Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీ కడుపు సల్లగుండ… నెయ్యి రుచిలా ఘుమఘుమలాడే నిజం చెప్పినవ్…

August 5, 2023 by M S R

ఆమధ్య ఏదో హెల్త్ ప్రాబ్లం మీద ఓ ఆయుర్వేద వైద్యురాలి దగ్గరకు వెళ్తే… అక్కడ ఆమె రాసిన పుస్తకాలు కనిపించాయి… వాటిని తిరగేస్తుంటే నెయ్యిను అసలు వాడకూడదని ఓచోట రాసి ఉంది… నిజమే కదా, అల్లోపతిలోె నెయ్యిని దాదాపు నిషేధించినట్టే డాక్టర్లు ఆ వాడకం వద్దంటూ సలహాలు ఇస్తుంటారు… ఆమె ఆయుర్వేద వైద్యురాలే అయినా అల్లోపతిని కూడా ప్రయోగిస్తుంటుంది… ఆ ప్రభావమే ఆమె మీద కూడా ఉన్నట్టుంది…

నెయ్యిని పరిమితంగా వాడితే తప్పులేదు, నష్టం లేదు అని కొందరు చెబుతుంటారు… నో, నో, అసలు దాని వాసనే చూడకూడదు అని హెచ్చరించేవాళ్లు మరికొందరు… గతంలో అన్నమే కాదు, అన్ని వంటల్లోనూ నెయ్యికి విశేష స్థానం ఉండేది… నెయ్యి వాడిన వంటల తీరే వేరు… ఇప్పటికీ డాక్టర్లు ఏం చెప్పినా సరే పట్టించుకోకుండా నెయ్యిని ధారాళంగా వాడేవాళ్లు ఎంతోమంది… ప్రత్యేకించి మధుమేహులు కొన్ని జాగ్రత్తలతో గనుక వాడితే నెయ్యి ప్రయోజనకారి అంటుంటారు…

డాక్టర్ అవంతి దేశ్‌పాండే అని ఓ న్యూట్రిషనిస్టు… మహారాష్ట్రలోని పూణె… కొంత ఫేమసే… నెయ్యిని వాడకూడదు, అది ఈ దేహానికి నిషిద్ధమనే వాదనను కొట్టిపారేస్తోంది… నెయ్యి ఉపయుక్తమే గానీ, నష్టదాయకం కాదని అంటోంది… నీ కడుపు సల్లగుండ, మస్తు చెప్పినవ్ తల్లీ అని నెయ్యి ప్రేమికులు ఆమెను అభినందిస్తున్నారు… ఇంతకీ ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఏమంటున్నదంటే…

Ads

deshpande

‘‘నెయ్యికి మన భారతీయ ఆహార సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది… వెనుకటి కాలంలో దాదాపు అందరూ నెయ్యి తినేవారు… ఎక్కువ మందికి పాడి అందుబాటులో ఉండడంతో అది సాధ్యపడింది… ఆరోగ్యానికి నెయ్యి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది… నేటి కాలంలో అల్లోపతి వైద్యులు నెయ్యికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు… కానీ, స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి…

ఆయుర్వేదం ప్రకారం నెయ్యి తీసుకుంటే చిన్న పేగుల్లో ఆహార స్వీకరణ సామర్థ్యం పెరుగుతుంది… గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లో అసిడిక్ పీహెచ్ తగ్గుతుంది… పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటే, దాదాపు చాలా వరకు అనారోగ్యాలు రావు… సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, నిశ్చలమైన జీవనం, యాంటీబయాటిక్స్ వాడడం అన్నవి పేగుల ఆరోగ్యానికి హాని చేసేవి…’’అని వివరిస్తోంది…

‘‘నెయ్యిలో కొవ్వులు ఎక్కువ ఉన్నా సరే, అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మేలు చేసే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలమే. పైగా నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారన్నది అపోహ మాత్రమే… నెయ్యితో బరువు తగ్గుతారు…

నెయ్యి

నెయ్యి కొలెస్ట్రాల్ కు కారణం అవుతుందని చెప్పలేను. దీనికి బదులు కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుందంటాను. ఏ2 కౌ ఘీ (ఏ2 బీటా కేసిన్ ప్రొటీన్ ఉండే) మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులకు సాయపడుతుంది… ఫ్యాట్ లో కరిగే విటమిన్ ఏ, డీ, ఈ, కేని శరీరం మంచిగా గ్రహించేలా చేస్తుంది… అందుకే ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని తీసుకోవాలి…

నెయ్యి జీర్ణ రసాల విడుదలను ప్రేరేపిస్తుంది. దాంతో తిన్నది చక్కగా అరుగుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చర్మం కాంతిని సంతరించుకుంటుంది. శరీరం మొత్తానికి కావాల్సిన లూబ్రికేషన్ ను అందిస్తుంది. పేగులను శుభ్రం చేస్తుంది. సాఫీ విరేచనానికి సాయపడుతుంది’’… అని ఆమె సూచించింది… హెలో… అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు… ఎలాగూ వాడవచ్చు అంటోంది కదాని అన్నంలోకి, వంటల్లోకి ధారాళంగా, ధారగా వొంపేయకండి… నెయ్యి పరిమితంగానే వాడాలి సుమా… ఏ వంటకు అది ఘుమఘుమను ఇస్తుందో దానికే వాడండి… అంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions