Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…

March 1, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో … ఈ పాటను ఓసారి యూట్యూబులో చూడండి… తరువాత ఇది చదవండి… ఆ ట్యూన్, ఆ టోన్, ఆ పిక్చరైజేషన్, సింపుల్ స్టెప్స్, బ్యాక్ గ్రౌండ్… అదిరిపోతాయి… చిరంజీవి ఫ్యాన్స్‌లో చాలామందికి అప్పట్లో ఇది అత్యంత ఫేవరెట్ సాంగ్… ఇక పదండి రివ్యూలోకి…

చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా 1990 మార్చిలో వచ్చిన ఈ కొండవీటి దొంగ . ఈ ఘన విజయానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో చెప్పటం చాలా కష్టం . ఏ సినిమా అయినా కధ లేకుండా ప్రేక్షకులను రంజింపచేయలేదు . జుట్టు ఉంటే ఏ కొప్పయినా పెట్టుకోవచ్చు .

Ads

బిర్రయిన కధ క్రెడిట్ పరుచూరి బ్రదర్స్ , యండమూరి వీరేంద్రనాథుకే దక్కాలి . ఆ తర్వాత ఆ కధను బిర్రయిన స్క్రీన్ ప్లేగా మార్చిన ఘనత యండమూరి వీరేంద్రనాథుకు వెళ్ళాలి . ఎక్కడా బోరించకుండా దడదడా లాక్కెళుతుంది .

ఇంక సారధి కోదండరామిరెడ్డి . సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలను సమన్వయపరిచి ప్రేక్షకరంజకంగా చిత్రీకరించే ఘనుడు దర్శకుడు . అద్భుతమైన లొకేషన్లు , ఫొటోగ్రఫీ . మధుమలై అడవులను , కేరళ అందాలను చక్కగా ఉపయోగించుకున్నారు దర్శకుడు . లోయలు , కొండలు , జలపాతాలు , అడవులు , వగైరా చాలా బాగా వినియోగించుకున్నారు .

ఈ సినిమా అనగానే ముందుగా ఎవరికయినా గుర్తుకొచ్చే పాటలు శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో , ఛమకు ఛమకు ఛాం చుట్టుకో చుట్టుకో పాటలు . ఈ పాటలకో చరిత్ర కూడా ఉంది . నాయక్ సినిమాలో శుభలేఖ రాసా పాట రీమిక్స్ చేయబడితే , ఛమకు ఛమకు పాట ఇంటెలిజెంట్ సినిమాలో రీమిక్స్ చేయబడింది . ఒక దాంట్లో చిరంజీవి కొడుకు , మరో దాంట్లో మేనల్లుడు డాన్సించారు .‌ ఎంత గొప్ప విషయం ! కానీ ఒరిజినల్ ఒరిజినలే…

ఈ ఘనతంతా ఇళయరాజాదే . చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . పాటలకు కావలసిన డాన్స్ స్టెప్పులను చిరంజీవి , రాధ , విజయశాంతిలు బ్రహ్మాండంగా వేసారు . తార , సుందరం బ్రహ్మాండంగా కంపోజ్ చేసారు . అద్భుతమైన లొకేషన్లు . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . పాటలను వేటూరి , సిరివెన్నెల వారు వ్రాసారు .

ఈ రెండు పాటల తర్వాత మంచి పాట తెల్ల గుర్రం మీద నల్ల దుస్తుల్లో మెడలో ఎర్ర రుమాలతో వెంట శునకరాజంతో రాబిన్ హుడ్ పాత్ర పాడే జీవితమే ఒక ఆట సాహసమే పూబాట . దేవీ శాంభవీ దీన బాంధవీ పాట కూడా బాగుంటుంది .

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ సాగే గ్రూప్ డాన్స్ కం డ్యూయెట్ , కోలో కోలమ్మ , టిప్ టాప్ లుక్కు లిప్ మీద క్లిక్కు డ్యూయెట్లు హుషారు హుషారుగా సాగుతాయి . మొదటి రెండు హిట్ పాటలకు చిరంజీవి అభిమానులు సినిమా హాళ్ళల్లో పూనకంతో ఊగిపోయారు . ఇళయరాజా బీట్లు అలాగే ఉంటాయి .

ఇంక నటీనటుల పాత్రలు , నటన . భారీ తారాగణం , అనుభవజ్ఞులయిన నటీనట బృందం . చిరంజీవి నటన , డైలాగ్ డెలివరీ , ఫైట్లు , డాన్సులు , అల్లరి ప్రేక్షకులను ఊపేస్తాయి . తర్వాత చెప్పుకోవలసింది శారద పాత్ర . పేరు శాంభవి . భలే పేరు . పేరుకు తగ్గట్లు ఆమె ఆహార్యం . ఇంక నటన గురించి చెప్పేదేముంది ? బ్లేస్టే . పరుచూరి బ్రదర్సుని అభినందించాలి . సౌమ్య , విషోద , శోక శారదను రౌద్ర శారదగా మార్చిపడేసారు . పరుచూరి బ్రదర్స్ ఉన్నాక శారద పాత్ర ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా .

ఇంక హీరోయిన్లు . 2+1 సినిమా . రుద్రనేత్రలో చివర్లో అవగాహనకొస్తారు . కాబట్టి ఇద్దరూ బతికిపోయారు . ఎన్ని సినిమాల్లో అవగాహనకొస్తారు . పాపం రాధను లేపేసారు ఈ సినిమాలో . అక్కాచెల్లెళ్ళుగా విజయశాంతి , రాధలు మోస్ట్ గ్లామరస్సుగా నటించారు . విజయశాంతి పోలీస్ ఆఫీసర్ , రాధ డాక్టర్ .

విలన్ నాయకుడిగా అబ్రకదబ్ర అమ్రీష్ పురి . యండమూరికి అబ్రకదబ్ర అంటే ప్రియం కదా ! ఆ పేరుని లాక్కొచ్చారు . ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకోవటం వలన బాగుంటుంది . పోలీసు ఆఫీసరుగా , విలనుగా రెండు చోట్ల కనిపిస్తాడు . తోటి విలన్లుగా రావు గోపాలరావు , మోహన్ బాబు , అల్లు రామలింగయ్య , చలపతిరావు నటించారు .

ఇంక ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , దివ్య వాణి , శ్రీధర్ , రంగనాథ్ , శ్రీవిద్య , ప్రసాద్ బాబు , నిర్మలమ్మ , చిట్టిబాబు , బ్రహ్మానందం , కాకరాల  తదితరులు నటించారు . నాగబాబుకి మంచి పాత్ర లభించింది . అడవిలో బాటసారిని అంటూ డిఫరెంట్ ఏక్షనుతో రాణించాడు .

క్లైమాక్సులో ఫైట్సు కూడా బాగా కంపోజ్ చేసారు . షడ్రసోపేతంగా వండబడిన ఈ సినిమా 34 సెంటర్లలో వంద రోజులు ఆడింది . తమిళ , మళయాళ భాషల్లోకి డబ్బింగ్ చేయబడింది . తరచూ టివిలో వస్తూ ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . It’s an unmissable wonderful action entertainer .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముంబై గోల్డ్ సిండికేట్‌పై దెబ్బ! – కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం!
  • మన కాకినాడ ప్రజావైద్యుడికి మరో అంతర్జాతీయ గుర్తింపు!
  • అందుకే సాక్షిలో పనిచేయడానికి చాలా మంది రిపోర్టర్లకు ఇష్టం…
  • ఓహ్, ఈమె నాగశౌర్య సొంత మేనత్త? ఒకప్పటి స్టార్ సిస్టర్! కానీ…
  • ఈ భార్య సంగతి సరే- కానీ ముసలి పేద తల్లిదండ్రుల గతేమిటి?
  • ఈమె ఓ ఫైర్ బ్రాండ్..! ప్చ్, మగపెత్తనాలు రాజీనామా చేయించాయి..!!
  • కలిసి నడుస్తారా? కైలాట్కమా? – కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ!
  • ఆ బుజ్జి ఉడుత కథ పెద్దదే – పర్ణశాల నుంచి రామేశ్వరం దాకా…
  • ప్రకాష్ రాజ్‌కు కోర్టు సమన్లు..! ఈసారి కేసు మల్టిపుల్ ఓటరు కార్డులు..!!
  • వరుస ఫ్లాపులతో అమితాబ్ కెరీర్ ఇక క్లోజ్ అనుకునే దశలో ..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions