ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎస్.జె.సూర్య సినిమా ఇది… అదేనండీ, మార్క్ ఆంటోనీ… పేరుకు విశాల్ హీరో, రకరకాల గెటప్పుల్లో కనిపిస్తాడు… కానీ నటుడిగా తన విలన్ పాత్రకు మంచి ప్రయారిటీ ఇప్పించుకుని, తనే బలంగా ఎక్స్‌పోజయ్యాడు సూర్య… కొన్నిచోట్ల విశాల్ వెలవెలా… ఇందులో మన సునీల్ కూడా ఉన్నాడు… ఉండీ లేనట్టే… మనకు పెద్దగా కొత్తగా కనిపించడు…
హీరోయిన్ ఉంది… రీతూవర్మ… ఈ పాత్ర కూడా ఉండీలేనట్టే… ఫాఫం, ఆమెకు మంచి మెరిట్ ఉండీ మంచి పాత్రలు దొరకడం లేదు… వైజి మహేంద్రన్ పాత్ర గురించి చెప్పుకోవడం దండుగ… ఇక సంగీతం డబ్బాలో గులకరాళ్ల సందడి… పాటలేవీ కనెక్ట్ కావు… డవిలాగులు సరిగ్గా లేక, పాటలూ కనెక్ట్ కాక, బీజీఎం ఇంప్రెసివ్‌గా లేక… కొత్తగా కథ చెప్పే టెక్నిక్కూ లేక… ఏదో అలా సాగిపోయింది చప్పగా సినిమా…
పొద్దున్నుంచీ ఒకటే ఊదర, హిట్, సూపర్ హిట్, చాన్నాళ్ల తరువాత విశాల్‌కు ఓ సక్సెస్… ఇలా సాగుతున్నయ్ రివ్యూలు… కానీ అదేమీ లేదు… అంత సీనేమీ లేదు… యాక్షన్ సినిమాలైతే, రొడ్డకొట్టుడు మూస, మాస్ కథలు ఇక కలిసిరావడం లేదని విశాల్ ఈసారి పలు జానర్లు మిక్స్ చేసి వదిలాడు మన మీదకు… కాస్త ఫన్, కాస్త సైన్స్ ఫిక్షన్, కాస్త యాక్షన్… ఇదీ మిక్స్ అన్నమాట…
Ads
సైన్స్ ఫిక్షన్ అన్నాక, ఇక మన ప్రాప్తం, రచయిత దయ… ఏదో ఓ ఫోన్‌తో ఆ టైమ్ నుంచి ఈ టైమ్‌కు… అంటే కాలంలో ప్రయాణించేయవచ్చునట… సరే, సాధ్యమే అనుకుందాం, ఎలాగూ ఫిక్షన్ కదా… ఈనాటి ప్రేక్షకుడిని పాత కాలంలోకి తీసుకెళ్లడం అంత వీజీ కాదు… ఇందులో సిల్క్ స్మిత కూడా కనిపిస్తుంది… ఆమె స్క్రీన్ టైమ్ కాస్త పెంచినా బాగుండు… అదీ లేదు… మరి విశాల్ బాగా చేయలేదా అంటే చేశాడు… తనకు అలవాటైన నటనే చూపించాడు… కాకపోతే కొన్ని కొత్త గెటప్పులు, అంతే తేడా…
ఓ పిల్లాడు, వాడి తండ్రి గ్యాంగ్ స్టర్, ఏదో సీన్‌లో చచ్చిపోతాడు, తన దోస్త్ ఈ పిల్లాడిని పెంచుకుంటాడు… కానీ గ్యాంగ్‌స్టర్ కాడు… మెకానిక్… కానీ తల్లిని చంపిన తండ్రి మీద పగ తీర్చుకోవాలని ఉంటుంది… కానీ ఎలా..? గతంలోకి వెళ్తాడు… తను ఊహించుకునే కథలో కొన్ని ట్విస్టులు… ఇదీ కథ… ఫిక్షన్ కమ్ కామెడీ కమ్ యాక్షన్ కమ్ ఫన్ కమ్ ఎట్సెట్రా… కానీ తండ్రీకొడుకుల నడుమ ఎమోషన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు, సో, సినిమా మొత్తంగానే కనెక్ట్ కాకుండా పోయింది…
పోనీ, విశాల్‌కు బలం వంటి యాక్షన్ సీన్లనైనా బలంగా ప్రజెంట్ చేయగలిగారా..? అవీ బాగాలేవు… సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ, కథనం, ట్రీట్‌మెంట్ అంతా గజిబిజి అయిపోయి మనకు పిచ్చి రేపుతుంది… వీటన్నింటికి తోడుగా అరవ అతితనం సరేసరి… సో, విశాల్‌కు బాక్సాఫీసు పరంగా గ్రిప్ ఉన్న తమిళంలో కాస్త నడుస్తుందేమో, అంతేతప్ప తెలుగువారికి ఎక్కేంత సీన్ లేదు… సారీ విశాల్… ట్రై అనదర్ మూవీ… హేమిటో తమిళ సినిమాల క్రియేటివిటీ మీద మనకు అప్పుడప్పుడూ ఈర్ష్య కలుగుతుంది… కానీ ఇలాంటి సినిమాలు తీస్తూ, కాస్త ‘జాలి’ని కూడా పొందుతూ ఉంటుంది కోలీవుడ్…
Share this Article