పార్ధసారధి పోట్లూరి … అమెరికన్ డెమొక్రాట్లు బఫూన్ లకి ఎక్కువ… — లకి తక్కువ! చైనా తైవాన్ ల మధ్య చిచ్చు పెట్టి నీకెందుకు నీ వెనకాల నేనున్నాను అని తైవాన్ ని మభ్య పెట్టింది! తైవాన్ ని చైనా కి వ్యతిరేకంగా రెచ్చగొట్టింది! తీరా తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చే సరికి కాడి కింద పడేశారు డెమొక్రాట్లు!
***************
తైవాన్ లో ఉన్న దాదాపు 17 వేల మంది అమెరికన్ పౌరులను స్వదేశానికి వచ్చేయాలని పిలుపు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది! ఓహ్! అలా అని అమెరికన్ డెమొక్రాట్లు ప్రభుత్వం తరుపున తమ పౌరులను వెనక్కి తేవడానికి ఏర్పాట్ల చేస్తున్నదా అంటే అదీ లేదు. అమెరికన్ పౌరుల రక్షణ బాధ్యత తమది కాదట! ఎవరికి వారే ఆమెరికా తిరిగి వచ్చేయాలిట! ఎంత దిగజారి పోయింది ఆమెరికా?
Ads
******************
ఆఫ్ఘనిస్తాన్ లో 2020 లో తమ సైనికులకి రక్షణ ఇవ్వలేక పోయిన జో బైడన్ ఇప్పుడు తైవాన్ లో ఉన్న తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తాడు అని నమ్మిన అమెరికన్ పౌరులు పిచ్చి వాళ్ళు అయ్యారు! సూడాన్ అంతర్యుద్ధం సమయంలో కూడా ఆమెరికా ఆపసోపాలు పడ్డది తమ పౌరులతో పాటు దౌత్య సిబ్బందిని వెనక్కి తేవడానికి! 2011 లో లిబియాలో కూడా అంతే ప్రయాస పడ్డది కానీ తమ లిబియా అంబాసిడర్ ని మృత్యువు కి అప్పచెప్పింది బెన్ఘాజీ లో! అదీ స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా కొంత మంది దౌత్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
********************
ఝు ఫెంగ్లియన్ (Zhu Fenglian) మెయిన్ లాండ్ చైనాకి చెందిన అధికార ప్రతినిధి ఆమెరికా తమ పౌరులని తైవాన్ నుండి వెనక్కి తేవడానికి ఏర్పాట్ల కోసం ప్రయత్నిస్తున్నది అని ఒక అంతర్జాతీయ ప్రెస్ మీట్ లో వెల్లడించింది నిన్న. Zhu Fenglian మెయిన్ లాండ్ చైనా లో తైవాన్ అఫైర్స్ కి ఇంచార్జీ గా పని చేస్తున్నది! ఝు ఫెంగ్లియన్ చాల స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది!
అఫ్కొర్స్ చైనా మన శత్రు దేశమే అయినా… వాళ్ల తైవాన్ అఫైర్స్ పరిశీలకురాలిగా ఫెంగ్లియన్ వాస్తవాలని బయట పెట్టింది! ఫెంగ్లియన్ మాటల్లో ….. ‘‘యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడూ ‘ అమెరికా ఫస్ట్ ‘ అనే నినాదంతో ఇతర దేశాలలో చిచ్చు పెట్టీ మరీ తమ పొరులతో పాటు ఆయా దేశాలలోని ప్రభుత్వాలని కూడా ప్రమాదం లో పడేసే అలవాటు ఉంది. ఇప్పుడు ఆమెరికా లో అధికారం లో ఉన్న డెమొక్రాట్లు కూడా అదే తప్పుని మళ్లీ మళ్లీ చేస్తున్నారు. తైవాన్ ను చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఆయుధాలు అమ్మిన తరువాత చల్లగా జారుకుంటున్నారు! మా (చైనా) వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంది……… ఇలా అమెరికన్ డెమొక్రాట్ల నే టార్గెట్ చేసింది ఫెంగ్లియన్!
********************
ఫెంగ్లియన్ అన్న దాంట్లో అబద్ధాలు ఏమీ లేవు.. డెమొక్రాట్లు ట్రంప్ ని జోకర్ గా అభివర్ణిస్తారు! మరి జో బిడెన్ ని ఏమని పిలవాలి? ట్రంప్ మన సంగతి మనం చూసుకుందాం అన్నాడు! నాటో కూటమి ని రద్దు చేస్తామని అన్నారు!! యూరోపు రక్షణ బాధ్యత అమెరికా ది కాదు అన్నాడు!అందుకనే ట్రంప్ ని జోకర్ అనేస్తారా? డెమొక్రాట్లు ఆమెరికా ని దిగ జార్చారు చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా!
*****************
డెమొక్రాట్లు అమెరికన్ ఆయుధ లాబీ చేతిలో కీలుబొమ్మగా మారారు! ఆఫ్కొర్స్ అలా అని అమెరికాలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆయుధ లాబీ మాటనే చెల్లుబాటు అవుతుంది కానీ ట్రంప్ కొద్దో గొప్పో ఆయుధ లాబీ ని కంట్రోల్ లో పెట్టగలలిగాడు. ప్రధానంగా యూరోపు విషయంలో తన ఆలోచన సరి అయినదే! ట్రంప్ కనుక అధికారంలో ఉన్నట్లయితే రష్యా ఉక్రెయిన్ మీద దాడికి దిగేదే కాదు! యూరోపు తో కలసి డెమో లు ఆడిన నాటక ఫలితమే ఈ రోజు అమెరికా తో పాటు యూరోపు లో ఆర్థిక సంక్షోభ ప్రభావం ఎక్కువగా ఉంది!
ఇంత నాటకం ఆడినా ఉక్రెయిన్ ని నాటో లో చేర్చుగో గలిగారా? పోనీ భవిష్యత్తు లో అయినా చేర్చుకుంటారు అన్న భరోసా ఇవ్వగలరా? నాటో సభ్య దేశం అయిన హంగరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ ని నాటో సభ్య దేశం గా అంగీకరించను అంటూ బెదిరిస్తున్నది. నాటో కి ప్రత్యేక రాజ్యాంగం ఉంది! దాని ప్రకారం ఏదన్నా కొత్త దేశాన్ని నాటో లో చేర్చుకోవాలి అంటే అన్ని సభ్య దేశాలు అంగీకరించాలి . ఒక్క దేశం అభ్యంతరం పెట్టినా కొత్త దేశాన్ని నాటో లో చేర్చుకోవడానికి వీలు లేదు! హంగరీ దేశం ఉక్రెయిన్ ని నాటో లో చేర్చుకోవడానికి అస్సలు సుముఖంగా లేదు! So! ఉక్రెయిన్ ఎప్పటికీ నాటో లో చేరలేదు అన్నది స్పష్టమయపోయింది!
***********************
మరి ఇంతటి సంక్షోభానికి ఎవరు మూల్యం చెల్లించుకోవాలి? ఖచ్చితంగా యూరోపు తొ పాటు అమెరికా చెల్లించాల్సిందే . ఇప్పటికిప్పుడు యుధ్ధం ఆగిపోయి ఉక్రెయిన్ పునర్నిర్మాణం చేయాలి అంటే అది యూరోపు వల్లనో లేదా అమెరికా వల్లనో కాదు! చచ్చినట్లు ఛైనాకి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే! ఎందుకంటే కావలిసిన ఇన్ఫ్రా చైనా దగ్గర మాత్రమే ఉంది! So! ఉక్రెయిన్ కి IMF అప్పు ఇస్తుంది. దానిని చైనాకు ఇచ్చి మళ్ళీ ఉక్రెయిన్ ని కొత్తగా కట్టాలి! ఎవరు లాభ పడుతున్నట్లు?
******************
మరో చండాలం ఏమిటంటే ఉక్రెయిన్ అమెరికా దగ్గర అప్పు తీసుకొని థర్డ్ పార్టీ ద్వారా రష్యా దగ్గర ఇంధనం కొంటున్నది! అదే ఇంధనం వాడుతూ రష్యా తో యుద్ధం చేస్తున్నది!
*****************
ఉక్రెయిన్ విషయంలో కలుగ చేసుకోవద్దు అని ఒక అర డజను సైనిక జనరల్స్ (పెంటగాన్) నెత్తి నోరు బాదు కున్నారు మొదట్లోనే… కానీ వాళ్ళని పక్కన పెట్టి తమ మాట వినే జనరల్స్ ని పెంటగాన్ లో నియమించుకుని బైడెన్ యంత్రాంగం ఇక్కడి వరకు తీసుకొచ్చారు,! WELL DONE! ఇప్పుడు జెర్మనీ రష్యా నుండి ఇంధనం కొంటాను అని అంటున్నది! రష్యా యుధ్ధం తో జెర్మనీ కి సంబంధం లేదట! రాబోయే (ఇప్పటికే వచ్చింది) ఆర్థిక సంక్షోభం ని తట్టుకోవాలి అంటే రష్యా తో వైరం పక్కన పెట్టేసి ఆయిల్ కొనాలి అని నిర్ణయం తీసుకుంది జెర్మనీ!
********************
ట్రంప్ జోకర్! OK! మరి జో బిడే న్ ని మరియు డెమో లని ఏ పేరుతో పిలవాలి? మళ్లీ తైవాన్ విషయానికి వద్దాం! ఒక వేళ చైనా తైవాన్ మీద దాడి చేస్తే ఆమెరికా తో కలిసి ఏ యూరోపు దేశం కలిసి వస్తుంది? జీరో! అసలు నాటో లో ఎక్కువ సైనిక శక్తి ఉన్నవి రెండే రెండు దేశాలు అవి జెర్మనీ, ఫ్రాన్స్ దేశాలు.
జెర్మనీ తన ఆటోమొబైల్, ఫార్మా రంగాలకి కావలిసిన విడి భాగాల మీద పూర్తిగా చైనా మీద ఆధార పడి ఉంది కాబట్టి తైవాన్ విషయంలో జెర్మనీ అమెరికా తో కలిసి రాదు! ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తె రెండు నెలల క్రితమే మాక్రాన్ చైనాలో నాలుగు రోజుపాటు పర్యటించి తమకి కావాల్సిన స్పేర్ పార్ట్శ్ విషయంలో చైనాని బ్రతిమలాడి తొందరగా సప్లయ్ చేస్తాను అని మాట తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఫ్రాన్స్ అమెరికాతో కలిసి రాదు. అమెరికా ఒంటరిగా చైనాతో యుద్ధం చేయలేదు!
********************
అమెరికన్ పౌరులు ఒబామాకి థాంక్స్ చెప్పాలి! ఎందుకంటే ఒబామా హయాంలో చైనా చాలా వరకు రక్షణ రంగానికి సంబంధించిన రహస్యాలని దొంగిలించి వాటిని బాగా స్టడీ చేసింది! అందుకే F-16,F-15,F-35 లు అంటే భయం లేకుండా ఉంది. యుద్ధానికి సై అంటే సై అంటున్నది. మన రక్షణ రంగ నిపుణులు ఎందుకు రాఫెల్ జెట్స్ ని ప్రిఫర్ చేశారో అర్థం అవుతున్నది!
Share this Article