మహాత్మాగాంధీ మరణించేనాటికి ఆంధ్రజ్యోతి పుట్టిందా..? ఎలాంటి, ఎంత కవరేజీ ఇచ్చిందో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రజ్యోతి మాత్రం వివేకా హత్య కేసుకు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం, స్పేస్, ఎఫర్ట్, బాధ కనబరుస్తోంది… నేతాజీ అదృశ్యం, లాల్ బహదూర్ శాస్త్రి మరణ మిస్టరీ, ఇందిర హత్య, రాజీవ్ హత్య వెనుక ద్రోహచింతన… వీటికన్నా వివేకా హత్య కేసుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది ఆంధ్రజ్యోతి…
అఫ్‌కోర్స్, ఈ కేసులో జగన్ బాగా ఇరుకునపడి ఉన్నాడు గనుక… అదెంత చిక్కుముడిలా మారితే, అంతగా ఏదేదో రాసి, జగన్ పట్ల జనంలో వ్యతిరేకత పెంచవచ్చునని ఆంధ్రజ్యోతి ఆశ… అది చంద్రబాబుకు ఉపయోగపడాలని అత్యాశ… రాజకీయాల్లో హత్యలు కామన్, కొన్ని రాష్ట్రం స్థాయిలోనే, మరికొన్ని సీబీఐ స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంటయ్… ఏళ్ల తరబడీ విచారణలు నడుస్తూనే ఉంటయ్…
ఎస్, వివేకా కూతురు పోరాడుతున్నదీ అంటే ఆమె స్వయంగా ఆయన కూతురు కాబట్టి… షర్మిల ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నదీ అంటే జగన్ మీద కోపమే అల్టిమేట్ కారణం కాకపోవచ్చు, బాబాయ్ మీద ప్రేమ కూడా కాకపోవచ్చు, నేరుగా బహిరంగపరచని ఏదో కారణం ఉండి ఉండవచ్చు… ఏపీ వాళ్లకు సరే, ఆంధ్రజ్యోతి రచ్చకు, హంగామాకు రాజకీయ కారణాలున్నాయి సరే, అవన్నీ సేమ్ అలాగే తెలంగాణ పాఠకుల మెదళ్లకు రుద్దడం దేనికో…
Ads
జగన్ కుటుంబం మీద ఏమైనా రాయాలంటే ఆంధ్రజ్యోతి కలం ఉరకలెత్తుతుంది… అదేమంటే జగన్ కుటుంబాన్ని డీఫేమ్ చేస్తే చంద్రబాబుకు కలిసి వస్తుందనే ఏకైక కారణమే… అఫ్‌కోర్స్, నెగెటివ్ స్టోరీలు రాయకూడదనేంత అతీతుడు, పుణ్యపురుష్ ఏమీ కాదు జగన్… నిజంగా రాయాలంటే జనానికి అర్థమయ్యేలా బోలెడు పాలన వైఫల్యాల్ని రాయొచ్చు… రాయాలి… కానీ ఎంతసేపూ షర్మిల, వివేకా, కాకపోతే కోడికత్తి కేసు… ఇవేనా..? ఈరోజు కూడా తన కొత్త పలుకులో షర్మిలకు పెద్ద పీట వేసి, ఆ టైమ్‌కు ఏది తోస్తే అది రాసేశాడు…
నిజానికి షర్మిల వేల కిలోమీటర్లు తిరిగినా తెలంగాణలో ఆమెకు ఎక్కడా జనం నుంచి యాక్సెప్టెన్సీ రాలేదు… అంత వృథా ప్రయాస… పైగా కేసీయార్ క్యాంపు కూడా లైట్ తీసుకోవడానికి… జగన్ ప్రేరేపిత, గుప్త వ్యూహాలు కొన్ని ఉండి ఉంటాయి… పైకి కనిపించేదే రాజకీయం కాదు… ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్తుందట, ఎందుకు..? వైఎస్ కుటుంబాన్ని నానారకాలుగా క్షోభపెట్టిన కాంగ్రెస్ మీద ఆమెకు ఎందుకు ప్రేమ..? రేప్పొద్దున ఢిల్లీలో కాంగ్రెస్ కూటమి గనుక అధికారంలోకి వస్తే… ఎందుకైనా మంచిదని ఆమెను కాంగ్రెస్‌లోకి కావాలనే ప్రవేశపెట్టే వ్యూహం ఏమైనా పదును పెట్టుకుంటోందా..?
షర్మిల తెలంగాణ బరిలో ఉంటే, కేసీయార్ దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని, తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆమెను ఏపీకి షిఫ్ట్ చేస్తున్నారట కాంగ్రెస్ హైకమాండ్… అందుకని ఆమెకు రాజ్యసభ సీటు ఆశజూపుతున్నారట… దీన్ని జనం, పాఠకులు నమ్మరు కాబట్టి… అబ్బే, వచ్చే ఎన్నికల కోసం కాదు, 2029 లోనైనా కాంగ్రెస్‌ను ఏపీలో బతికించుకునే దీర్ఘకాలిక వ్యూహమని రాస్తూ పోయాడు రాధాకృష్ణ… ఫాఫం, చాలా విషయాల్లో ఆర్కే కలం బాగానే రాస్తుంది కానీ షర్మిల విషయంలోనే అడ్డంగా ఇంకులో కాలేస్తూ ఉంటాడు…
తెలంగాణలో జనం నుంచి ఏమాత్రం యాక్సెప్టెన్సీ లభించని షర్మిలకు ఏపీలో ఎలా లభిస్తుంది..? పైగా అక్కడ జగన్ ఉన్నాడు కదా వైఎస్ వారసుడు..? వందల పథకాలకు నాన్న పేరు పెట్టుకుని, అసాధారణ రీతిలో ‘నాన్న లెగసీ’ అని ప్రదర్శిస్తున్నాడు కదా… తెలంగాణలో గానీ, ఏపీలో గానీ షర్మిల వల్ల కాంగ్రెస్‌కు ఒనగూరే ఫాయిదా ఏమీ లేదు… నిజంగానే జనం నుంచి ఆమెకు ఆదరణ లభించి ఉంటే ఆమె కాంగ్రెస్‌లో ఎందుకు చేరుతుంది..? పైగా ఆర్థిక వివాదాలతో జగన్ మీద కోపంతో కొట్లాడాలనుకుంటే ఇన్నాళ్లూ తెలంగాణలో ఎందుకు తిరిగింది..? అదేదో ఏపీలో తిరగాలి కదా… ఈ సింపుల్ ప్రశ్నకు జవాబు చెప్పడానికి రాధాకృష్ణ ప్రయత్నిస్తే బెటరేమో..!! కొంపదీసి ఎడిట్ వ్యాసాలకూ ‘అడ్వర్టోరియల్ రంగు’ పులమబడుతోందా..?!
Share this Article