Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ బిగ్‌బాస్ సీజన్‌పై సెలబ్రిటీల అనాసక్తి… అంతా బిగ్‌బాస్ టీం స్వయంకృతమే…

July 23, 2023 by M S R

ఆల్ రెడీ ప్రోమోలు వచ్చేశాయి కాబట్టి రాబోయే బిగ్‌బాస్ సీజన్‌కు హోస్ట్ ఎవరో తేలిపోయింది… కాకపోతే ఎప్పటి నుంచి షో స్టార్ట్ అనేది చెప్పలేకపోతున్నారు… నాగార్జున ఫ్లాప్ అనీ, తీసేస్తారనీ, అసలు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియో నుంచి మళ్లీ పూణెకు మారుస్తారనీ, నాగార్జుననే మళ్లీ హోస్ట్‌గా పెట్టుకోవాలనే ఆబ్లిగేషన్ లేకుండా పోయిందనీ వార్తలు వచ్చాయి అప్పట్లో…

నాగార్జునే పక్కా అని తేలిపోయింది… షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోసే అని కూడా తేలిపోయింది… నిజానికి బిగ్‌బాస్ హోస్టులను తరచూ మార్చరు… ఇతర భాషల బిగ్‌బాస్ సీజన్లు చూసినా అర్థమయ్యేది అదే… పైగా నాగార్జున టీవీ హోస్టుగా సక్సెస్… మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలో చిరంజీవి, జూనియర్ ఫెయిలయ్యారు తప్ప నాగార్జున మంచి మార్కులే సంపాదించాడు…

bb6

Ads

బిగ్‌బాస్ గత సీజన్ ఫెయిల్యూర్‌కు నాగార్జున కారణం కూడా కాదు… తన ప్రయత్నం తను చేశాడు… బిగ్‌బాస్ క్రియేటివ్ టీం వైఫల్యం అది… కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి టాస్కుల దాకా ఏమాత్రం ఆకట్టుకోలేదు ఆ సీజన్… పరమ పేలవంగా, బోరింగ్‌గా సాగింది… అంతకుముందు 24 * 7 పేరిట ఏదో ఓటీటీలో రన్ చేశారు, అది మరింత అట్టర్ ఫ్లాప్…

bb6

రియాలిటీ షోలను ఓటీటీలో చూడరనేది కరెక్టు కాదు, ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్, ఇండియన్ ఐడల్ సక్సెస్ షోలు… అదే నిదర్శనం… కానీ బిగ్‌బాస్ మాత్రం ఓటీటీలో ఫ్లాప్, కారణం క్రియేటివ్ టీం ఫెయిల్యూరే… ఇక ఈసారి కంటెస్టెంట్లు ఎవరెవరు ఉండబోతున్నారో అప్పుడే సైట్లు, యూట్యూబర్లు బోలెడు ఊహాగానాలు చేస్తున్నారు… ఏవేవో పేర్లు రాసేస్తున్నారు…

bb7telugu

గత సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక దరిద్రంగా ఉంది కాబట్టి ఈసారి జాగ్రత్తగా ప్రముఖుల్ని ఎంపిక చేస్తారని కూడా రాస్తున్నారు… నిజానికి జరుగుతున్నది వేరు… ఇప్పటికి నలుగురైదుగిరి ఎంపిక కూడా ఓ కొలిక్కి రాలేదు… ఇంకా సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి కొందరితో… పైగా వీళ్లు ఎంపిక చేయగానే ఆయా కంటెస్టెంట్లు ఎగురుకుంటూ వచ్చేసి, హౌజులో కొలువు తీరరు…

శ్వేత నాయుడు

చాలా లెక్కలుంటాయి… ఎవరిని ఏ వారం తరువాత ఇంటికి పంపించేయాలనే లెక్కలు కూడా బిగ్‌బాస్ టీం ముందే వేసుకుంటుంది… అంతా స్క్రిప్టెడ్… టాస్కులతో సహా… జనాభిప్రాయం, వోటింగు ఎట్సెట్రా అంతా ఓ ప్రహసనం… ఎవరికి వారానికి ఎంత..? ఎన్ని వారాలు అనేది కూడా బేరాన్ని బట్టి ఉంటుంది… తాజాగా ఏదో ప్రముఖ సైటులో చదివాను… సింగర్ మోహన భోగరాజు, టీవీ సీరియల్ నటి శోభాశెట్టి, యాంకర్ విష్ణుప్రియ, చైతన్య వైష్ణవి, టీవీ సీరియల్ నటి నవ్య, నటి సురేఖావాణి, టీవీ నటుడు ప్రభాకర్, యాంకర్ దీపిక పిల్లి, యూట్యూబ్ పాపులర్ జంట దుర్గారావు దంపతుల పేర్లు రాసుకొచ్చారు అందులో…

ఆట సందీప్

వీళ్లు వస్తున్నారు కాబట్టి ఈసారి హాట్ హాట్ అట… నిజానికి దుర్గారావు దంపతులు కాదు… డాన్స్ మాస్టర్ ఆట సందీప్ జంట కన్‌ఫరమ్ అయినట్టు తెలిసింది… ప్రతిసారీ బిగ్‌బాస్ సీజన్‌లో ఒకరిద్దరు డాన్స్ మాస్టర్లుంటారు తెలిసిందే కదా… నటుడు ఈటీవీ ప్రభాకర్, మైవిలేజ్ షో అనిల్ కూడా కన్‌ఫరమ్ అట… ఇందులో పేరు లేదు… సురేఖావాణి, మోహన భోగరాజును అడిగిన మాట నిజమే కానీ కన్‌ఫరమ్ కాలేదు ఇంకా… దీపిక పిల్లిని కూడా అడిగారు కానీ ఆమెకు కొన్ని షోలు రన్నింగులో ఉండి, డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేను అని చెప్పిందట… శ్వేతానాయుడు పేరు దాదాపు ఫైనల్…

myvillageshow

నిజానికి గత రెండుమూడు సీజన్లలో కంటెస్టెంట్ల ఎంపిక బాగా లేదు, దాంతో బిగ్‌బాస్ హౌజులోకి వెళ్లాలనే ఆసక్తి ఉన్న సెలబ్రిటీలు కూడా ఇక తమ కోరికను చంపేసుకున్నారు… హౌజులోకి వెళ్తే ఇజ్జత్ పోతదనే ఫీలింగులో ఉన్నారు కొందరు… పైగా బిగ్‌బాస్ టీం గతంలోలాగా పనిచేయడం లేదు… అందుకే పెద్ద తలకాయలుగా పేర్కొనే సెలబ్రిటీలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు… వైష్ణవి చైతన్య ఒకప్పుడు ఏమో గానీ బేబీ సూపర్ హిట్ కదా, ఇప్పుడు హౌజులోకి రాకపోవచ్చు… ఎస్, శోభాశెట్టి, నవ్య, విష్ణుప్రియ ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే వస్తారేమో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions