ఒక పత్రికలో ఒక స్టోరీ వస్తే… మళ్లీ దాన్ని టచ్ చేయడానికి వేరే పత్రికలు ఇష్టపడవు… ఎంగిలి స్టోరీగా భావిస్తాయి… కానీ సాక్షికి అవన్నీ ఏమీ పట్టవు… ఎవరు ఏం రాస్తున్నారో, ఎవరు పేజీల్లో ఏం పెడుతున్నారో తెలుసుకునే సోయి, చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు… కొన్ని అసాధారణ స్టోరీలు, ఫాలో అప్ తప్పనిసరయ్యే స్టోరీల విషయంలో మాత్రం ఎంగిలి స్టోరీలను వేరే కోణాల్లో, వాల్యూ యాడిషన్ చేసుకుని, తమ రీడర్లకు కొత్తగా ప్రజెంట్ చేస్తుంటారు… సాక్షికి ఆ తెలివి కూడా లేదు…
ఎంత తెలివిరాహిత్యం అంటే… నిన్న వెలుగు డెయిలీలో ఫస్ట్ పేజీలో వచ్చిన ఒక స్టోరీని దాదాపు అదే పైల్ ఫోటోతో, అదే హెడింగ్‌తో తను రాసుకుంది ఈరోజు… ప్రముఖంగా, పెద్దగా… దిగువ ఆ క్లిప్పింగులు చూడండి… అరగంటకో మరణం అనేది కామన్ హెడింగ్… పోనీ, అదేమైనా ఎక్స్‌క్లూజివ్ స్టోరీయా అంటే అదీ కాదు… ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విడుదల చేసిన ఓ పరిశోధన వివరాలు అవి… ఆల్‌రెడీ వెలుగులో వచ్చింది కాబట్టి ఇక ఆ స్టోరీని వేరే చిన్నాచితకా పత్రికలు కూడా ముట్టుకోలేదు… కానీ సాక్షి పిట్టముట్టింది…
Ads
ఒక పత్రికలో వచ్చిన స్టోరీని మరో పత్రిక లేటుగా క్యారీ చేయడం తప్పని కాదు… కానీ సేమ్ షేమ్ అచ్చేసుకోవడం దివాలాకోరుతనాన్ని సూచిస్తుంది… దురదృష్టవశాత్తూ సాక్షి డైరెక్టర్లకు గానీ, చైర్మన్‌కు గానీ పాత్రికేయం బేసిక్స్ కూడా తెలియవు… తెలిసినవాళ్లు ఎప్పుడో సాక్షి నాణ్యతను పట్టించుకోవడం మానేశారు… అందుకే జగన్ వాలంటీర్లతో సాక్షి పత్రికను ప్రభుత్వ సొమ్ముతో కొనిపించే జీవోలు రిలీజ్ చేసినా, ఆ అనైతిక పద్ధతులు కూడా సాక్షిని గెలిపించలేకపోతున్నయ్… ఈనాడును జయించలేకపోతున్నయ్… తాజాగా వచ్చిన ఏబీసీ సర్క్యులేషన్ ఫిగర్స్ కూడా ఇదే చెప్పాయి కదా…
కారణం… ఇదుగో, ఇలాంటి నాసిరకం ధోరణే… పెద్ద పత్రికలకు సాధారణంగా క్వాలిటీ సెల్స్ ఉంటాయి… పత్రికలో ఏమొస్తున్నాయి..? ఎలా ఉంటే బాగుండేది, ఎక్కడ పొరపాటు జరిగింది అనే రిపోర్టు మేనేజ్‌మెంట్‌కు ఇవ్వాలి… దాన్ని బట్టి మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకోవాలి… ఫాఫం, సాక్షిలో అదీ దిక్కులేనట్టుంది… ఈ తోకల్ని పట్టుకుని జగన్ గోదారి ఈదాలని అనుకుంటున్నాడు…
నిజానికి ఈ వార్త మొదటిరోజు మిస్సయ్యారు… సరే, మిస్ అనేది పత్రికల్లో సహజమే… కానీ ఏకంగా కుక్కలు అడిషనల్, డిప్యూటీ కలెక్టర్లనే పిక్కలు పీకిన వార్త నిన్నటిదే… అంతకుముందు హైదరాబాదులో ఒక పిల్లాడిని కొరుక్కుతిన్నాయి… వీథివీథిన కుక్కల బెడద… తెలంగాణను ఉద్దరించడానికే బాగా తెగ కష్టపడే బీఆర్ఎస్ సర్కారుకు ఇలాంటివి పట్టవు… ఈ స్థితిలో వెలుగులో వచ్చిన కుక్కల స్టోరీని మళ్లీ పబ్లిష్ చేయాలని సాక్షి గనుక అనుకుంటే… నిన్నటి స్పాట్ కూడా యాడ్ చేసి, మరింత వాల్యూ యాడ్ చేసి, కొత్తకొత్తగా ప్రజెంట్ చేయొచ్చు… అఫ్‌కోర్స్, అవన్నీ ఆలోచించే స్థితిలో సాక్షి పెద్దలు ఉంటేకదా…!!
Share this Article