Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా ప్రిరిలీజు ఫంక్షన్‌లా కాదు… ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలా ఆదిపురుష్ వేడుక…

June 6, 2023 by M S R

ఒక సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లా అనిపించలేదు… ఓ ఆధ్యాత్మిక సభలా జరిగింది… మొదటి నుంచీ జైశ్రీరామ్ అనే నినాదాలను హోరెత్తించారు… ఆదిపురుష్ ప్రతి షోలో, ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని నిర్మాతలతో ప్రకటింపచేశారు… హీరో ప్రభాస్ కూడా పదే పదే జైశ్రీరామ్ అని స్లోగన్స్ ఇచ్చాడు… చినజియ్యర్ రాక కూడా ఇదేదో సినిమా ఫంక్షన్ అన్నట్టు గాకుండా రామకార్యంలా కనిపించింది… అదీ తిరుపతిలో నిర్వహించడం కూడా…

ఎందుకిలా..? అవసరం..! ఆదిపురుష్‌పై మొదటి నుంచీ విమర్శలున్నయ్, వివాదాలున్నయ్, అన్నీ నెగెటివ్ వైబ్సే… సీతమ్మ కిడ్నాప్‌ను జస్టిఫై చేయబోతున్నారనే ప్రచారం దగ్గర్నుంచి సినిమా నాసిరకం ట్రెయిలర్ల దాకా… యానిమేషన్ సినిమాల నుంచి యథాతథంగా సీన్లను తీసుకొచ్చి, ఆదిపురుష్‌లో పేస్ట్ చేశారనే విమర్శ మరీ పెద్దది… ట్రెయిలర్‌పై ఈ స్థాయి నెగెటివిటీ మరే సినిమాకూ రాలేదు… దాంతో ఆ నెగెటివిటీని బ్రేక్ చేయడానికి ఓ ఎత్తుగడగా… హనుమంతుడికి ఓ ఖాళీ సీటు ప్రకటించారు… ప్రిరిలీజ్‌ను పూర్తి స్థాయి ఆధ్యాత్మిక సభగా మార్చేశారు… చివరకు ప్రభాస్‌తో కూడా ఇది సినిమా కాదు, నా అదృష్టం అనిపించారు…

నో డౌట్… ఖానేతరుల్లో ప్రస్తుతం దేశవ్యాప్త ఇమేజీ కలిగి ఉన్నది ప్రభాస్… తన ఇమేజీ మామూలుగా లేదు… బాహుబలితో ఓ రేంజుకు ఎగిసిన ప్రభాస్ పతాకం సాహో, రాధేశ్యామ్ సినిమాలతో కాస్త ప్రభ సన్నగిల్లినా వ్యక్తిగతంగా ప్రభాస్ ఇమేజీకి వచ్చిన ఢోకా ఏమీలేదు… ఆ పాపులారిటీ ఫలితమే తన చేతిలో ప్రస్తుతం వేల కోట్ల ప్రాజెక్టులు… సాలార్, ప్రాజెక్టు కె ఎట్సెట్రా… అన్నీ పాన్ ఇండియా సినిమాలే… ఇంత నెగెటివిటీ స్ప్రెడయినా సరే ఆదిపురుష్ వ్యాపారం బాగా జరిగింది… నిర్మాతలు ఆల్‌రెడీ లాభాల్లోకి వచ్చేశారు…

Ads

adipurush

ప్రస్తుతం ప్రభాస్ మార్కెట్ గమనిస్తే… తనిప్పుడు తెలుగు స్టార్ కాదు… ఇండియన్ స్టార్… తెలుగు హీరోలను దాటేసి చాలాదూరం వెళ్లాడు… కానీ తన ఆరోగ్యస్థితే ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్ అవుతోంది… ఆదిపురుష్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌ వేదిక ఎక్కడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టారు… మెట్లు ఎక్కడం కాదు, తనకు నడకే కష్టంగా ఉన్నట్టుంది… కారణాలు తెలియవు కానీ దైహికంగా ఇబ్బందిపడుతున్నాడు… దీనికితోడు సాలార్, ప్రాజెక్టు కె సినిమాల్లో యాక్షన్ సీన్లు కూడా ఎక్కువేనట… అదీ ఇండస్ట్రీలో డిబేట్‌కు పాయింట్…

మొత్తం ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో, ప్రభాస్ ప్రసంగంలో నచ్చిన పాయింట్ ఏమిటంటే…. తక్కువ మాట్లాడతాను, కానీ ఏటా రెండు సినిమాలు చేస్తాను, సరేనా అని ఫ్యాన్స్‌ను అడగడం… కావాలంటే మూడు కూడా చేస్తాను అన్నాడు… నిజమే, ప్రభాస్ మాటల్లో గొప్పలు చెప్పుకోవడం, హిపోక్రసీ గట్రా ఎక్కువ ఉండవు… ఇప్పుడూ అంతే… మాట్లాడాలి కాబట్టి నాలుగు మాటలు మాట్లాడాడు… అంతే…

prabhas

మళ్లీ సినిమాకు వద్దాం… ఆదిపురుష్ ఫైనల్ ట్రెయిలర్ కూడా అంత ఇంప్రెసివ్‌గా ఏమీ లేదు… స్టిల్, యానిమేషన్ మూవీలాగే కనిపిస్తోంది… మొత్తం మూవీ ఎలా వచ్చిందో సినిమా చూస్తే తప్ప అర్థం కాదు… మన నెత్తుటిలో జీర్ణించుకుపోయిన రామాయణాన్ని కొత్తగా చెప్పడం అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు… ప్రభాస్ నమ్మకంగానే ఉన్నాడు, కానీ దర్శకుడు ఓం రౌత్ మీద ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు… ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు హోస్ట్ సమస్య మైనస్ పాయింటే…

సాధారణంగా సినిమా ప్రిరిలీజులు అంటే సుమ గుర్తొస్తుంది… ఆమె లేకుండా ఇలాంటి భారీ ఫంక్షన్లు మామూలుగానే జరగవు… మరి ఏమైందో గానీ సుమ రాలేదు… బహుశా బయట ప్రోగ్రామ్స్ తగ్గించుకుంటున్నట్టుంది… ఆమె బదులు ఝాన్సీ, ప్రదీప్ కనిపించారు… ప్చ్… సుమ అంటే సుమే… అవునూ.., దర్శకనిర్మాతలు.., హీరో.., హీరోయిన్.., లక్ష్మణ, హనుమ పాత్రలు వేసిన నటులు గట్రా అందరూ వచ్చారు, కానీ ప్రధానమైన రావణ పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ ఎందుకు రాలేదు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions