Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవిపై హత్యాయత్నం..! ఆ యువకుడెవరు..? తర్వాతేమైంది..?!

November 30, 2025 by M S R

.

ఏదో చిరంజీవి పాత సినిమాకు సంబంధించిన ఫోటోల కోసం గూగిలింగ్ చేస్తుంటే… ఓ పేపర్ క్లిప్పింగుకు సంబంధించిన ఇమేజ్ కనిపించింది… హెడింగే స్ట్రయికింగ్‌గా ఉంది… కానీ ఎన్ని ఎడిట్ ప్రయత్నాలు చేసినా ఆ అక్షరాల్ని పూర్తిగా, సులభంగా చదివేలా మార్చలేకపోయాను…

నిజానికి అది ఏ పత్రికో కూడా తెలియడం లేదు… మరణమృదంగం సినిమా షూటింగ్ జరుగుతున్న కాలం… మద్రాసు డేట్‌లైన్ మే 10… చిరంజీవిపై విషప్రయోగానికి యత్నం అనేది హెడింగ్… చాలా సీరియస్ వార్తే…

Ads

అప్పట్లో నాకు చిరంజీవి అంటే అభిమానం ఉండేది… వీపులకు బద్దలు కట్టుకుని ఫైట్లు, డాన్సులు చేసే ముసలి హీరోల నడుమ ఒరిజినల్ మూవ్స్‌తో చిరంజీవి అప్పట్లో తెలుగు ప్రేక్షకజనానికి నిజమైన హీరో అనిపించేవాడు… ఐనా ఈ వార్త చదివిన గుర్తులేదు నాకు…

సరే, కష్టమ్మీద ఆ పేపర్ క్లిప్పింగులోని పదాల్ని కూడబలుక్కుని చదువుతుంటే ఇలా ఉంది… యథాతథంగా ఇదుగో…

‘‘సుప్రసిద్ధ నటుడు శ్రీ చిరంజీవి మంగళవారం నాడు కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయనపై విషప్రయోగ యత్నం జరిగింది. అయితే ఆ యత్నం విఫలం కావడంతో ఆయనకు ఏ ప్రమాదం వాటిల్లలేదు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.

.

chiru

.

మద్రాసులోని రేస్ కోర్స్ మైదానంలో మంగళవారం ఉదయం శ్రీ చిరంజీవి క్రియేటివ్ కమర్షియల్స్ వారి షూటింగులో పాల్గొంటున్నారు. ఆ సమయంలో దాదాపు రెండు బస్సుల్లో సినీ అభిమానులు, యాత్రికులు షూటింగ్ జరిగే ప్రాంతానికి వచ్చారు. వారు శ్రీ చిరంజీవిని కలుసుకోవాలని, కరచాలనం చేయాలని ఉబలాటపడుతూ వచ్చారు.

వారిలో ఒక యువకుడు నేడు తన పుట్టిన రోజని, తన బర్త్ డే కేక్ తన అభిమాన నటుడికి తినిపించాలన్న తపనతో వచ్చానని చెబుతూ శ్రీ చిరంజీవి నోటిలో కేకు ముక్క పెట్టడానికి యత్నించాడు. అయితే చిరంజీవి ‘నీ బర్త్ డే అయితే నేను స్వీట్ నీకు తినిపించాలి గానీ, ఇదేమిటయ్యా’ అంటూ అతన్ని వారించడానికి యత్నించాడు.

అయినా ఆ యువకుడు బలవంతంగా శ్రీ చిరంజీవి నోటిలో కుక్కడానికి యత్నించాడు. శ్రీ చిరంజీవి అతని నుంచి తప్పించుకోవడానికి నెట్టడంతో నోటిలో నుంచి కేక్ కింద పడింది. ముక్కలైన కేక్ నుంచి వూడిపడిన ఓ పాకెట్ కనిపించింది. దాంట్లో గోధుమ రంగులో ఏదో పౌడర్ వుంది. ఆ దృశ్యం చూసేసరికి ఆ సమయంలో అక్కడ వున్న దాదాపు 300 మంది నిర్ఘాంతపోయారు.

కేక్ నోట్లో నుంచి కింద పడినా కొద్దిగా పొడి నాలుకకు అంటడంతో శ్రీ చిరంజీవి కొంత మత్తు సోకినట్టు వుండిపోయాడు. వెంటనే ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ గోధుమ రంగు పొడిని రసాయన పరీక్షకు పంపారు. తర్వాత ఈ విషయమై ప్రశ్నించగా తాను చిరంజీవి అభిమానినని, తనకు ఆ  పొడి గురించి  బొత్తిగా తెలీదని చెప్పారు’’

ఇదీ ఆ వార్త… అప్పట్లో అన్ని జాతీయ న్యూస్ పేపర్లలో మొదటి పేజీల్లో ఈ వార్త ప్రముఖంగా వచ్చిందని మరో సైటులో కనిపించింది. చిరంజీవి పెదాల రంగు అప్పటికే మారిపోయిందనీ, వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడనీ రాశారు….

(వార్తల్లో గతంలో శ్రీ, గారు రాసేవాళ్లు, ఈనాడు దాన్ని బ్రేక్ చేసి, ఎంత పెద్దవారయినా సరే అవి వాడటం మానేసింది… ఈ వార్త అంతకుముందుది అన్నమాట…)

ఇదంతా సరే గానీ… ఆ రసాయన పరీక్షలో ఏం తేలింది..? అసలు ఆ యువకుడి చిరంజీవి మీద ఎందుకు కోపం పెంచుకున్నాడు..? ఏకంగా హత్యప్రయత్నం ఎందుకు చేశాడు..? చివరకు పోలీసులు ఏం తేల్చారు..? కోర్టు ఏమని తీర్పు చెప్పింది..? చిన్న ఫాలోఅప్ వార్త కూడా కనిపించలేదు… చిరంజీవి వంటి ప్రముఖుడిపై హత్యాప్రయత్నం జరిగితే అసలు పత్రికలు ఫాలోఅప్ చేయకపోవడం ఏమిటి..? (తెలిసినవాళ్లు చెప్పగలరు…)

అదే ఇప్పుడైతేనా..? యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమర్లు కొన్నిరోజులపాటు తామే దర్యాప్తు చేసి, తామే చార్జిషీట్లు కూడా పెట్టేసి…. వీలయితే చిరంజీవి ఎదుగుదలను జీర్ణించుకోలేని ఇతర హీరోలే ఆ యువకుడిని పంపించారని కూడా చెప్పేసేవారేమో..? చిరంజీవి కూడా దీని గురించి మళ్లీ ఎక్కడా చెప్పినట్టు లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం హరీషుడు..! మామ పార్టీ నుంచి కత్తిరించబడుతున్నాడా..?!
  • ఒకే ఒక ఇల్లు… మడమ తిప్పని స్వాభిమాన పోరాటం… ఎవరికీ జంకేదే లేదు…
  • The Lost Map … లీలగా ఓ జ్ఞాపకం… వేల మైళ్ల వెతుకులాట…
  • వందోసారి చూస్తున్నా సరే… కఠినాత్ముడైనా సరే… కళ్లు తడుస్తాయి…
  • టీ20 కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్‘..! జోరుగా ప్రచారం.., జరిగితే శుభమే..!!
  • లెన్స్‌కార్ట్ బాగోతాల అసలు దోషి ఓనరే… అడుగడుగుకో అబద్ధం, వంచన…
  • ప్రజల్లోకి రీ-ఎంట్రీ..! ఈ ఒక్క సభ కోసమేనా..? ఇక ప్రజల్లోనే ఉంటాడా..?
  • బ్యాక్ టు బేసిక్స్..! పుస్తకాలు- పెన్నులు మళ్లీ…! మనమూ మారదాం..!!
  • మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ లింక్… ఇదుగో క్లారిటీ…
  • తెలంగాణపై విషం కాదు తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions