ఎంత దారుణం..? ఈ మోడీ ఇక్కడ ప్రజాస్వామిక, నీతి శుద్దపూసలను సీబీఐ, ఈడీల పేరుతో వేధిస్తున్నది చాలక తన కంటిని ఇక అమెరికా మీద కూడా కేంద్రీకరించాడు… మోడీ ప్రపంచానికే ప్రమాదకారి అయిపోయాడు… హమ్మ, హమ్మ… ఎంత అమానుషం..? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద కూడా లిక్కర్ కేసులు పెట్టేస్తామని బెదిరించి, జార్జియా రాష్ట్ర ప్రతినిధులను ప్రలోభపెట్టి… హిందూ మత వ్యతిరేక చర్యలను సహించేది లేదని తీర్మానం చేయించాడు…
ఇక ఊరుకునేది లేదు… అమెరికాలో కూడా మహిళా రిజర్వేషన్లు, సమాన హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించాల్సిన తరుణం వచ్చేసింది… బీఆర్ఎస్ శాఖను అర్జెంటుగా అమెరికాలో ఓపెన్ చేయాల్సిందే… బీఆర్ఎస్ కేవలం దేశం కోసం కాదు, అంతర్జాతీయ సమాజం కోసం అని ఎలుగెత్తే సందర్భం వచ్చేసింది… సంతోషూ, అక్కడ మనవాళ్లు ఎవరున్నారో చూడు, తక్షణం వైట్ హౌజు ముందు ఫ్లెక్సీలు కట్టిద్దాం… అమెరికాకు కూడా తెలంగాణ మోడలే శరణ్యం అని ఊదరగొట్టిద్దాం…
న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు వాళ్లతో కేజ్రీవాల్‌తో ఫోన్లు చేయిద్దాం… కేజ్రీతో వాళ్లకు ‘మంచి సంబంధాలే’ ఉన్నాయిలే… యాంటీ హిందూ యాక్టివిటీని సహించేది లేదని జార్జియా రాష్ట్రం చెప్పడాన్ని ఎలాగూ మన కమ్యూనిస్టులు, మన ప్రతిపక్షాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి… నాన్ బీజేపీ రాష్ట్రాల అసెంబ్లీల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, జార్జియా ధోరణులను ఖండిస్తూ మనమూ తీర్మానాలు పాస్ చేయించాల్సిందే ఇక…
Ads
మోడీ మర్మమేంటి..? మెల్లిమెల్లిగా జార్జియాలాగే ఇతర స్టేట్స్‌నూ ప్రొ హిందూ వాతావరణంలోకి లాగేసి… అక్కడ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అడుగు పెట్టేసే రాజకీయ వ్యూహమే కదా… హమ్మా… ఇలాగైతే కష్టమే… ఓ అఖిలేషూ, ఏమోయ్ స్టాలినూ, ఏమమ్మా మమతా, బ్రదర్ ఠాక్రే కమాన్ కదలండి… కలుద్దాం, మోడీని దించేద్దాం, హిమాలయాలకు తరుముదాం… లేకపోతే కష్టమే…
లేకపోతే ఏమిటీ దారుణం చెప్పండి… అంతటి అమెరికాలో ఈ తొక్కలో ధ్యానం ఏమిటి..? యోగా ఏమిటి..? ఎంతటి తిరోగమనం ఇది..? అసలు మానవ జాతి మనుగడ సాధిస్తుందా ఇక..? ఐనా ఈ జార్జియా నాయకులు బుద్దిలేదా..? నాన్-హిందూ వైఖరులే ఆధునిక పురోగమన విధానమనే సోయి లేదా..? ఒకవైపు హిందూ విముక్త భారత్ కోసం భారతీయ పార్టీలు, నాయకులు నిద్రాహారాలు మాని కష్టపడుతుంటే, ఒక అగ్రరాజ్యపు రాష్ట్రం ఇలా వెనక్కి వెనక్కి నడవడం ఏమిటసలు..?
ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు జంధ్యాలు ప్రదర్శిస్తూ, గోత్రాల పేర్లు చెబుతూ, నేను శివభక్తుడినే అని తాండవం చేయాలి… గంగలో మునిగి, చేతికి కట్టిన రుద్రాక్షలు కనిపించేలా ఫోటోలు దిగాలి… ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందువును అని ప్రచారం చేయించుకోవాలి… పుష్కర స్నానాలు, పంచాంగ శ్రవణాలు చేయాలి… ఏ స్వామినో పట్టుకుని, మతమార్పడి ప్రచారమూ చేసుకోవాలి… అంతేగానీ టోటల్‌గానే ఈ ప్రొహిందూ ధోరణికి మళ్లడం మానవజాతికి ఎంత సిగ్గుచేటు… థూ, ఈ జార్జియా సమాజం ఇక బాగుపడదు… పడదు…
Share this Article