Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్కారీ కొలువు లేకపోతే లైఫ్ లేదా..? చావొద్దు ప్లీజ్… బతకాలి, బతికి సాధించాలి..!!

March 18, 2023 by M S R

Srinivas Sarla……..  తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు పెరిగినయ్.. వేరే పనుల మీద ధ్యాస లేకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వ కొలువుల పైనే దృష్టి పెట్టడానికి కారణం… తెలంగాణ ఉద్యమ సమయం నుండే మన రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనే ప్రచారం ఎక్కువగా జనాల్లోకి వెళ్లడం… మీడియా సృష్టో లేక నాయకుల సృష్టో తెలీదు కానీ ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం అనే ప్రచారం కూడా ఎక్కువే జనాల్లోకి వెళ్ళింది…

ఆ ఆశతోనే 2011 నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. 2011 కి ముందు హైదరాబాద్ లో మాత్రమే ఉండే పోటీ పరీక్షల కోచింగ్ సంస్థలు ప్రతి జిల్లాలో నాలుగైదు వెలిసాయి. తెలంగాణ వచ్చే నాటికి కొన్ని వేల మంది అభ్యర్థులు సీరియస్ ప్రిపరేషన్ కొనసాగించి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని కుదురుకుని tspsc సంస్థ ఏర్పాటు ఉద్యోగ ఖాళీల గుర్తింపు నియామక ప్రక్రియ విధానలకు కొంత సమయం పట్టింది…

ఈ గ్యాప్ లో జరిగిన విషయాలు కొన్ని ఉన్నాయి. అప్పటికే కోచింగ్ సెంటర్లలో చేరి ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగ నియామక ప్రకటనల కోసం ఎదురు చూసి చూసి, నోటిఫికేషన్లకు ఇంకొంత సమయం పట్టొచ్చు అని భావించి నగరాలను విడిచి ఇంటి దారి పట్టి ఏదో ఓ పని వెతుక్కునే సమయంలో… న్యూస్ పేపర్లలో త్వరలో కొలువుల జాతర అని పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు రాసేవారు… రాసేవారో రాయించేవారో తెలీదు కానీ ఆ వార్త చదివిన అభ్యర్థి మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ తట్ట బుట్ట సర్దుకుని మళ్ళీ కోచింగ్ సెంటర్ల బాట పట్టేవారు…

Ads

ఇక కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు అభ్యర్థులు చేజారిపోకుండా మోటివేషన్ క్లాసుల పేరుతో ప్రముఖ ప్రముఖులతో వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు ఇప్పించే వారు… ఆ ఉపన్యాసాలలో ప్రధాన అంశం ప్రభుత్వ ఉద్యోగం రాకుంటే బ్రతకడం వృథా, చావో రేవో ఉద్యోగం కొట్టే ఇంటికి వెళ్ళేవాడే మొనగాడు అని….

ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే మొత్తం సమస్యలకు పరిష్కారం అని ఒకడు… ప్రభుత్వ ఉద్యోగం వస్తే కార్లు, బంగ్లాలు కొనుక్కుని బాగా సంపాదించచ్చని ఒకడు.. ప్రభుత్వ ఉద్యోగం రాని వాడు భూమికే బరువనీ ఇంకొకడు… ఇలా ఎవడికి తోచినట్టు వాడు అభ్యర్థుల బుర్రల్లో కుక్కి అభ్యర్థిని ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకువెళ్తారు… అలా ఎందుకు తీసుకు వెళ్తాడు అంటే వాడి దగ్గర ఉన్న మొత్తం లాగేసి పీల్చి పిప్పి చేయడానికి… అభ్యర్థి జారిపోతే కోచింగ్ సెంటర్లు నడవవు… వారికి ఉపాధి ఉండదు ఇదొక కారణం…

ఇక అభ్యర్థులు నాలుగైదేళ్ల ప్రిపరేషన్ తరువాత నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్లో, కోర్టు కేసుల కారణం వల్లో… వచ్చిన నోటిఫికేషన్లలో అదృష్టం కలిసి రాక, ఉద్యోగం రాకపోవడం వల్లో తిరిగి ఇంటికి వెళ్ళలేడు… ఒకవేళ వెళితే ఇన్నేళ్లు చదివావ్ అయ్యో నీకు ఉద్యోగం రాలేదా అని ఇంట్లోళ్ళు బంధువులు స్నేహితులు వెక్కిరిస్తారని భయం…

ఆ భయంతో ఇంటికి వెళ్లలేక అక్కడ వేరే పనుల్లో చేరి ఉపాధి చూసుకుంటే సబ్జెక్ట్ ఫ్లో తప్పుతుంది అని భయం… ఎలాగైనా ఇంకొన్నాళ్ళు గట్టిగా చదివి ఉద్యోగం కొట్టాలనే కసితో చదువుతాడు… చదువుతూనే ఉంటాడు… తెలిసిన ప్రతి చోట అప్పులు చేస్తూ ఒక్క పూట తింటూ చెట్ల కింద పుట్టల కింద చదువుతున్నా… ఇగ వాడికి చదువొక్కటే లోకంగా మారిపోయి, అలా ఏళ్ళు గడుస్తాయి, ఉద్యోగం రాదు…

ఎంత చదివినా ఉద్యోగం ఎందుకు రాదంటే ఉద్యోగం రావడానికి జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు… దానికి అన్ని అనుకూలించాలి… ఆశించిన కొలువుల రోస్టర్ కావచ్చు, పోస్టుల సంఖ్య కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు… ఎంత చదివినా వాడు చదివిన యాంగిల్ లో ప్రశ్నలు పడకపోవచ్చు… పరీక్ష రాసే సమయానికి ఒత్తిడితో తెలిసిన ప్రశ్నలు కూడా తప్పు చేయొచ్చు… ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి….

చాలా మంది బయటి వారికి ఇవి తెలీదు, ఉద్యోగం రానివాడిని అవహేళన చేసేవారికి… ఉద్యోగం రాకపోతే బతుకే లేదు అని మోటివేషన్ క్లాసుల పేరుతో అభ్యర్తులను ట్రాన్స్ లోకి తీసుకు వెళ్లే కోచింగ్ సెంటర్లకి… త్వరలోనే కొలువుల జాతర అని హెడ్డింగులు పెట్టే ప్రింట్ మీడియాకి…అసలే తెలియదు… లక్షల రూపాయలు అప్పులు ఇచ్చిన అప్పులోళ్ళకి మధ్యలో నలిగిపోతూ, ప్రభుత్వ ఉద్యోగం అనే ఓకే ఒక ఆశతో, ఇంకే ఉద్యోగం చేయకుండా ఉరితాడు ఎక్కుతున్న యువతను చూస్తుంటే బాధేస్తుంది… ఇంకోవైపు భయమేస్తుంది…

ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే సమస్యలు తీరుతాయి అనుకుంటారు అందరు, కానీ అసలు సమస్యలు మొదలయ్యేవే ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక… ఇది చాలా మందికి అనుభవం అయితే తప్ప తెలీదు… ఇది కడుపు నిండి మాట్లాడుతున్న మాటలు కావు నిరుద్యోగ జీవితాన్ని కొన్నేళ్ల పాటు అనుభవించి, ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక, ఉద్యోగి జీవితాన్ని అనుభవిస్తూ అంటున్న మాటలు…… ప్లీజ్, తొందర పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు…. బతికి ఉండే సాధిద్దాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…
  • పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…
  • నీ నల్లకోటు పుస్తకంలో కథలు చాలా బాగున్నయ్ మిలార్డ్…
  • ఎంత తేడా..? కేసీయార్ జనంలోకే రాడు… రేవంత్ మాత్రం పూర్తి భిన్నం..!!
  • అవ్‌ గణేశా… ఇంకొన్నొద్దులు ఇక్కడే ఉండిపోరాదు ప్లీజ్..!!
  • అది ఫాస్ట్ బ్రేక్..! ఉప్మాను ఏమైనా అంటే మర్యాద దక్కదు సుమీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions