బహుశా ఈ దేశ ప్రేక్షకులు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌ను తిట్టినంతంగా మరే దర్శకుడినీ తిట్టి ఉండరు… అత్యంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రెయిలర్ల దగ్గర నుంచీ విమర్శల జోరు ఆగలేదు… యానిమేషన్ సినిమాల నుంచి కొన్ని సీన్లను యథాతథంగా తీసుకుని, ఆదిపురుష్‌లో పేస్ట్ చేసేశాడు…
ట్రోలింగ్, విమర్శలు, తిట్ల ధాటికి దడుచుకుని… గ్రాఫిక్స్ మెరుగుపరుస్తాను, మరో రెండొందల కోట్లు ఇవ్వండి అంటూ ఓం రౌత్ కొన్నాళ్లు మాయం… అసలే 500 కోట్ల బడ్జెట్ అనేది అసాధారణం… దానికి గ్రాఫిక్స్ రిపేరింగు పేరిట మరో 200 కోట్లు అట… సినిమా విడుదల వాయిదా… ఈ దెబ్బకు ప్రభాస్ ఇతర సినిమాల షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయి… సరే, ఎలాగైతేనేం, సినిమాను రిలీజ్ చేయడానికి సర్వం సిద్దం…
పాటలు, మ్యూజిక్ ప్రభావరహితంగా ఉన్నాయి… లిరికల్ సాంగ్ ఓ ఊపు ఊపేస్తుందని నిర్మాతలు ఏవో లెక్కల్ని మార్కెటింగ్ చేస్తున్నారే గానీ అంత పెద్ద ఇంప్రెసివ్‌గా ఏమీ అనిపించలేదు… తరువాత ట్రెయిలర్లు కూడా పెద్దగా ఇంప్రెసివ్ ఏమీ లేకపోయినా విమర్శల జోరు మాత్రం తగ్గింది… ప్రభాస్ ఆదిపురుష్‌కన్నా ఓ చిన్న దర్శకుడు తీస్తున్న హను-మాన్ గ్రాఫిక్ వర్క్ క్రియేటివ్‌గా, కనెక్టింగ్‌గా ఉందనీ వినిపించింది… సీతమ్మను ఎత్తుకుపోవడానికి జస్టిఫికేషన్ ఇస్తున్నామన్న రావణ పాత్రధారి సైఫ్ మాటలు అందరికీ గుర్తున్నాయి… అందుకే సినిమా విడుదల కోసం నిరీక్షిస్తున్నారు…
Ads
ఇప్పటికీ హనుమంతుడి పాత్రధారి వేషం విచిత్రంగా కనిపిస్తోంది… అదంతా వదిలేస్తే ఈ సినిమా గత ఏడాది ఆగస్టులో విడుదల కావల్సి ఉంది నిజానికి… వరుస వాయిదాల అనంతరం ఈనెల 16ను ఫైనల్‌గా ఖరారు చేశారు… అంటే దాదాపు పది నెలల తాత్సారం… ఖర్చు తడిసిమోపెడు… గ్రాఫిక్స్ రిపేరింగ్ ఖర్చు కూడా పైనబడింది… టీసీరీస్ వాళ్ల సినిమా కదా… రిలీజ్ తేదీ దగ్గరయ్యే సమయానికి ఎలాగోలా కాస్త హైప్ క్రియేట్ చేశారు… డబ్బు ఉదారంగా ఖర్చు చేస్తున్నారు…
తెలుగు, హిందీల్లో నిర్మించే ఈ సినిమాకు కన్నడం, మలయాళం, తమిళ డబ్బింగ్ వెర్షన్లు కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారు… బాహుబలి తరువాత సాహో, రాధేశ్యాం ప్రభాస్ ఇమేజీని ఏమాత్రం పెంచలేకపోయాయి గతంలో… అందుకే ఈ ఆదిపురుష్ మీద చాలా హోప్స్ ఉన్నాయి… ప్రభాస్‌తో వేల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన సినిమాలు ప్లానింగులో, నిర్మాణంలో ఉన్నాయి… అందరికీ ఆదిపురుషుడి ఆశీస్సులే కావాలిప్పుడు…
#Adipurush నిర్మాణవ్యయం ఫైనల్‌గా 550 కోట్లు అని లెక్కించారు… శాటిలైట్, డిజిటల్ రైట్స్ (అన్ని భాషలూ కలిపి) 250 కోట్ల వరకూ అమ్మేశారు… అంటే సగం ఖర్చు వచ్చేసింది… టీ సీరీస్ వాళ్ల సొంత సినిమా కదా, మ్యూజిక్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు, వాళ్లే ఉంచుకున్నారు… ఏపీ, తెలంగాణ థియేటరికల్ రైట్స్ 185 కోట్లు… భారీ ఎత్తున వ్యాపారం జరిగింది… ఓవర్సీస్, హిందీ, ఇతర భాషల్లో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నిర్మాతలే రిలీజ్ చేసుకుంటున్నారు…
ఇవన్నీ సరిగ్గా వర్కవుటయితే… జస్ట్, ఒకేవారాంతంలో నిర్మాతల మొత్తం డబ్బు వాపస్ వచ్చేస్తుంది… కాస్త మంచి టాక్ వస్తే, మొదటి వారాంతానికి నిర్మాతలు ప్రాఫిట్స్‌లో ఉంటారు… లాస్ ప్రస్తావనే ఇక రాదు… ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం… ప్రభాస్ ఇమేజీ, రాబోయే తన భారీ సినిమాల వ్యాపారం ఇంకా భారీగా పెరగబోతోంది… సో, ఆదిపురుష్ దాదాపు 2 వేల కోట్ల ప్రభాస్ రాబోయే సినిమాల మార్కెట్‌నూ శాసించబోతున్నాడన్నమాట…
Share this Article