ్ చేయాలి ! ఆస్కార్ అవార్డ్ రావాలంటే లాబీయింగ్ చేయాలి ! పెద్ద మొత్తంలో అప్పు పుట్టాలి అంటే లాబీయింగ్ చేయాలి నీ సంస్థలో ఎన్ని లొసుగులు ఉన్నా మంచి క్రెడిట్ రేటింగ్ కావాలి అంటే లాబీయింగ్ చేయాలి ! నీ దేశానికి అమెరికన్ చట్ట సభలలో ఏదన్నా ప్రయోజనం చేకూరాలి అంటే లాబీయింగ్ చేయాలి కానీ ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం ! అంచేత ప్రపంచానికి నీతులు చెప్పే ముందు అమెరికన్ సంస్థల అసలు రంగు ఏమిటో వాళ్ళే చెప్పాలి కానీ చెప్పరు! సిలికాన్ వాలీ బాంక్ దివాళా సినిమా ముందు వచ్చే టైటిల్స్ మాత్రమే ! సినిమా ఇంకా ఉంది !
Share this Article