శంభాజీ భిడే… ఎవరీయన..? ఈ ప్రశ్న మళ్లీ సెర్చింగులోకి వచ్చింది… గతంలో ఆయన నిర్వహించిన ఓ సభకు ప్రధాని మోడీ హాజరయ్యాడు, అప్పుడూ ఇదే సెర్చింగు… ఇప్పుడు వివాదాల్లోకి నెట్టబడిన సుధామూర్తి ఓసారి ఈయనకు మొక్కింది… అప్పుడూ ఇదే సెర్చింగు… మరి ఇప్పుడు ఎందుకు..? వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదు…
మహాత్మాగాంధీపై వివాదాస్పద, అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు… 2. కోట్ల మంది పూజించే సాయిబాబా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు… గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ తీవ్రంగా ఖండించాయి… అమరావతి పోలీస్ స్టేషన్‌లో భిడే మీద కేసు కూడా నమోదైంది… మహారాష్ట్రలో ఇది పెద్ద చర్చనీయాంశం ఇప్పుడు… ఇంతకీ ఆయన ఏమన్నాడు..?
Ads
సాయిబాబా ఆలయానికి హిందువులు వెళ్లడం మానేయాలట… అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదట… హిందువులు సాయిబాబాను పూజిస్తుంటారనీ, కానీ ఆయన నిజంగా అందుకు అర్హుడేనా అని పరిశీలించాలట… ఈమధ్య సోషల్ మీడియాలో హిందుత్వవాదుల పోస్టులు ఇదే కోణంలో కనిపిస్తున్నాయి… వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు… అసలు దేవుడంటేనే ఓ విశ్వాసం… సాయిబాబాను దేవుడిగా నమ్మడమే ఆయన దైవత్వం… అంతే…
మామూలు సోషల్ మీడియాలో ఎవరో ఏదో రాస్తూనే ఉంటారు… కానీ శంభాజీ భిడే వంటి కరడు గట్టిన హిందుత్వవాది ఈ వ్యాఖ్యలు చేయడంతో వాటికి ప్రాధాన్యం ఏర్పడింది… అసలు అది కాదు, ఇప్పుడు తనపై ఆగ్రహావేశాలను రాజేస్తున్న వ్యాఖ్యలు గాంధీ మీద చేసినవి… 3, 4 రోజుల క్రితం ఆయన ఎక్కడో మాట్లాడుతూ మహాత్మా ఫూలే, మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘కరంచంద్ గాంధీ ఒక ముస్లిం భూస్వామి వద్ద ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు కరంచంద్ గాంధీ ఆ ముస్లిం భూస్వామి నుండి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించి పారిపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన భూస్వామి మహాత్మా గాంధీ తల్లిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను భార్యలా చూసుకున్నాడు. కాబట్టి మహాత్మా గాంధీ నిజమైన తండ్రి కరంచంద్ గాంధీ కాదు. ఆయన తండ్రి ఒక ముస్లిం భూస్వామి…’’ అని అన్నాడు భిడే. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయన్నాడు…
జాతిపితగా కీర్తించబడే వ్యక్తి పుట్టుక మీద ఇలాంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమే… శంభాజీ వ్యాఖ్యలతో మహారాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది… ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి… కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీలోని రెండు వర్గాలు సోమవారం ముంబైలోని మంత్రాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి… భిడే వ్యాఖ్యల్ని బీజేపీ కూడా సహించలేదు… ఆ రాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మండిపడ్డాడు… ఇంతకీ ఎవరి శంభాజీ…
Share this Article