హఠాత్తుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో ఎవరు ప్రారంభించారో తెలియదు గానీ… పక్కా బీఆర్ఎస్ మద్దతుదారులు, పనిలోపనిగా చంద్రబాబు వ్యతిరేకులు… ఆ ప్రచారంలో రెండు ఫోటోలు… అప్పుడెప్పుడో చంద్రబాబు అమరావతిలో కట్టిన తాత్కాలిక సచివాలయం… కేసీయార్ కట్టించిన కొత్త సచివాలయపు ఫోటో మరొకటి…
2023లో నిర్మాణం జరుపుకున్న తెలంగాణ శాశ్వత సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చు 600 కోట్లు… 2016లో చంద్రబాబు కట్టిన టెంపరరీ సెక్రెటేరియట్ ఖర్చు 750 కోట్లు అంటూ వ్యాఖ్యలు… అంటే… చూశారా, చంద్రబాబు ఆఫ్టరాల్ టెంపరరీ, పిట్టగూడు వంటి ఓ సెక్రెటేరియట్ కట్టేసి 750 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతుండగా… ఏడేళ్ల తరువాత కేసీయార్ జస్ట్, 600 కోట్లతో పర్మినెంట్, మాన్యుమెంట్ వంటి సెక్రెటేరియట్ కట్టాడు…
మావోడు పనిమంతుడు, కానీ చంద్రబాబు అసమర్థుడు, పనికిమాలినోడు, పైగా ఎక్కువ ఖర్చు, అంటే ఎంత కొట్టేసి ఉంటాడో అని రకరకాల భావాలు ప్రచారం చేసే తెలివైన పోస్టు అది… చాలామంది షేర్లు చేశారు… కావాలని దీనిపై ప్రమోషన్ వర్క్ సాగించినట్టుంది… అంటే ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసే ప్రయత్నం సాగింది…
Ads
ఈ ప్రచారంతో బీజేపీకి, జనసేనకు వచ్చేదేమీ లేదు, పైగా నచ్చదు కాబట్టి నో చాన్స్… సేమ్, కాంగ్రెస్ అసలే చేసి ఉండదు, పైగా కాంగ్రెస్‌లో ఇలాంటి ఖర్చు భరించే కేరక్టర్లు ఏమీ లేవు… కాంగ్రెస్ నాయకులకు సొంత ఇమేజీ తప్ప తెలివైన పోస్టులతో జనం మెదళ్లను ప్రభావితం చేసే సోషల్ మీడియా వ్యూహాలు ఉండవు… పోనీ, తక్కువే అనుకుందాం… బీఆర్ఎస్ క్యాంపే అనుకుందాం… కానీ దేనికి..?
కొత్త సెక్రెటేరియట్ మీద సానుకూల ప్రచారం… ప్లస్ దాని మీద నెగెటివ్ పబ్లిసిటీ జరకుండా ముందుగానే ఓ ఎత్తుగడగా పాజిటివ్ పబ్లిసిటీని హోరెత్తించడం… వంగి వంగి దండాలు పెడుతూ, సాగిలబడి, పాలకుడి పాదాల మీద దొర్లుతున్నట్టుగా… ఈనాడు ఆమధ్య ఫుల్ పేజీ ప్రత్యేక కథనాల్ని వేసింది తెలుసు కదా… కేసీయార్ అది చూశాడో లేదో, నచ్చిందో లేదో అనుకున్నట్టుంది… ఈరోజు మరొకటి వదిలారు… బుద్ధుడి విగ్రహంతోసహా కనిపించే ఫోటోలు, అంబేడ్కర్ బొమ్మ కూడా కనిపించేలా సెక్రెటేరియట్ ఫోటోల్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు ఆమధ్య… ఇప్పుడిక అమరావతి సెక్రటేరియట్‌తో పోలిక… చూశారా, కేసీయార్ ఎంత పనిమంతుడో అని చెప్పడం ఉద్దేశం…
(ఇది కూల్చేయబడిన పాత ముఖ్యమంత్రి కార్యాలయం… యాంటిక్, హిస్టారిక్… ఈ భవనంలో కనిపించే చెక్క, వాస్తు నిర్మాణం, చివరకు తివాచీలకు కూడా విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నయ్… అవన్నీ శిథిలాల్లో కలిసిపోయాయి…)
కొత్త నిర్మాణాల్ని కూడా వాస్తు, ఫైర్ సేఫ్టీ సాకుతో కూల్చేయడమే అబ్సర్డ్… కూల్చేసిన భవనాల్లో కొత్తగా నిర్మించిన భవనాలు కూడా ఉన్నయ్… అచ్చంగా ప్రజాధనాన్ని మట్టిలో కలపడమే… అమరావతి సెక్రెటేరియట్ మాత్రమే కాదు, పాలకులు ఏ భవనాలు నిర్మించినా అందులో చాలా మతలబులు ఉంటయ్… ఆ బురద జోలికి పోకుండా ఈ ఖర్చు సంగతి చూద్దాం…
ఇప్పుడు 600 కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కదా… అది 600 కాదు, అనేకసార్లు దాని నిర్మాణ వ్యయాన్ని సవరించి, చివరకు 400 కోట్ల నుంచి 1600 కోట్ల దాకా పెంచారని వెలుగు పత్రిక ఫస్ట్ పేజీ స్టోరీ ఫ్లాష్ చేసింది… బహుశా రేపు నమస్తే తెలంగాణ దీనికి కౌంటర్‌గా ఏమైనా రాస్తుందేమో మరి… ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజు మీద నిన్న ఆంధ్రజ్యోతి బ్యానర్ స్టోరీ చేస్తే, దాన్ని తిట్టిపోస్తూ ఈరోజు నమస్తే తెలంగాణ ఏదేదో వివరణ ఇచ్చుకునే విఫల ప్రయత్నం చేసింది…
సోషల్ మీడియాలోనే కొందరు సరైన సోయితో పోస్టులు పెట్టారు… కొత్త సెక్రెటేరియట్ బొమ్మను, ఉస్మానియా హాస్పిటల్ భవనం బొమ్మను పెట్టి… ఇప్పుడు ఏది అవసరం అని ప్రశ్నించారు… కరెక్ట్… పాలకుడి ప్రయారిటీలకు ఓ దశ లేదు, ఓ దిశ లేదు…! కొందరేమో నేడు ఓ బాలిక ఓపెన్ నాలాలో పడి మరణించిన ఉదంతాన్ని పేర్కొంటూ, ఖర్చు పెట్టాల్సింది ఏ పనుల మీద అని ప్రశ్నించారు… బహుశా బాలిక మరణాన్ని ‘‘యాక్ట్ ఆఫ్ గాడ్’’ అని కొట్టిపారేస్తారేమో…!!
Share this Article