పార్ధసారధి పోట్లూరి ……….. The Kerala Story ! ఫస్ట్ హాండ్ రివ్యూ !
The Kerala Story సినిమా దర్శకుడు : సుదీప్తో సేన్ [Sudepto Sen]
నటీ నటులు : ఆదా శర్మ, యోగీత బిహానీ తదితరులు.
Ads
సినిమా నిడివి [రన్ టైమ్ ] 138 నిముషాలు.
ముందుగా సినిమాలో ఎక్కడా కూడా 32,000 మంది కేరళ నుండి ISIS టెర్రర్ గ్రూపులో చేరినట్లు చెప్పలేదు, చూపించలేదు. ఆ ప్రచారం అబద్ధం.
దర్శకుడు ముందుగా కధకి సంబంధించి బాగా రీసర్చ్ చేశాడు అనిపిస్తుంది సినిమా చూస్తే !
ఇక కధలోకి వస్తే …. ముగ్గురు నర్సింగ్ యువతులు బ్రెయిన్ వాష్ చేయబడి ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతారు. తరువాత బలవంతంగా ISIS టెర్రరిస్ట్ గ్రూపులోకి పంపబడతారు. ఎలాగోలా ISIS నుండి బయటపడి, మన దేశంలోకి వస్తారు కానీ రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసు అధికారులకి తాము ముగ్గురూ ఎలా వంచించబడి ఎన్ని దుర్మార్గాలని అనుభవించవలసి వచ్చిందో చెప్పడం మొదలు పెట్టడంతో సినిమా అసలు కధలోకి వెళ్ళడం మొదలవుతుంది.
*************************
సినిమా చూస్తున్నంత సేపు కుర్చీలో నుండి లేవాలని అనిపించదు ఈవెన్ ఇంటర్వల్ లో కూడా ! మొదట్లోనే చెప్పినట్లు దర్శకుడు సుదీప్తో సేన్ మొదట నిజ సంఘటనలని బాగా స్టడీ చేశాకే కధని సిద్ధం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. సినిమాలో ఒక్కటే లోపం ఉంది…. అది సినిమాటోగ్రఫీ ! అఫ్కోర్స్ లో బడ్జెట్ సినిమా కాబట్టి సర్దుకుపోవచ్చు !
****************************
సినిమాలో ఎక్కడ కూడా ప్రత్యేకించి ఒక వర్గాన్నికానీ, ఒక మతాన్ని కానీ కించపరచే విధంగా సంభాషణలు కానీ దృశ్యాలు కానీ లేవు అయితే సెన్సార్ బోర్డ్ వారు మొత్తం 10 సీన్లకి కట్ చెప్పిన తరువాతే సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి అలా కట్ అయిన వాటిలో ఏమన్నా ఉండి ఉండవచ్చు. హింస, రేప్ దృశ్యాలు ఉన్నాయి కాబట్టి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు.
హింస, రేప్ దృశ్యాలు లేకపోతే అది ISIS టెర్రర్ గ్రూపుకి సంబంధించినది కాకుండా పూర్తి అవదు కాబట్టి అవి తప్పని సరి. ముఖ్యంగా ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వెళ్ళి సినిమా చూడాలి A సర్టిఫికెట్ ఉన్నా సరే ! లేకపోతే అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసే అవకాశం ఉండదు!
Share this Article