Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్రాహ్మలపై అసంగత వ్యాసం… సాక్షి ఎడిట్ పేజీ ఫీచర్… ఆ వ్యాసానికి ఇది కౌంటర్…

July 10, 2023 by M S R

నిన్న సాక్షి దినపత్రికలో ఒకాయన ఓ వ్యాసం రాశాడు, దానిపై బ్రాహ్మణులు కోపగించిన సంగతి మనం చెప్పుకున్నాం కదా… అయితే ఆ వ్యాసానికి ఓ మిత్రుడు సోషల్ మీడియాలో పర్‌ఫెక్ట్ కౌంటర్ రాశాడు… ఎందుకు పర్‌ఫెక్ట్ అంటున్నాను అంటే… వ్యాసంలో ఒక్కో పాయింట్‌ను పట్టుకుని, సాధికారంగా కౌంటర్ చేయడం ఆసక్తికరం అనిపించింది… దేవరాజు మహారాజు రాసింది కరెక్టా, మిత్రుడు రోచిష్మాన్ రాసింది కరెక్టా అనేది ఇక్కడ చర్చించడం లేదు… ఆ వ్యాసంలో ఏముంది..? దానికి ప్రతివాదుల సమాధానం ఏమిటో చెప్పడమే ఈ కథన ఉద్దేశం…


బౌద్ధాన్ని కలిపేసుకున్నారు! శీర్షికతో ఇవాళ సాక్షిలో దేవరాజు మహారాజు రాసిన వ్యాసం చదివాక….

1

“బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో రాముణ్ణి, రావణుణ్ణి ఇప్పటికీ బౌద్ధులుగానే పరిగణిస్తారు…” అంటూ వ్యాసం మొదలుపెట్టారు రచయిత(?)

Ads

— ఇది శుద్ధ అబద్ధం. ఏ బౌద్ధ దేశంలోనూ రాముణ్ణి, రావణుణ్ణి బౌద్ధులుగా పరిగణించడం లేదు. పలు దేశాల్లోని బౌద్ధ సమూహాల్లో నేను సభ్యుణ్ణిగా ఉన్నాను. ఈ రచయిత(?)కు లోక జ్ఞానం లేదు అన్నది తెలిసిపోతోంది లేదా ఆయన పాఠకుల్ని మోసం చేస్తున్నారు అన్నది వాస్తవం అవుతుంది.

2

“… ఇతర దేశాల్లో మనువాదుల ప్రభావం లేదు కాబట్టి, మార్పులకు లోనుకాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి” అని అన్నారు రచయిత.

— హాస్యాస్పదంగా తన బండారాన్ని తానే బయటపెట్టేసుకున్నారు ఈ మాటలతో. ఈ మాటలతో బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో మనువాదుల ప్రభావం ఉంది అని అయనే సూచిస్తున్నారు… మనువాదుల ప్రభావం ఉండబట్టే అక్కడ బౌద్ధం బలంగా ఉంది అనీ, మనువాదం ప్రభావంతోనే బౌద్ధం రూపొంది రాణించింది అన్న చారిత్రిక వాస్తవాన్ని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నారు. అందుకు ఆయనకు అభినందన.

3

దశరథ జాతక కథ ప్రసక్తి చేశారు రచయిత.

— జాతక కథలు ప్రక్షిప్తాలు(interpolations) అని ఎరుక, విజ్ఞత ఉన్న అందరికీ తెలిసిందే. ఈ రచయితకు ఆ విషయం కూడా తెలియకపోవడం దయనీయం. అయ్యోపాపం ఈ రచయిత.

4

విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు… వంటి పేర్లు …. పాలీ, ప్రాకృత భాషల సమ్మేళనంతో మహాయానంలో ఏర్పడ్డవి”

అని అన్నారు.

— మహాయానం ఏర్పడింది సామాన్య శకం ఒకటో శతాబ్దిలో. అంతకు కొన్ని వందలయేళ్ల ముందు జీవించిన బుద్ధడు తన దమ్మపదంలో ఇందఖీలూ అంటూ ఇంద్రత్వం గురించి చెప్పాడు. ఈ రచయిత దమ్మపదం కూడా చదవకుండా బౌద్ధం గురించి ఏ పేలాపనో చెేస్తున్నారని తెలిసిపోతోంది. సిగ్గుచేటు.

5

మహాయానం కాలంలో… “సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకోని సమయంలో బ్రాహ్మణులు పాలీ, ప్రాకృత భాషా పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషాలోకి స్వీకరించి వ్యవహారంలోకి తెచ్చారు…” అని అన్నారు.

— సంస్కృతం మహాయానం కన్నా కాదు బుద్ధుడికన్నా కూడా ఎన్నో వందలయేళ్ల పూర్వంది అని 0XFORD Reference Dictionary వంటి వనరు పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఈ రచయితకు మామూలు చదువు కూడా ఎందుకు లేదో? ఈ రచయితకు పాలీ, ప్రాకృతం, సంస్కృతం భాషల గురించి అంతర్జాతీయ వనరు పుస్తకాల్లో ఏం ఉందో తెలియదు. అది అయనకు ‘చదువు లేదు’ అన్నదాన్ని స్పష్టం చేస్తోంది.

6

బ్రాహ్మణార్యుల ప్రసక్తి చేస్తూ ఈ రచయిత “తమ పొట్టకూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంత మంది దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు” అని అన్నారు.

— చదువు లేకుండానే కాదు బుద్ది, సంస్కారం కూడా లేకుండా రచయిత చెప్పిన మాటలు ఇవి. హిందూ దేవీ దేవతలు బోధిసత్వుడికి చాల పూర్వం అన్నది తెలివిడి.

దమ్మపదం

(అధ్యాయం 17- శ్లోకం 10)లో బుద్ధుడు అన్నది:

“నేఖం జంబోనద స్సేవ

కో తం నిందితుం అరహతి?

దేవాపి తం పసంసంతి

బ్రహ్ముణాపి పసంసితో”

అంటే, స్వచ్ఛమైన బంగారం లాంటి ప్రత్యేకమైన వ్యక్తిని నిందించగిలిగే అర్హత ఎవరికుంటుంది? దేవతలు కూడా ఆ వ్యక్తిని ప్రశంసిస్తారు. బ్రహ్మం (న్) చేత కూడా ఆ వ్యక్తి ప్రశంసించబడతాడు అని అర్థం. బుద్ధుడు స్వయంగా దేవతలు, బ్రహ్మన్ గురించి చెప్పాడు. దాన్ని చదవగలిగే చదువు కూడా ఈ రచయితకు లేకపోవడం ఆయనపై వికారాన్ని కలిగిస్తోంది. హిందూత్వంపై విద్వేషం ఆయన నైజం కావచ్చు, కానూపోవచ్చు కానీ బుద్ధుణ్ణి చదవకుండా, బౌద్ధం గురించి పేలడం ఆయన అసమర్ధతను పట్టిస్తోంది.

7

“బుద్ధుడి అనుయాయులు ఆయనను అనేక పేర్లతో పిలుచుకున్నారు” అంటూ తథాగతుడు, స్వయంభూ నాయక్, పరిణాయక్… వంటి కొన్ని పేర్లను రచయిత చెప్పారు.

— ఆ పేర్లన్నీ సంస్కృతం పేర్లే. విశ్వవ్యాప్తంగా బుద్ధుడు అనుయాయులు బుద్ధుణ్ణి పాలీ, ప్రాకృత పేర్లతో కాకుండా సంస్కృతం పేర్లతో ఎందుకు పిలుచుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సరైన జవాబు తెలుసుకోగలిగే మనోవికాసం ఈ రచయితకు ఉంటే, పోనీ ఇకపైనైనా వస్తే బుద్ధుడు, బౌద్ధంపై ఇలా వికృత రచనలు చెయ్యకుండా ఉంటారు.

8

దశావతారాల్లో తొమ్మిదో అవతారంగా బుద్ధుణ్ణి చెప్పబడుతూండడాన్ని ప్రస్తావించారు రచయిత.

— దశావతారాల్లో బుద్ధ అవతారం ఒకటి కాదు అన్నది చదువు, విజ్ఞత. బుద్ధుడి జాతక కథలలాగానూ, ఈ రచయిత బుద్ధుడు, బౌద్ధం పై చేస్తున్న రచనలలాగానూ అవగాహనారాహిత్యమే దశావతారాల్లో బుద్ధుడి అవతారం ఒకటి అనడం. సరైన, ప్రామాణికమైన హిందూ రచనలు దశావతారాల్లో బుద్ధ అవతారం ఒకటి అని చెప్పడం లేదు. ఇది ఈ రచయితకు తప్పితే మామూలువాళ్లందరికీ తెలిసిందే.

9

బుద్ధుడి ధ్యానం పై చెప్పారు రచయిత.

— ధ్యానంపై వివరణ, ఎరుక వేదకాలంలోనే ఉంది. వేదాల కాలం BCE 1500-800. అప్పటికి బుద్ధుడు పుట్టలేదు. ధ్యానం అన్నదాన్ని బుద్ధుడు వేదం నుంచే తీసుకున్నాడు. బుద్ధుడు వేదంలో ఉన్న దేవతలు, పునర్జన్మ, ఇంద్రత్వం, బ్రాహ్మణులు, బ్రహ్మన్ గురించి చెప్పిన నిజం దమ్మపదం చదివిన ఎవరికైనా తెలుస్తుంది. ఈ రచయిత అంతర్జాతీయంగా ప్రామాణికమైన పుస్తకాలు చదవకపోవడం కాదు అవి ఉన్నాయి, ఉంటాయి అన్నది కూడా ఈ రచయితకు తెలియదు అని తెలుస్తూనే ఉంది. ఆయన కనీసం దమ్మపదం అయినా చదివితే ఇలాంటి వ్యాసాలు రాసి ఉండేవారు కాదు.

10

భగవాన్ పదం గురించి ప్రస్తావిస్తూ “భగవాన్ అంటే పరిపూర్ణతను సాధించినవాడు అని అర్థం. దాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు” అని రచయిత అన్నారు.

— భగవాన్ పదం పాలీ, ప్రాకృత భాషల పదం కాదు. సంస్కృతం పదం. భగవత్ పదం సంభోధన అయినప్పుడు భగవాన్ అవుతుంది. భగవత్ పదాన్ని సంస్కృత పదం అని

Geoffrey Parrinder తన A Dictionary Of Non-Christian Religions లో చెబుతూ ఆ పదానికి అర్థాలుగా fortuante, holy, lord. అనీ ఇంకా ఆ పదం A title applied to saints and gods, especially Shiva and Vishnu, Krishna.

It is used by Jains and Buddhists of their holy ones…” అని తెలియజెప్పాడు. ఈ వివరణను బట్టి భగవాన్ అన్న సంస్కృత పదాన్ని బౌద్ధులే కాపీ కొట్టారని (జైనులు కూడా అనీ, ఈ పదం బౌద్ధం మాత్రమే వాడుకోవడం లేదనీ) మతిపని చేస్తున్న ఎవరికైనా అర్థం ఆవుతుంది. అంతేకాదు “భగవాన్ అంటే పరిపూర్ణతను సాధించినవాడు” అని రచయిత చెప్పడం ఆయన మనలోకంలో కాకుండా తనకు మాత్రమే వర్తించే వేరే లోకంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయ్యోపాపం ఆయన.

బౌద్ధాన్ని ఇక్కడ కలిపేసుకోలేదు కాబట్టే అది బయట దేశాల్లో చలామణి అయింది. బౌద్ధానికి ఇక్కడ ఏ ప్రత్యేకస్థానమూ లేదు, దక్కలేదు, ఆ అవసరమే లేదు.

“హిందూత్వ వ్యతిరేకతతో, ఈ దేశ జాతిలో ఏదో రగిలించాలి అన్న దురుద్దేశంతో, ఏదో విద్వేషంతో, ఏ లబ్ది కోసమో, ఏ కుట్రలో భాగంగానో దేవరాజు మహారాజు బుద్ధుడు, బౌద్ధం గురించి ఇలాంటి తప్పుడు రచనలు చేస్తూ వస్తున్నారు” అని బహిరంగంగా పలువురు చెబుతున్నారు. కానీ ఆయనతో ఏ విభేదాలు, వ్యక్తిగత పరిచయం లేని నేను ఆయన హితైషిగా ఆయనకు చదువు, ఎరుక, విజ్ఞతలు ఉండాల్సినంత లేవు కనుకనే ఇలాంటి తప్పుడు రచనలు చేస్తున్నారు అనే నమ్ముతున్నాను.

ఈ విషయంలో నా తప్పు ఉంటే క్షంతవ్యుణ్ణి.

ఆయన లోగడ సాక్షిలో ఒక ఆంగ్ల కవితను అనువదించిన సందర్భంలో ఆయనకు ఆంగ్లమే కాదు, తెలుగూ తెలియదని తెలుసుకున్నాను. ఆయన సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అవడం కూడా ఆయనకు పెద్దగా చదువు, ప్రతిభ, విజ్ఞతలు ఉండకపోవచ్చన్న విషయాన్ని ధ్రువీకరించడం కావచ్చు.

తెలుగు పాఠకులకు దేవరాజు మహారాజు బుద్ధుడు, బౌద్ధం పై రాస్తున్న తప్పుడు రచనల బెడద తప్పిపోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఆవేదనతో… రోచిష్మాన్… 9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions