మతం అనేది తమకు చాలా ముఖ్యమని 2023 సంవత్సరంలో కేవలం 39 శాతం మందే అభిప్రాయపడ్డారని ఒక సర్వేలో వెల్లడైంది. అదే 1998లో అయితే ఈ శాతం 62గా వుందని బుధవారం న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ సర్వే పేర్కొంది.
ఇది ప్రజాశక్తిలో వచ్చిన ఓ వార్తలోని ఒక భాగం… చాలా గణనీయమైన మార్పు… చాలా ప్రాముఖ్యం, విశేషం ఉన్న పరిణామమే… మతం పట్ల విశ్వాసం, మతానుసరణ పట్ల అనాసక్తత వేగంగా పెరుగుతున్న తీరును ఇది స్పష్టం చేస్తోంది… అఫ్‌కోర్స్, ఇది కేవలం 1000 మంది అమెరికన్లపై మాత్రమే నిర్వహించిన సర్వే కావచ్చు… కానీ ఈ మెతుకు చాలు కదా, ఒక అంచనాకు రావడానికి…
చికాగో యూనివర్శిటీలో గత నెలలో దాదాపు 1000 మంది అమెరికన్లపై వాల్‌స్ట్రీట్ జర్నల్, ఎన్‌ఒఆర్‌సిలు ఈ సర్వే నిర్వహించాయి. మతం ప్రాముఖ్యతతో పాటూ వివిధ విలువలు అమెరికన్లకు ఎంత కీలకమైనవో ఈ సర్వేలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 1988 నుండి 2012 వరకు ప్రపంచ జనాభాలో కేవలం 2 నుండి 3 శాతం మందే నాస్తికులు వున్నారని ఎన్‌ఓఆర్‌సి డేటా పేర్కొంది. కానీ 2021 నాటికి ఈ సంఖ్య జనాభాలో 7 శాతానికి పెరిగింది.
Ads
తామెన్నడూ మతపరమైన కార్యక్రమాలకు హాజరు కాలేదని 1988లో 17 శాతం మంది అమెరికన్లు చెప్పారు. 2021లో, ఆ సంఖ్య 31 శాతానికి పెరిగింది. అమెరికాలో, ప్రతి ఏటా 6 నుండి 10 వేల చర్చిల దాకా మూత పడుతునాుయి. వాటిని తిరిగి అపార్ట్‌మెంట్లుగా, లాండ్రీలుగా, స్కేటింగ్ పార్క్‌లుగా మారుస్తున్నారు. లేదా మొత్తంగా కూలగొట్టేస్తున్నారని ఆ సర్వే పేర్కొంది…
క్రిస్టియానిటీకి ప్రధానకేంద్రంగా ఉన్న అమెరికాలో ఏటా 6 నుంచి 10 వేల ప్రార్థన స్థలాలను కూల్చేస్తున్నారనే వాక్యం విస్మయకరంగానే ఉంది… ఒకవైపు తమ సొంత మతస్థులే మతాన్ని కాదంటుంటే… వేర్వేరు దేశాల్లో క్రిస్టియానిటీ వ్యాప్తికి ఆ మతబోధకులు విపరీతంగా ప్రయత్నిస్తున్న తీరు ఆశ్చర్యమే… నిమ్నవర్గాల ప్రజలు హిందూమతాన్ని డిస్ ఓన్ చేసుకుంటున్నందున, క్రిస్టియానిటీ ప్లస్ ఇస్తాం మతవ్యాప్తి బాగా ఉన్నందున భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు…
మతం పట్టని చైనా పాలకుల కారణంగా బౌద్ధం కూడా పెద్దగా వ్యాప్తికి నోచుకోవడం లేదు… తూర్పు దేశాల్లో కూడా నాస్తికత్వం జాడలు పెరిగిపోతున్నాయి… ఎటొచ్చీ ప్రపంచంలో ఇస్లాం మాత్రమే తగ్గడం లేదు… షియా, సున్నీల ఘర్షణ కొంత ఆ మతంలో అశాంతికి దారితీస్తున్నా సరే, స్థూలంగా ఆ మతవ్యాప్తి ఏమీ తగ్గడం లేదు… అమెరికా క్రిస్టియానిటీకి వస్తే ఏటా వేల ప్రార్థన స్థలాలను కూలగొడుతున్నారనే వాక్యం అకస్మాత్తుగా చదివితే నమ్మేట్టుగా ఉండదు… కానీ చికాగో యూనివర్శిటీ సర్వే అదే చెబుతోంది…
ప్రస్తుతం ప్రపంచంలో క్రిస్టియన్లు 220 కోట్లు, ముస్లిమ్స్ 160 కోట్లు ఉండగా, మతం అక్కర్లేదని అంటున్నవాళ్లు ఏకంగా 110 కోట్లకు పెరిగినట్టు సమాచారం… అంటే 16.3 శాతం మంది… కాగా హిందువులు 100 కోట్లు, బౌద్ధులు 50 కోట్ల వరకూ ఉన్నట్టు అంచనా… ఏ మతస్థులు ఎందరు అనే లెక్కకన్నా… నాస్తికులు, మతమంటే ఆసక్తి లేనివాళ్లు, మత కార్యక్రమాల్లో పాలుపంచుకోనివాళ్ల సంఖ్య మాత్రం వేగంగా పెరుగుతోంది… ఇదిలాగే వేగంగా పెరిగితే… నిజంగానే ప్రపంచం నుంచి మతం మాయమవుతుందా..? ఏమో… డౌటే…!!
Share this Article