ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆరు అవార్డులట… పర్లేదు, వస్తే వచ్చాయిలే… కానీ ఆశ్చర్యంతో, ఆనందంతో గమనించింది ఒకే ఒక పేరు అల్లు అర్జున్… ఎక్కడి గంగోత్రి సినిమా… ఎక్కడి పుష్ప… వావ్, వాట్ ఏ ప్రస్థానం… ఏడ్చేవాళ్లు ఏడ్వనీ… అబ్బే, అవి లాబీయింగు అవార్డులండీ అంటారు కొందరు… సో వాట్..? ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కూడా అంతే కదా మరి…
చంద్రబోస్‌కు అదేదో కొండపొలం మూవీలో పాటకు గాను అవార్డు దక్కింది… గుడ్… నాటునాటు పాటకు ఇవ్వకపోవడమే ఓ పెద్ద గొప్పదనం… ఆర్ఆర్ఆర్‌కన్నా మన జాతీయ అవార్డులకే ఎక్కువ క్రెడిబులిటీ అని స్పష్టమైంది… ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన… గుడ్… మంచి ఎంపికే… ఉత్తమ సంగీతం దేవిశ్రీప్రసాద్… గుడ్… ఫుల్ టాప్ ట్రెండింగ్‌లో చాలారోజులపాటు ఉన్న పాటలు ఇచ్చాడు… దేశమంతా అవే ట్యూన్లు… స్పూఫులు, రీల్స్, షార్ట్స్…
ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి… ఆర్ఆర్ఆర్… నిజం చెప్పాలా కీరవాణీ, ఆ ఆస్కార్‌కన్నా ఇదే బెటర్… చెప్పడం మరిచా… నాటునాటు డాన్స్ కంపోజర్ ప్రేమ్ రక్షిత్‌కు ఇప్పుడు న్యాయం జరిగింది… రాజమౌళి టీం తనను ఇగ్నోర్ చేసి అవమానపరిచింది… ఆ గౌరవం ఇప్పుడు అదే నడిచొచ్చి తన మెడలో పడింది…
Ads
ఉత్తమ గాయకుడిగా కాలభైరవకు కూడా ఓ జాతీయ అవార్డు… మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీం మరోసారి ఫుల్ ఖుషీ… చంద్రయాన్3 టీంలాగే సంబరాలు… ఇక్కడే ఒక మాట చెప్పుకోవాలి… గొప్ప గొప్ప పేర్లు, పద్మభూషణాలు ఉండొచ్చు, ఫిల్మ్‌ఫేర్లు, నందులు రావచ్చుగాక… కానీ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డులు దక్కిన నటీమణలున్నారు తెలుగులో… అంతేతప్ప నటులు లేరు… ఎందుకు..?
ఒక్కసారి పేరు గొప్ప- ఊరు దిబ్బ హీరోలు ఆత్మపరిశీలన చేసుకోవాలి… మరి బన్నీ కూడా అంతే అంటారా..? కాదు… పుష్ప సినిమాలో బన్నీ మార్క్ డాన్స్ స్టెప్పులేమీ ఉండవు… డీగ్లామరస్ లుక్కు… స్మగ్లర్‌లాగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర… కొన్నిచోట హీరోయిన్‌తో వెగటుగా కూడా ప్రవర్తిస్తుంది… అఫ్‌కోర్స్, అది ఆ కేరక్టర్ గుణం… పైగా ఓ భుజం పైకి, ఓ భుజం కిందకు జారవేసి నడుస్తుంటుంది ఆ పాత్ర… బీడీలు కాలుస్తూ పక్కా మాస్ వాసనను వెదజల్లుతుంది… ఎస్, ఆ పాత్రలోనే పుష్ప అలియాస్ బన్నీ ఇరగేశాడు…
ఇప్పుడున్న ఇమేజ్ బిల్డప్పుల కంటామినేటెడ్ వాతావరణంలో ఇలాంటి పాత్ర చేయడమే ఓ చిరు సాహసం… మిగతావాళ్లకు ఈమాత్రం కూడా చేతకావడం లేదు కదా… ఆకాశమంత ఇమేజీ బిల్డప్పులే తప్ప, తమలోని నటనను పాతరేసి, హీరోయిజం ఎలివేషన్ కోసమే చిల్లరప్రయత్నం… డిజాస్టర్లు వస్తున్నా వాళ్లు మారరు… ఒక్కసారి తాటిచెట్టంత ఎదిగిపోయిన బన్నీని చూసి కుళ్లిపొండి, కుళ్లుకొండి… తప్పులేదు… కొంతైనా మారతారేమో, కొత్త పాత్రలు- ప్రయోగాలకు సాహసిస్తారేమో అని తెలుగు ప్రేక్షకుల ఆశ…
ఈ నేపథ్యంలోనే బన్నీకి అవార్జును స్వాగతిద్దాం… ఆహ్వానిద్దాం… అది లాబీయింగ్ ద్వారా వచ్చిన అవార్డు అయినా సరే… అది కూడా మిగతావాళ్లకు చేతకాలేదు కదా… సో, బన్నీ కంగ్రాట్స్… కీప్ రాకింగ్… తెలుగు తెరకు కొత్త గౌరవాన్ని సంపాదించి పెట్టావు… గుడ్, గుడ్… అన్నట్టు 1967లో జాతీయ అవార్డుల ప్రకటనలు ఆరంభమైన దగ్గర్నుంచీ తెలుగు వాడికి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు రావడం ఇదే తొలిసారి అట కదా… సో, డబుల్ కంగ్రాట్స్ బ్రో…
Share this Article