Sankar G……. ఆదిపురుష్ హనుమంతుడి సీట్ టాపిక్ చూశాక గుర్తొచ్చింది, దేవుడిని సినిమా ప్రచారానికి వాడుకోవడం ఇదే మొదటిది కాదు… ఇది పాత ట్రెండే… భక్తిని క్యాష్ చేసుకోవటం ఇప్పుడు మొదలయ్యింది కాదు. 1943 లో వాహిని వారి భక్త పోతన సినిమా నుండి మొదలయ్యింది అని చెప్పవచ్చు. అప్పట్లో వాహిని పబ్లిసిటీ వ్యవహారాలను బియన్ రెడ్డి తమ్ముడు బి నాగిరెడ్డి చూసేవాడు. రిలీజ్ టైంకు వీరికొక భయం పట్టుకుంది. అప్పుడు జెమిని వాసన్ పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసి ఒక భారీచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆ సినిమా బాలనాగమ్మ లేదా చంద్రలేఖ అయ్యుండొచ్చు. హెలికాఫ్టర్ ద్వారా పాంప్లెట్స్ విసిరి ప్రచారం చేయిస్తున్నాడు.
ఆ భారీ చిత్రం ముందు తమ భక్తి చిత్రం జనాలు చూస్తారో లేదో అని భయపడ్డారు. బియన్ రెడ్డి… నాగిరెడ్డిని పిలిచి మనం వాసన్ తో పోటీపడి పబ్లిసిటీ చేయలేము. తక్కువ ఖర్చులో పబ్లిసిటీ చేసేలా ఏదయినా ఉపాయం ఆలోచించమన్నాడు. నాగిరెడ్డి పెయింటర్లను పిలిచి 25 నుండి యాభైయ్ అడుగుల హనుమంతుడి కట్ఔట్ లు చేయించి, పోతన విడుదల అయిన ప్రతి ధియేటర్ ముందు పెట్టించాడు. ఇంకేముంది ధియేటర్ల ముందు జనాలు టెంకాయలు కొట్టి హారతులివ్వటంతో పాటు సినిమాను సూపర్ హిట్ చేశారు.
కేవీ రెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. దర్శకుడు పి పుల్లయ్య ఎన్టీఆర్ తో వెంకటేశ్వర మహత్యం తీసినప్పుడు ప్రతి ధియేటర్ ముందు వెంకటేశ్వరస్వామి విగ్రహాలు పెట్టటమే కాక పూజాదికాలు, హుండీలు కూడా ఏర్పాటు చేయించాడు. జనాలు ఈ సినిమాకు కూడా బ్రహ్మరధం పట్టారు.
Ads
80 లలో సంపూర్ణ తీర్ధయాత్ర అని ఒక డబ్బింగ్ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా చిన్న ఊర్లలో కూడా ఉదయం ఆటలతో వందరోజులు ఆడింది. కోడిరామకృష్ణ అమ్మోరు సంగతి చెప్పేదేముంది ధియేటర్లలో కొంతమందికి ఏకంగా అమ్మోరు పూనింది. ప్రొడ్యూసర్ జేబు నిండింది… ఇప్పుడిక హనుమంతుడి వంతు…
Share this Article