Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తలైవా.., ఉనక్కు వణక్కం సామీ! ఉత్తబక్వాస్ బండల్బాజ్ సినిమా…

September 10, 2023 by M S R

Suraj Kumar………   తలైవా, ఉనక్కు వణక్కం సామీ! #ఉత్తబక్వాస్_బండల్బాజ్  సూపర్ స్టారా పాడా! #GoneAreThoseDays! డెబ్బయ్యో పడిలో పడి, మూతి ముప్పైఆరు వంకరలు పెడుతూ, రెండు చేతులు నడుం మీద పడేసి, రుబ్బు రోల్లా తిప్పుకుంటూ నడుస్తూ, బోర్డ్ మ్యానరిజంతో, మొనాటనీ డైలాగులు చెప్తూ, రజినీకాంత్ ఇప్పుడు ఓ #సత్రోల్_స్టార్ ఐపోయాడు! బాబోయ్, ఇక భరించడం కల్ల అనే కాడికి వచ్చాడు! తలైవా, #ఇప్పోదఇల్లై [ఇకవద్దు] సామీ! #సంపాకు [చంపకు] సామీ, #ఉనక్కువణక్కం [నీకుదండం] సామీ! వద్దూ.. వద్దూ.. వద్దు! ఇక, మానెయన్నా! నీ మూస నటన విసుగు పుట్టిస్తోందంటూ ప్రేక్షకలోకం ముక్తకంఠంతో ఘోషించే దాకా పరిస్థితి విషమించింది!

#జైలర్ అందరూ ఊదరగొడుతున్నట్లేమీ లేదు! #ఉత్తబక్వాస్, #బండల్బాజ్ సిన్మా! నిర్మొహమాటంగా చెప్పాలంటే సావ దొబ్బిండనుకోన్రి! చిఛ్చి.. దీనమ్మా జీవితం, ఆ రజనీకాంత్ నైతే చూడలేకపోయాం! వ్వాక్, ఏం సినిమారా బాబూ అది, పైగా డబ్బింగొకటి! తలా తోక లేని ఈ సినిమాలో ఓ చూడదగ్గ ఫేసూ లేదు, వినదగ్గ పాటా లేదు, ఆస్వాదించదగ్గ ఆటా లేదు! ఓ ట్విస్టు లేదు, టర్నింగ్ పాయింట్ ఏడ్వలేదు! బిగినింగ్ నుంచి ఎండింగ్ దాక ఒకటే రొద కొట్టుడు!

భారీ తారాగణం ఉంటే చాలు కథా, కథనం రెండూ అక్కర్లేదు అనుకున్నట్లున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్! ఒంట్లో చేవ చచ్చినా.. ఫంకు క్రాఫ్ విగ్గూ, నెరిసిన గడ్డంతో సేమ్ ఓల్డ్ గెటప్లో #ముసలిస్టార్ రజినీ! అసలుందో లేదో తెలియని ఓ ముతక రోల్లో రమ్యకృష్ణ! ఇంకా సునీల్, నాగబాబు, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, మకరంద్ దేశ్పాండే అబ్బో స్టార్ కాస్టింగ్లో మాత్రం పాన్ ఇండియా పంథా అనుసరించాడనుకోండి డైరెక్టర్! అంటే, బడా ఆర్టిస్టులను పెడితే, సినిమాలో హీరోకు దేశవ్యాప్తంగా ఓ పెద్ద క్రిమినల్ నెట్వర్క్ ఉందనే సెన్స్ ఆటోమేటిగ్గా, రెడీమేడ్ గా కన్వే అవుతుందనుకున్నట్లున్నాడు సదురు దర్శకుడు! కానీ, ఆ నెట్ వర్క్ డెవెలప్ ఐన విధానాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమయ్యాడు పాపం! ఇక, వినాయకన్ విలన్ క్యారెక్టర్ పరమ చెత్తగా దరిద్రంగా, రోత పుట్టించే విధంగా ఉంది!

Ads

కథలోకి వెళ్తే, తాను పెంచిన కొడుకు విషయంలో తండ్రి అంచనా తప్పడం ఏంటో! ఆ కొడుకు సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఏంటో! అందుకు ప్రతీకారంగా తండ్రి ఓ ముగ్గురిని నరికి చంపడం ఏంటో! ఆ విషయాన్ని అర్ధరాత్రి నిద్రలేపి రౌండ్ టేబుల్ పెట్టి, పెళ్లాం పిల్లలకు చెప్పడమేంటో! ఆ సీన్లో ఆ రక్తపు మడుగులు, భీభత్స దృశ్యాలేంటో! కట్ చేస్తే కొంత సేపటికి చచ్చిపోయాడు అనుకున్న కొడుకు విలన్ నిర్బంధంలో బతికి ఉండటం ఏమిటి! లాగడానికి కాకపోతే సినిమాలో సడెన్ గా ఆ #వజ్రకిరీటం ప్రస్తావన ఏందో!కనీసం #పెళ్లిబాసింగం తోనైనా సరితూగే #రిచ్నెస్ లేని ఆ కిరీటానికి అంత విలువ ఏందో!

మ్యూజియం నుంచి దాన్ని దొంగిలించి తెచ్చిస్తే కొడుకునిస్తానని సదురు విలన్ హామీ ఇవ్వడం ఏందో! అది నమ్మి ఆ జైలర్ తండ్రి ఓ నకిలీ కిరీటం అప్పజెప్పి కొడుకును విడిపించటం ఏమిటో! చివరికి డబ్బుల కోసం ఆ కొడుకు విలన్ తో చేతులు కలపి తండ్రిని చంపాలనుకోవడం ఏమిటో? కిరీటంలో #స్పైకెమెరా పెట్టి ఆ విషయాన్ని తండ్రి తెలుసుకోవడం ఏమిటో! #హేమిటో, అంతా #డ్రామా లేని ఒక #ట్రామా లా అనిపించింది! తమిళ డబ్బింగు మూవీల మార్క్ ఫాస్ట్, ఫాస్ట్ ఎడిటింగ్, దానికి జోడించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సొద తప్ప ఒక్క ముక్క అర్థంకాలేదు!

May be an image of 1 person and text

ఇక కథనంలోకి వెళ్తే, అర్ధరాత్రి భార్యా పిల్లల్ని లేపి డైనింగ్ టేబుల్ పై కూచోబెట్టి తాను చేసిన మర్డర్లను ఏకరువు పెట్టడం పూర్తి అసహజంగా ఉంది! అప్పుడే విలన్ పంపిన గ్యాంగు దాడికి రావడం, వాళ్లను కిరాయి గుండాలతో మట్టుబెట్టించడం లాంటి సీన్లు రజినీ లాంటి #స్టార్డం ఉన్న హీరోల క్యారెక్టర్ ను #పాతాళానికి దిగజార్చే విధంగా ఉన్నాయి! ఆ రాత్రి అక్కడ చిందిన #రుధిరం [రక్తం], రక్తసిక్తమైన ఆ జుగుప్సాకరమైన పరిసరాలు, సినిమాల్లో చూపే #వైలెంట్_సీన్ల పరంపరకే పరాకాష్ట!

సినిమా మధ్యలో అసంబద్ధమైన ఫ్లాష్ బ్యాక్ సరేసరి! సినిమా టైటిల్ జిస్టును డిఫైన్ చేయాల్సిన ఆ బ్యాక్ డ్రాప్ ను అస్పష్టంగా అక్కడ జొప్పించి దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు, #టైగర్_కా_హుకుమ్ అనే డైలాగోటి హీరో మ్యానరిజంలో పడేసి, దాన్ని కథకు ఎలా అనుసంధానం చేయాలనుకున్నాడో అర్థం కాలేదు! ఇక, సాధారణంగా, మతిస్థిమితం కోల్పోతే, లేదా కోల్పోయినట్లు నటించాలంటే, సదురు వ్యక్తి ఆసుపత్రిలో అడ్మిటవడం పరిపాటి! కానీ, ఇక్కడ #పిక్చర్_టోటల్_రివర్స్! మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తి తాలూకు కుటుంబసభ్యులు హాస్పిటల్లో చేరుతారు! ఇలా వర్ణించుకుంటూపోతే, జైలర్ మూవీలో ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్ కూడా సహజత్వానికి లోబడి, సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుని, వాడి మనసును హత్తుకునేలా లేదనడంలో ఎలాంటి సందేహం లేదు!

గతంలో ‘బాషా.. మాణిక్ బాషా! నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే!’ అనే ఓ డిఫరెంట్ మ్యానరిజంతో పెరియావర్ రజినీ యావత్ దేశాన్ని ఉర్రూతూగించాడు! ఓ వైలెంట్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఇతివృత్తాన్ని #ఫ్లాష్_బ్యాక్ లో పెట్టి కథనాన్ని ముందుకు తీసుకెళ్ళే #ట్రెండ్ కూడా బహుశా అప్పుడే మొదలైంది కావచ్చు! ఆ తరవాత కూడా ‘నా దారి రహదారి, బెటర్ డోంట్ కం ఇన్ మై వే!’ అంటూ నరసింహ మూవీతో ఆయన దక్షిణాది ప్రేక్షక హృదయాలపై చెరగని ముద్రవేశాడు! కానీ, #రొంబాతిరైప్పటం [మంచిసినిమా], #నల్లాఇరిక్క [చాలాబాగుంది] లాంటి ఒకప్పటి ప్రశంసాపూరిత వ్యాఖ్యలు తమిళ తలైవా సినిమాలకు ఇప్పుడు వినిపించడం లేదు!

సూపర్ స్టార్ ఇమేజ్ ను తెరకెక్కించే ప్రయత్నంలో నిర్మాణసంస్థలు అనుసరిస్తున్న లెక్కలేనంత #అతి చాలాసార్లు జుగుప్స కలిగించే విధంగా ఉంటోంది! సెల్యులాయిడ్ పైకి సామాజిక కోణాలను ఎక్కించి రజనీకాంత్ #క్రేజ్ ను రాజకీయలబ్ది కోసం వాడుకోవాలనుకునే #కుతి సైతం పెద్దన్న సినీకెరీర్ చివరి అంకంలో ఓ మాయనిమచ్చలా మిగిలేపోయే ప్రమాదం ఉందనేది నాలాంటి అభిమానుల ఆందోళన!… సూరజ్ వి. భరద్వాజ్.

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions