Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెళ్లి చేసుకుంటే రోజూ ఒకడి మొహమే చూడాలి :: వరలక్ష్మి శరత్ కుమార్

May 24, 2023 by M S R

Sai Vamshi……   సమూహంలో ఏకాంతం.. ఏకాంతంలో సమూహం

NTV యాంకర్: ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారూ…?

వరలక్ష్మి శరత్‌కుమార్: First of all, Marriage is not a Membership. I feel funny when people ask about Marriage. Marriage is not an Ambition. పాలిటిక్స్‌లోకి రావాలి అనేది ఒక Ambition. ఒక మంచి పని చేయాలనేది Ambition. పెళ్లి చేసుకుని ఎవరికి ఉపయోగం? లవ్ చేస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు పెళ్లి చేసుకోవచ్చు. లవ్ చేయకుంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు? It’s a waste of Time. పెళ్లి చేసుకుంటే ఒకే ముఖం రోజూ చూడాలి.

Ads

యాంకర్: ఇది చాలా Controversial Statement..

వరలక్ష్మి: అలా కాదు. నువ్వు ఒకరిని ప్రేమిస్తే ఆ మనిషితో జీవితాంతం ఉండటం కోసం పెళ్లి చేసుకోవచ్చు. అంతేకానీ, ఎవరో బలవంతం చేస్తున్నారని పెళ్లెందుకు చేసుకోవాలి? ఒంటరిగా ఉండొచ్చు కదా! ఇప్పుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదు. ఎవరైనా వెళ్లి అడుగుతున్నారా? మరి ఆడవాళ్లని ఎందుకు అడుగుతారు? ఆడవాళ్లు వాళ్ల కోసం వాళ్లు బతకగలరు. సంపాదించగలరు. ఖర్చుపెట్టగలరు. దేనికీ మగవాళ్ల మీద ఆధారపడనవసరం లేదు.

యాంకర్: మీకు ఎవరి మీదా లవ్ ఫీలింగ్ రాలేదా?

వరలక్ష్మి: వచ్చింది..‌ పోయింది. వచ్చింది..‌ పోయింది.

* * *

ఈ ఇంటర్వ్యూ తరువాత నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మీద బోలెడన్ని ట్రోల్స్, దాంతోపాటు Character Assassination కూడా జరగొచ్చు. కానీ ఆమె మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా కొట్టిపారేసేది లేదు. ఒక్క మాట కూడా అబద్ధం లేదు.

‘పెళ్లి చేసుకుంటే ఒకే ముఖం రోజూ చూడాలి..’ As an Unmarried Man, I bow to her. చిట్టచివరికి ఒక మహిళ ఆ మాట ధైర్యంగా చెప్పినందుకు! ఈ మాట చెప్పగానే జనాల ఆలోచనంతా సంభోగం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని రోజూ ఒకే ముఖం చూడటం ఇష్టం లేని వారు రోజుకో వ్యక్తితో శారీరక సుఖం కోసం వెంపర్లాడతారన్న భ్రమలో ఉంటారు. అందుకే పెళ్లి వద్దంటున్నారని అనుకుంటారు. Unmarried Men and Women శారీరక అవసరాల గురించి ఆరాలు తీయడం మొదలు పెడతారు. కిటికీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా అవివాహితులను వ్యభిచారులుగా భావిస్తారు.

Hello Folks! Wake Up. కాస్త నిద్ర లేవండి! పెళ్లిళ్లు చేసుకుని బయట బోలెడన్ని యవ్వారాలు నడిపే వాళ్లున్న సమాజంలో ఉన్నాం. ఉద్యోగ జీవితంలో బోలెడన్ని అబద్ధాలు, మోసాలు. ఇంక వ్యకిగత జీవితంలో కూడా ఆ మోసాలు అవసరమా? No Need. రోజూ ఒకే ముఖం చూడటం ఇష్టం లేకపోవడం అంటే ప్రతి రాత్రీ కొత్త కొత్త శృంగార అనుభవాలు పొందాలన్న ఆరాటం కాదు. కనిపించిన వాళ్లనల్లా గోకి దుప్పట్లోకి లాగడం కాదు. It’s a Free Space Concept. ఏకాంతాన్ని ఎంజాయ్ చేయడం. ఆ ఏకాంతంలో తమ ఉనికిని తాము గుర్తించడం. అస్తిత్వాన్ని కాపాడుకోవడం. మరో వ్యక్తి అవసరం లేని జీవితాన్ని జీవించి చూపడం. మరి శృంగార జీవితం వద్దా? అది వ్యకిగత ఇష్టం. కావాలని అనిపిస్తే నచ్చినవారితో, వాళ్ల అనుమతితో చేస్తారు. మరి అది తప్పు కాదా? ఇప్పుడు ఎంతమంది భార్యాభర్తల మధ్య Marital అత్యాచారాలు లేవు? ఆ నీచమైన విషయంతో ఏమాత్రం పోల్చలేని గౌరవప్రదమైన సంగతి ఇది. పరస్పర సమ్మతి సంభోగం…

ఒక రిలేషన్ షిప్‌లో ఉంటూ మరో చోట సంబంధాలు నడపడం ఇష్టం లేక ఒంటరిగా మిగిలిపోవాలని కొందరికి ఉంటుంది. ఏ బంధం ఏర్పరచుకోక, నచ్చిన వారితో మెలిగే అవకాశం, అధికారం అందరికీ ఉంది. Who can deny it? Even Supreme Court can’t interfere in it. అదొక జీవన విధానం. అదేమీ తప్పు కాదు. దానికి మీ అతిస్పందనలు (Over Actions) ఆపండి.

And Finally, మా పెళ్లిళ్లు మా వ్యకిగత అభిప్రాయాలు. మీ ప్రశ్నలు, పరామర్శలు, సలహాలు, సోది పురాణాలు మాకొద్దు. మీరెంతో అక్కరతో అడిగినా సరే, ఆ అక్కర మాకు అక్కర్లేదు. Unmarried Men and Women ఏం చేస్తారు? రాత్రుళ్లు ఎలా ఉంటారు? సంభోగం కోసం ఏ మార్గాలు ఆశ్రయిస్తారు? శారీరక అవసరాలు ఎలా తీర్చుకుంటారు.. ఇవన్నీ మీకెందుకు? ఇలాంటి తిక్కతిక్క ప్రశ్నలు మీకు మీరే వేసుకొని, మానసిక ఒత్తిడితో గుండెపోట్లు తెచ్చుకోకండి. మా మానాన మమ్మల్ని వదిలి, మీ మానాన మీరు కాస్త ప్రశాంతంగా బతకండి.

సమూహంలో ఏకాంతంగా ఎలా బతకాలో.. ఏకాంతంలో సమూహాన్ని ఎలా వెతుక్కోవాలో మాకు తెలుసు! ఆర్.నారాయణ మూర్తి గారి పశ్చాత్తాప ఉదాహరణ చూపి మమ్మల్ని మార్చాలని ప్రయత్నం చేయకండి. మారాలని అనిపిస్తే మేమే మారతాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions