Murali Buddha………… శ్రీకృష్ణ కమిటీ నివేదికతో TDLP లో సంబరాలు, నా జోస్యమే నిజమైంది… ఓ జ్ఞాపకం
తెలంగాణ అంశంపై వేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చింది . అసెంబ్లీలోని TDLP కార్యాలయంలో ఉన్నాం … కమిటీ నివేదికలో తొలి సిఫారసు టీవీ స్క్రీన్ పై కనిపించగానే TDLP లో ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి . తొలి సిఫారసు రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా అలానే ఉంచాలి అని … Tdlp లో సిబ్బంది, నాయకులు ఒకరినొకరు అభినందించుకున్నారు … అక్కడ తెలంగాణ సిబ్బంది ఎలాగూ లేరు… అంతా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారే …
శ్రీకృష్ణ కమిటీ తొలి సిఫారసు సమైక్యాంధ్ర అని రావడంతో వారి ఆనందం సహజమే … తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజి , రాయల తెలంగాణ , ఇలా వరుసగా ఐదు సిఫారసుల తరువాత , చిట్ట చివరగా ఆరవ అంశం తెలంగాణ ఏర్పాటు … మొదటి అంశానికే ప్రాధాన్యత ఉంటుంది కానీ ఆరవ అంశం వరకు ఎందుకు వస్తారని Tdlp లోనే కాకుండా అసెంబ్లీ ఆవరణలో ఉన్న అన్ని పార్టీల శాసన సభ్యుల కార్యాలయాల్లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారు సంబరంతో ఒకరినొకరు కౌగిలించుకొని అభినందించుకున్నారు …
Ads
Tdlp లో ఇంకాస్త ఎక్కువ ఆనందం … పానకంలో పుడకలా వారి ఆనందానికి మనమెందుకు అడ్డు అని నవ్వుకుంటూ tdlp లో మెట్లు దిగి కిందికి వస్తుంటే, టీడీపీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్ర శేఖర్ రెడ్డి కనిపించారు . నిఖార్సైన బాబు అభిమాని … రాయడానికి కాకపోయినా వివిధ అంశాలపై నిర్మొహమాటంగా చర్చించుకునే వాళ్ళం .. శ్రీ కృష్ణ కమిటీ నివేదికపై నువ్వేమనుకుంటున్నావ్ అని రావుల చర్చ మొదలుపెట్టారు ..
వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలి అనుకొని, అక్కడేమీ మాట్లాడలేదు, కానీ కమిటీ నివేదికతో వారు సంబరపడే విషయం ఏమీ లేదు .. నివేదిక గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ? సోనియా గాంధీ గారూ, తెలంగాణపై మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి … అని కమిటీ చెప్పింది, అంతే అన్నాను … రావుల శేఖర్ రెడ్డి tdlp లో ఆనందంతో ఊగి పోతున్న వారిని చూస్తూ …. నీ అభిప్రాయం కరెక్ట్ ఎంతైనా సీనియర్ సీనియరే అన్నారు .2014 ఎన్నికలకు ముందు తెలంగాణ వస్తుంది … అప్పటి వరకు కాల యాపన కోసం ఈ కమిటీలు అని చెప్పాను . అదే జరిగింది .
తెలంగాణ రావాలి అనేది తెలంగాణ వారి కోరిక , రావద్దు అనేది వ్యతిరేకించే వారి కోరిక … ఇందులో తప్పేమీ లేదు … కోరికకు , అంచనాకు తేడా గ్రహిస్తే అంచనా తప్పదు … జర్నలిస్ట్ కు కోరిక నిజం కాకపోవచ్చు కానీ , అంచనాను కోరిక డామినేట్ చేయకూడదు …
తెలంగాణ ఇచ్చింది , తెచ్చింది కాంగ్రెస్ కదా ? కాంగ్రెస్ ను ఆదరించక పోవడం అన్యాయం కదా ? అని కొందరు వాదిస్తుంటారు … తెలంగాణ కోసం ఉద్యమించింది తెలంగాణ ప్రజలు , నాయకత్వం వహించింది కెసిఆర్ , ఇచ్చింది సోనియా గాంధీ గారు . ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేక పోయినా తెలంగాణ రాక పోతుండే .. అంటే సోనియా ఇచ్చింది కదా ? అంటే కాంగ్రెస్ ఇచ్చింది కదా ? కాదు సోనియా గాంధీ ఇచ్చారు .
సోనియా గాంధీ ఒక్కరే కాంగ్రెస్ కాదు .. ఇవ్వ వద్దు అని అడ్డుకున్న ysr , కిరణ్ కుమార్ రెడ్డి , లగడ పాటి నాయకత్వంలో అడ్డుకున్న ఆంధ్ర కాంగ్రెస్నాయకులు , ysr నాయకత్వంలో తెలంగాణ వద్దన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు …. సమైక్యాంధ్ర కోసం జగన్ పిలుపు మేరకు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన కొండా సురేఖ , తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మెలో ఉంటే, కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలను హైదరాబాద్ తరలించిన డీకే …. అందరూ హేమాహేమీలైన కాంగ్రెస్ నాయకులే …
వారి అడ్డగింపు మహోద్యమాన్ని జనం మరిచి పోలేదు … అదే విధంగా సోనియా గాంధీ సహాయాన్ని మరిచిపోరు … చాలా మంది బలవంతులు అడ్డుకున్నా పొన్నం ప్రభాకర్ , మధుయాష్కీ గౌడ్ లాంటి ఎంతో మంది పార్టీలోని పెత్తందార్లను వ్యతిరేకించి కూడా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు . అందుకే కాంగ్రెస్ ను రెండో స్థానంలో నిలిపారు ..
తెరాస , కాంగ్రెస్ , టీడీపీ , బీజేపీ , ysr కాంగ్రెస్ , జనసేన ఏ పార్టీని ఐనా ఓటర్లు గెలిపించవచ్చు . ఓటర్లు తప్పు చేయరు … ఏ సమయానికి తగిన నిర్ణయమో వాళ్లు తీసుకుంటారు .. అంటే సోనియా గాంధీ , కాంగ్రెస్ వేరు అంటావా..? కాంగ్రెస్ లో సోనియా గాంధీ ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు …
Share this Article