అయిదేళ్ల క్రితం… అంటే 2018లో … పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశాడు… ‘‘నాది ఇకపై రెల్లి కులం, ఆ కులాన్ని అడాప్ట్ చేసుకుంటున్నా, రాజకీయాల్లో చెత్తను ఊడ్చేయడానికే వచ్చాను, కాబట్టి ఆ పారిశుధ్య వృత్తిలో ఉండే వాళ్ల కులమే నా కులం…’’ అనేది ఆ ప్రకటన సారాంశం… ఆ ప్రకటన చాలామందికి నచ్చింది… సహజంగానే యాంటీ జనసేన గ్రూపులకు నచ్చలేదు… అది వేరే సంగతి…
వైసీపీలో ముత్యాల చక్రవర్తి అని ఓ మోస్తరు లీడర్ ఉంటాడు… తాజాగా ఆయన ఆరోపణ ఏమిటంటే..? (సుమన్ టీవీ కావచ్చు బహుశా) ‘‘ఆయన పావలా కాపు… తను కాపు ఎలా అవుతాడు..? వాళ్ల అమ్మ రెల్లి… అందుకే తనకు రెల్లి కులస్థుల మీద ప్రేమ ఎక్కువ, కాపులంటే అభిమానం ఏమీ లేదు… ఇదే నాగబాబు ప్రజారాజ్యం ఆఫీసులో రంగా ఫోటో పెడుతుంటే అడ్డుకున్నాడు…’’ అని చెబుతూ పోయాడు…
ఇదీ సదరు టీవీ ఇంటర్వ్యూ లింక్…
Ads
ఈమధ్య వైసీపీ దాడి పవన్ కల్యాణ్ మీద పెరిగిపోయింది… తన మీద సాగిస్తున్న ఆరోపణల తీవ్రత ఎక్కడికో వెళ్లిపోతోంది… పవన్ పెళ్లిళ్ల మీద ఎప్పుడూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, జోకులు, విమర్శలు సాగుతూనే ఉంటాయి కదా… రీసెంటుగా పవన్ పెళ్లిచేసుకున్న రష్యన్ యువతి తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందనీ, విడాకులు తీసుకున్నారని ప్రచారం మొదలుపెట్టారు… (జగన్ కూడా పవన్ పెళ్లిళ్ల మీద, పవన్ పేరు ఎత్తకుండా విమర్శలు, సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే)
దీనికి కౌంటర్‌గా జనసేన అభిమానులు పవన్ కల్యాణ్ తన భార్యతో సహా ఇంట్లో ఇటీవలే పూజలు చేశారంటూ ఓ ఫోటోను వదిలారు… అది రియల్ ఫోటోయేనా కాదా అనే చర్చను పక్కన పెడితే… తాజాగా ఏకంగా పవన్, చిరంజీవి, నాగబాబు తల్లి రెల్లి కులస్థురాలని మొదలుపెట్టారు… దీన్ని జనసేన ఎలా కౌంటర్ చేస్తుందో చూడాలిక…
నిజానికి వైసీపీ తాజాగా స్టార్ట్ చేసిన ఈ ప్రచారంలో (విమర్శ కాదు…) నిజానిజాలేమిటో తెలియదు గానీ… ఒకవేళ చర్చ కోసం మనం అది నిజమే అనుకున్నా సరే… ఆమె తల్లి కులం ఏమిటనేది అప్రస్తుతం… అసంబద్ధం… మన పితృస్వామ్య వ్యవస్థలో తండ్రి కులమే ప్రధానం… సో, చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లు కాపులే అవుతారు గానీ… సగం కాపు, పావలా కాపు ఏమిటి..? ఇతర కులాల్లో నాయకులు వేరే కులాలకు సంబంధించిన వాళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం లేదా..? వేరే కులస్థులకు పిల్లల్ని ఇవ్వడం లేదా..? తెచ్చుకోవడం లేదా..? అంతెందుకు..? ఇదే పవన్ కల్యాణ్ రెండో పెళ్లాం ఈ రాష్ట్రమే కాదు, ఈ కులమే కాదు… ఇక మూడో పెళ్లాం అసలు ఈ దేశస్తురాలే కాదు…
వైసీపీ మరీ ఈ స్థాయికి పవన్ కల్యాణ్ మీద దాడికి దిగడం సరైందిగా అనిపించడం లేదు… ఇప్పుడు హఠాత్తుగా వాళ్ల తల్లి కులం ప్రస్తావిస్తూ, ఆమెను ఈ వివాద రాజకీయాల్లోకి తీసుకురావడం బేసబబు… ఐనా ఏపీ పాలిటిక్స్‌లో ఇది సబబు, ఇది బేసబబు అనే విభజనరేఖలు ఎప్పుడో మాయమయ్యాయి కదా… బురదలు, బూతులు, రాళ్లు, వ్యక్తిగత-కుటుంబ అంశాలపై దాడి కామన్ అయిపోయాయి… ఇలాగే… పవన్‌ను తన కులం నుంచి దూరం చేయడానికేనా ఈ ప్రయత్నం..? అందుకే కావాలని ఈ విషయాల వెల్లడికి కాపు లీడర్‌నే తెరమీదకు పంపించారా..?!
Share this Article