పార్ధసారధి పోట్లూరి ……… ప్రపంచంలో సంతోషంగా ఉన్న ప్రజలు కల దేశాలలో మొదటి స్థానం ఫిన్లాండ్ ది ! భారత దేశం కంటే శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లు ఎక్కువ సంతోషంగా ఉన్నాయిష! సంతోషాన్ని ఎలా లెక్క కడతారు ? దాని సంగతి తరువాత చూద్దాం ! ఫిన్లాండ్ జనాభా వచ్చేసి 55,64,088-యాభై అయిదు లక్షల 64 వేలు ! అంటే మన హైదరాబాద్ జనాభా కంటే సగం తక్కువ !
55 లక్షల జనాభా కల ఫిన్లాండ్ లో 4 లక్షల మంది ప్రజలు యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్నారుష ! ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణం దాదాపుగా డ్రగ్స్ తో సమానమయిన ఒత్తిడిని మర్చిపోయేలా చేసే మందులు వాడుతున్నారు అంటే అంత ఒత్తిడి ఎందుకు ఉంది ?
బహుశా ఫిన్లాండ్ దేశ ప్రజలు రష్యాతో సరిహద్దులు కలిగి ఉండడం వలన సంతోషంగా ఉన్నారా ? ఫిన్లాండ్ నుండి రష్యాలోకి నడుచుకుంటూ వెళ్ళవచ్చు ! రష్యా ఉక్రెయిన్ మీదకి వదిలే మిస్సయిల్స్ ఎక్కడ తమ మీద పడతాయేమో అనే భయం వలన యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్నారా ? అలా అయితే వరుసగా ఆరో ఏడు ఇది సంతోషంగా ఉన్న దేశాలలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం ! అంటే గత 5 ఏళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధం లేకపోయినా యాంటీ డిప్రెసెంట్ మందులు వాడడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
Ads
నేను చెప్పనా ? ఫిన్లాండ్ ని రష్యా ఏ క్షణంలో అయినా తన అధీనంలోకి తీసుకోవచ్చు అనే భయంతో పశ్చిమ దేశాలు ముందస్తుగా ఆడుతున్న నాటకం ! ఒకవేళ రష్యా ఫిన్లాండ్ మీద దాడి చేసి స్వాధీనం చేసుకుంటే వెంటనే పశ్చిమ దేశాలు పెడ బొబ్బలు పెడతాయి, సంతోషంగా ఉన్న దేశాన్ని అక్రమంగా రష్యా స్వాధీనం చేసుకుంది అని ! కానీ రష్యా పక్కనే ఉన్న ఫిన్లాండ్ ని నాటోలో కలుపుకోవడానికి తాము చేస్తున్న కుట్రల గురించి చెప్పవు. జస్ట్, ముందు ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకొని ఆ తరువాత రష్యా పక్కనే ఉన్న ఫిన్లాండ్ ని కూడా నాటోలో కలిపేసుకొని రెండు దేశాలలో తమ మిస్సైళ్ళ ని మోహరించి రష్యాని బెదిరించే కుట్రలో భాగం !
అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన నోకియా ఫోన్ ని తయారుచేసిన నోకియా ఫిన్లాండ్ దేశానిదే ! ఎలా చూసినా ఫిన్లాండ్ మరియు దానికి ఆనుకొని ఉన్న రష్యాలోని చాలా ప్రాంతాలు ఒకేలా ఉంటాయి. అలాగే ఫిన్లాండ్ దేశంతో సమానమయిన భూభాగం కంటే ఎక్కువ ప్రాంతం రష్యాలో చాలా ప్రశాంతంగా,సంతోషంగా ఉంటుంది ! మరీ చండాలం ఏమిటంటే ఉక్రెయిన్ ప్రజలు కూడా మన దేశ ప్రజలకంటే సంతోషంగా ఉన్నారుష!
130 కోట్ల జనాభా కల భారత దేశంలో పేదవాళ్ళు ఉంటారు, ఆమాటకొస్తే అమెరికాలోని పెద్ద పెద్ద నగరాలలో ఉండే డౌన్ టౌన్ లలో కూడా హోంలెస్ ప్రజలు ఉన్నారు ! అమెరికాలోని డౌన్ టౌన్ లో ఉండే ఇళ్ళు లేని వాళ్ళు అడుక్కునే తీరు ఎలా ఉంటుంది అంటే ఫుట్ పాత్ మీద ఒక ప్ల కార్డు పట్టుకొని అడుక్కుంటున్నారు ఇలా : ‘’మీరు మీ భార్యని సంతృప్తి పరచగల మగవాళ్ళు అయితే నాకు దానం చేస్తారు ‘’ ! ఇలా మన దేశంలో అడుక్కునే వాళ్ళు ఉంటారా ? అడుక్కునే వాడికి ఎంత కడుపు మండినా ఈ విధంగా ఒక్క అమెరికాలో తప్పితే వేరే ఎక్కడా ఇలా అడుక్కోరు ! This is called Happy Index !
Share this Article