పార్ధసారధి పోట్లూరి …… (భారత్ –రష్యా – చైనా కూటమి ! పార్ట్ -02) న్యూయార్క్ కి చెందిన హిండెన్బర్గ్ ట్వీట్ చేసింది : మేము మరొక సంచలన విషయం బయటపెట్టబోతున్నాము భారత్ దేశపు సంస్థ గురుంచి అంటూ! ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది అమెరికా భారత దేశానికి ? భారత్,రష్యా,చైనా లు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది!
లడాక్ మరియు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనా తన దళాలని భారీగా మోహరించింది మళ్ళీ ! ఇలాంటి పరిస్థితులలో భారత్ చైనా ల మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది ? మరీ ముఖ్యంగా క్వాడ్ కూటమి లో భారత్ ఉండడం చైనాకి ఇష్టం లేదు! కానీ అది అనివార్యం మనకి ! చైనా తన దళాలని వెనక్కి తీసుకొని పూర్వం లాగానే సఖ్యత తో ఉంటే మళ్ళీ పరిస్థితులు బాగవుతాయి కానీ ఇది జరుగుతుందా ?
క్వాడ్ కూటమిలో ఉన్న జపాన్ కి జ్ఞానోదయం అయ్యింది ! అత్యాధునిక ఆయుధాల కోసం ఎంతసేపు అమెరికా మీద ఆధారపడి మనుగడ సాగించలేము అంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నది ! జపాన్ మొదటి నుండి అంటె రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎలెక్ట్రానిక్స్ లో ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి రాగలగింది కానీ ఎప్పుడయితే అమెరికా సహకారంతో మనుగడ సాగించాలి అనుకుందో అప్పుడే ఎలెక్ట్రానిక్స్ మీద తన ఆధిపత్యం ని కోల్పోయింది ! పక్కనే ఉన్న దక్షిణ కొరియాతో పాటు చైనా కి ఎలెక్ట్రానిక్స్ పరిజ్ఞానం ని డామినేట్ చేయడానికి అవకాశం ఇచ్చింది.
Ads
******************************
గత సంవత్సరం జపాన్ కి చెందిన F-35 యుద్ధ విమానం పసిఫిక్ మహా సముద్రం లో కూలిపోయి పైలట్ చనిపోయాడు. దాంతో అప్పటి వరకు కేవలం డిజైన్ దశకే పరిమితం అయిన తన 6th జెనెరషన్ జెట్ ఫైటర్ ప్రాజెక్ట్ F-X ని యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టింది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ [Mitsubishi heavy Industries ] 6th జెనెరషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ F-X ని చాలా వేగంగా పూర్తి చేయడంలో నిమగ్నం అయ్యింది. కొంటె మా దగ్గర కొనాలి కానీ జపాన్ స్వంతంగా తయారుచేసుకోవడం అనేది అమెరికన్ ఆయుధ లాబీ కి సుతరాము ఇష్టం ఉండదు ! కానీ జపాన్ మాత్రం ఇతర యూరోపియన్ దేశాలు అయిన జర్మనీ, ఇటలీ, స్పెయిన్, UK, ఫ్రాన్స్ లతో కలిసి అత్యంత వేగంగా F-X ప్రాజెక్ట్ ని పూర్తి చేయదానికి ఒప్పందాలని చేసుకుంది. ఇందులో అమెరికా ని కలుపుకోలేదు జపాన్ !
********************************
జపాన్ అమెరికాని ఎందుకు కలుపుకోలేదు ? అత్యంత ఆధునికం అని చెప్పుకునే అమెరికన్ టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు నిరూపితం కాలేదు. ఎప్పుడూ నాటో దేశాలతో కలిసి దాడులు చేయడం అదీ ఏమాత్రం ఆధునిక టెక్నాలజీ లెని దేశాలమీదనే దాడులు చేస్తూ వచ్చింది తప్పితే చైనా, రష్యా ల మీద తమ ఆధిక్యత ఎలాంటిదో నిరూపించలేకపోయింది. వారం క్రితం రష్యా,చైనాలు కలిసి అమెరికా కి తమ శక్తి ఎలాంటిదో చూపించాయి ! విషయం చాలా వరకు టెక్నికల్ అంశానికి చెందినది అవడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేయలేదు ! అదేమిటో ఒక సారి వివరంగా తెలుసుకుందాము !
************************
మార్చి 17, 2023
అమెరికాకి చెందిన ఐకాన్ గా చెప్పబడే నిఘా విమానం U2s డ్రాగన్ లేడీ స్పై [U2s Dragon Lady spy plane] ని రష్యా మరియు చైనా లు కలిసి కూల్చేశాయి ! ఈ వార్త ని వైరల్ కాకుండా జాగ్రత్త పడ్డారు కానీ చైనా చాలా తెలివిగా విషయం ఏమిటో కొన్ని డిఫెన్స్ వెబ్ మాగజైన్ల కి లీక్ చేసింది !
బడ్జెట్ సమస్యల కారణంగా U2s Dragon Lady spy plane ని 2026 కల్లా డీ కమిషన్ [తొలగించడం ] చేయాలని నిర్ణయం తీసుకుంది అమెరికా.
సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పుడు ఇదే U2s Dragon Lady spy plane చాలా కీలక మయిన మిషన్స్ ని నిర్వహించింది అప్పట్లో సోవియట్ భూభాగం మీద ! అఫ్కోర్స్ అప్పటి సోవియట్ ఈ U2s Dragon Lady spy plane ని MIG-31 తో ఘాట్ చేసి మరీ కూల్చేసింది! తమ భూభాగం మీద గూఢచర్యం చేస్తున్నది అంటూ సోవియట్ అప్పట్లో ప్రకటించింది. కూలిపోయిన U2s Dragon Lady spy plane యొక్క విడి భాగాలని సేకరించి భద్రపరిచినది సోవియట్ అప్పట్లో.
గత సంవత్సర కాలంగా అమెరికా తైవాన్ ని చైనా నుండి రక్షించుకోవడం కోసం శత విధాలా ప్రయత్నిస్తూనే వస్తున్నది కానీ చైనా భూభాగం మీద గూఢచర్యం చేయడంలో విఫలం అవుతూ వచ్చింది.
*************************
అత్యాధునిక సెన్సార్స్ కలిగిన U2s Dragon Lady spy plane ని చైనా కూల్చేసింది ! అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 U2s Dragon Lady spy plane లని కూల్చేసింది చైనా ! కానీ అమెరికన్ CIA విషయం బయటికి రానీకుండా జాగ్రత్త పడ్డా ఆలస్యంగా నైనా వెలుగులోకి వచ్చింది వార్త !
ఆకాశంలో 70 వేల అడుగుల కంటె ఎక్కువ ఎత్తులో ఎగిరే U2s Dragon Lady spy plane లని చైనా ఎలా కూల్చివేయగలిగింది ?
భూమి మీద ఉండే ఎంత శక్తివంతమయిన రాడార్ అయినా సరే 70 వేల అడుగుల [21 కిలోమీటర్లు ] ఎత్తులో ఎగిరే విమానాన్ని గుర్తించలేదు ! కేవలం రష్యా దగ్గర మాత్రమే 70 వేల అడుగుల ఎత్తులో ఎగిరే విమానాలని పసిగట్టగల రాడార్ వ్యవస్థ ఉంది కానీ ఆ రాడార్ గుర్తించగలదు కానీ మిసైల్ ని ఫైర్ చేయలేదు.
తైవాన్ భూభాగం నుండి పక్కనే ఉన్న చైనా మీద గూఢచర్యం కోసం అంటూ U2s Dragon Lady spy plane ని నియోగించింది అమెరికా కానీ వచ్చిన వాటిని వచ్చినట్లుగా చైనా కూల్చేసింది ! ఒక U2s Dragon Lady spy plane ని తైవాన్ భూభాగం మీద ఉండగానే చైనా కూల్చివేయగలిగింది. మిగతా 4 U2s Dragon Lady spy plane లని తన భూభాగం మీదుగా ఎగురుతున్నప్పుడు కూల్చివేసింది చైనా !
**************************
జపాన్ అమెరికా F-35 లని కాదని స్వంతంగా 6th జెనెరేషన్ ఎయిర్ సుపీరియారిటీ జెట్ ఫైటర్ ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం వెనుక U2s Dragon Lady spy plane ల వైఫల్యం కూడా ఒక కారణం ! నిజానికి గత 50 ఏళ్లుగా అమెరికా U2s Dragon Lady spy plane ని అప్డేట్ చేస్తూ వచ్చింది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ తో ! అత్యాధునిక ఎలెక్ట్రానిక్ సెన్సార్స్ ఉన్నాయని చెప్పుకుంటున్న U2s Dragon Lady spy plane ని ఏ మాత్రం క్లూ లేకుండా చైనా కూల్చివేయడంలో రష్యా పాత్ర ఉంది అని భావిస్తున్నారు…!!
Share this Article