పొద్దున్నే మిత్రులు ప్రభాకర్ జైనీ పోస్టు కనిపించింది… ‘‘నిన్న మొన్నటి వరకు ‘#శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో, ‘నాకు రోగమొచ్చింది, ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నా సినిమాను చూడండి’ అంటూ దీనంగా, రోగగ్రస్త లుక్ కోసం మేకప్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, కన్నీళ్ళు పెట్టుకున్న, సమంత నిన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘CITADEL’ కోసం అమెరికాలో అడుగుపెట్టి, అందమైన ఫోజులు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను వెర్రివాళ్ళను చేసింది…’’
నిజంగానే ఒక ప్రశ్న… సమంత సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నించిందా..? ఈ ప్రశ్నకు సమాధానం… అవును..! యశోద సినిమాకూ అంతే… సరిగ్గా దాని రిలీజుకు ముందు తన రోగాన్ని వెల్లడించింది… తరువాత గాయబ్… మళ్లీ శాకుంతలం సినిమా ప్రమోషన్లలో ముక్కు చీదుతూ, ఎగబీలుస్తూ, టిష్యూ పేపర్‌తో కెమెరాల ముందే తుడుచుకుంటూ ‘‘విసిగించింది’’… శాకుంతం సినిమా పరాజయానికి లక్ష కారణాలు కాగా వాటిల్లో ఒకటి ఇది కూడా…
ఒకవైపు శాకుంతలం సినిమాలో ఆమెను అతిలోక సుందరిగా చూపిస్తూ… దుష్యంతుడు ఆమెను చూడగానే పడిపోయినట్లు చిత్రిస్తూనే… ఇంకోవైపు సమంతను బయట మాత్రం ఓ రోగిష్టిగా చూపించడం ప్రేక్షకుల్లోకి సరైన ఫీల్‌తో వెళ్లలేదు… దిల్ రాజు, సమంత కోరుకున్న సానుభూతి రాలేదు కదా, ఎదురుతన్నింది… అసలే చైతూతో బెడిసిన ప్రేమ, పెళ్లి వ్యవహారం అంతకుముందే ఆమెపై ఓ నెగెటివ్ ఫీల్‌ను పెంచాయి ప్రేక్షకుల్లో…
Ads
చైతూతో పెళ్లి పెటాకులయ్యాక… పర్సనల్ స్టాఫ్‌తో అత్యంత సన్నిహితంగా ఫోటోలు దిగి, ట్వీట్స్ చేసింది… అదేదో పిచ్చి వెబ్ సీరీస్‌లో తమిళ తీవ్రవాదిలా కనిపించి, అందులో బరిబాతల నటిస్తే, దాన్ని తీసివేయించడానికి నాగార్జున నానా అవస్థలూ పడ్డాడని వార్తలొచ్చాయి… తన కుటుంబం పరువు పోతుందని భయపడ్డాడట… తరువాత ఊ ఉంటావా, ఊఊ అంటావా అనే ఓ వెకిలి ఐటం సాంగ్‌లో సమంత అడ్డదిడ్డంగా, ఎడ్డి చూపులతో నర్తించడం ఆమెకు వ్యక్తిగతంగా మైనసయింది… చైతూ కోసం అక్కినేని కుటుంబం రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసింది… కుటుంబంలోకి ఆహ్వానించింది… ఐనా ఆమె దాన్ని నిలుపుకోలేకపోయిందని ప్రేక్షకుల్లో ఓ భావన పెరిగిపోయింది…
ఈ స్థితిలో ఆమె రోగం మయోసైటిస్ గురించి చెప్పుకుంది… అదీ సరిగ్గా యశోద రిలీజుకు ముందు…! ఆ సినిమాకు సంబంధించి సమంత ఆశించిన సానుభూతి ఏమీ పెద్దగా వర్కవుట్ కాలేదు… ఇప్పుడిక శాకుంతలం… అసలు ఈ సినిమాయే ఓ నాసిరకం ప్రజెంటేషన్… రుద్రమదేవి సినిమాతోనే బోలెడంత విమర్శను మూటగట్టుకున్న గుణశేఖర్ ఈ సినిమాతో మరింత పెంచుకున్నాడు… ఓ ఔత్సాహిక చిన్న దర్శకుడికి ఈ సినిమా దర్శకత్వం అప్పగించినా బాగుండేదేమో…
సినిమా తారలు ప్రత్యేకంగా దిగివస్తారా..? వాళ్లూ మామూలు మనుషులేగా… రోగాలు, నొప్పులు వాళ్లకుండవా..? అనేది సమంత పోకడకు ఓ విఫల సమర్థన… ఒకవైపు శాకుంతలానికి ముక్కుచీదిన ఆమె సిటాడిల్ ప్రమోషన్‌కు మాత్రం మాంచి మేకప్పు, డ్రెస్సుతో హుషారుగా ఫోజులిచ్చింది… మరి శాకుంతలం ప్రమోషన్లలో శోకాలు దేనికి..? రోగంతో ఉన్నా, నా సినిమాను దయచేసి చూడండంటూ వేడికోళ్లు దేనికి..? ఐనా ప్రధాన కథానాయికకు రోగమొస్తే, జాలితో, సానుభూతితో ప్రేక్షకులు సినిమా చూస్తారా..? సమంత, దిల్‌రాజుల పిచ్చి గానీ…!! ఆమెకు రోగమొస్తే ప్రేక్షకులు కన్నీళ్లు కార్చేంత అభిమానం, ప్రేమ ఏమీ లేవు తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడు…!!
అన్నట్టు… సిటాడెల్ కోసం ప్రియాంక చోప్రా బరితెగించి, బరిబాతల కూడా నటించిందని వార్తలున్నాయి… మరి ఇండియన్ వెర్షన్‌లో సమంత ఏం చేసిందో… ఏమోలెండి… కర్మణ్యేవాధికారస్తే అని మరో శ్లోకంతో శోకం కవర్ చేసేయగలదు…
Share this Article