Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డొల్ల వాదనలు… శుష్క విశ్లేషణలు… ఆర్కే కలం అదుపు తప్పిపోయింది…

October 1, 2023 by M S R

మా చంద్రబాబును దుర్మార్గంగా జైలులో వేశారు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధ చెప్పనలవి కాదు… అక్షరాలు నానా వంకర్లూ తిరిగిపోతున్నయ్… విశ్లేషణావ్యాసాలు దారితప్పుతున్నయ్… ఏదేదో రాసేస్తున్నాడు… తను కొత్తపలుకు అనే ఎడిటోరియల్ వ్యాసంలో తాజాగా ఏమంటున్నాడంటే…

ఆర్కే… అవినాశ్‌రెడ్డికి అరెస్టు నుంచి ఉపశమనం, ఎమ్మెల్సీ కవితక్కకు విచారణ నుంచే రెండు నెలల ఉపశమనం… మరి చంద్రబాబుకు ఎందుకీ జైలు..?

…… సిమిలర్ కేసులు కదా ఆర్కే… ఇవేం పోలికలు..?

Ads

ఆర్కే… చంద్రబాబు స్థాయి వ్యక్తికి కూడా సత్వర న్యాయం జరగకపోవడం, స్కిల్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలు సేకరించాల్సి ఉందని సీఐడీ చెబుతున్నప్పటికీ ఆయనను రిమాండ్‌కు పంపడం వంటివి న్యాయ వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్నాయి.

…… ఓహో, కోర్టుల్లో కేసుల మెరిట్‌ను బట్టి గాకుండా నిందితుల రేంజ్‌ను బట్టి న్యాయం ఉండాలా..? ఈ వయస్సులో అరెస్టు చేయకుండా ఉండాల్సింది అని మంత్రి హరీష్ చేసిన శుష్క వాదనలాగే ఉంది ఇది కూడా… ప్రధానిగా పనిచేసిన పీవీని కూడా విచారించింది మన న్యాయవ్యవస్థ… ఒకసారి ముఖ్యమంత్రిత్వం చేస్తే ఇమ్యూనిటీ వస్తుందా ఏం..?

ఆర్కే… 371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని రచ్చ చేస్తున్న వాళ్లు… ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులతో పోల్చితే ఇది ఎంత అని కూడా ప్రశ్నించుకోవాలి.

…… జగన్ అవినీతితో పోలిస్తే చాలా చాలా తక్కువ కాబట్టి పర్లేదని న్యాయవ్యవస్థ ఈ కేసులను మొదట్లోనే కొట్టేసి ఉండాల్సిందా సార్..?

ఆర్కే…. 371 కోట్ల రూపాయల మొత్తానికే ఒక వ్యక్తిని నెల రోజులకు పైగా నిర్బంధించినప్పుడు 43 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్‌ రెడ్డిని ఎంతకాలం జైల్లో ఉంచాలి?

……. 371 కోట్లు స్వల్ప మొత్తమా..? జగన్ 43 వేల కోట్లు మింగాడు కాబట్టి మా చంద్రబాబు 371 కోట్లు మింగడం ఓ తప్పా..? అన్నట్టుంది ఈ డొల్ల వాదన…

ఆర్కే…. దుర్వినియోగం జరిగిందని నిర్ధారించిన శరత్‌ అసోసియేట్స్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాల్సి ఉంటుంది. చార్డర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ శరత్‌ అసోసియేట్స్‌పై చర్య తీసుకోవాలి కూడా…

……… అవును, చంద్రబాబుకు నెగెటివ్‌గా ఎవ్వరు ఏం పనిచేసినా, వాళ్లందరినీ నిషేధించాలి.,. వీలైతే ఉరితీయడం బెటర్… అంతేనా ఆర్కే సార్..?

ఆర్కే… ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సదరు ఆదేశాలకు దిక్కు లేకుండా పోయింది. జగన్మోహన్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలై పదేళ్లు దాటినా ఆయనపై దాఖలైన చార్జిషీట్లు విచారణకు నోచుకోవడం లేదు.

…….. ఇక్కడా అదే వాదన… జగన్ బెయిల్ రద్దు గాకుండా, పదేళ్లుగా విచారణలే లేవు కాబట్టి చంద్రబాబు అరెస్టు తప్పవుతుందా..? ఇదెక్కడి వాదన..?

ఆర్కే… 45 ఏళ్ల ప్రజా జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఉన్నది ఒక్క హెరిటేజ్‌ సంస్థ మాత్రమే.. అది కూడా ప్రస్తుత స్థాయికి చేరడానికి 30 ఏళ్లు పట్టింది.

……… అంటే ఒక్క హెరిటేజ్ సంస్థ తప్ప చంద్రబాబు తన రాజకీయంతో ఏం సంపాదించాడని వెక్కిరిస్తున్నట్టా ఇక్కడ..?

ఆర్కే… ఆయనలోని పాలెగాడు శాంతించలేదు. లోకేశ్‌ను కూడా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుతో హెరిటేజ్‌ సంస్థకు ముడిపెట్టి ఆ సంస్థలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను కూడా అరెస్టు చేయించాలన్న దుష్ట తలంపుతో జగన్‌ ఉన్నారని చెబుతున్నారు.

……. జగన్‌కు కావాలని ఏవో కొత్త సజెషన్స్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి ఈ రాతలు..?

ఆర్కే… నిందితులు, సాక్షులతో అంతా నిజమే చెబుతామని న్యాయస్థానంలో ప్రమాణం చేయిస్తారు. న్యాయమూర్తులు కూడా ఆయా కేసులలో న్యాయమైన తీర్పునే ఇస్తామని ప్రమాణం చేయాలని కార్టూన్లు వస్తున్నాయంటే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం సడలుతోందని భావించాలి.

…….. తక్షణం చంద్రబాబును వదిలిపెట్టి, ఇక జీవితంలో ఆయన జోలికి ఏ కోర్టూ వెళ్లకుండా ఓ క్లియర్ కట్ ఆర్డర్ పాస్ చేస్తే తప్ప న్యాయవ్యవస్థ తన గౌరవాన్ని నిలుపుకోలేదు… అంతేనా సార్..?

ఆర్కే… చంద్రబాబు ఇన్ని రోజులు జైల్లో ఉండి ఉండకపోతే ప్రజల్లో సానుభూతి పెరిగేది కాదు. ఆయనను ఎంత ఎక్కువ కాలం జైల్లో ఉంచితే ప్రజల్లో సానుభూతి అంతలా పెరుగుతూనే ఉంటుంది.

……. శుభం, జగన్‌కు థాంక్స్ చెప్పాలి కదా మరి…

ఆర్కే… సాత్వికంగా ఉండే చంద్రబాబును 73 ఏళ్ల వయసులో జైల్లో పెట్టడాన్ని తెలంగాణ సమాజం కూడా గర్హిస్తున్నది.

……. అవునా, తెలంగాణ సమాజం కూడా చంద్రబాబు మీద జాలి చూపిస్తోందా..? హాశ్చర్యమే…

ఆర్కే… కేంద్ర పెద్దల సహకారం, గ్రీన్‌సిగ్నల్‌ ఉన్నందునే చంద్రబాబును జగన్‌ రెడ్డి అరెస్టు చేయించారని ఉభయ రాష్ట్రాల ప్రజలూ బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో బీజేపీ నానాటికీ బలహీనపడటానికి ఇది కూడా ఒక కారణం.

…….. ఓహో, తెలంగాణలో బీజేపీ బలహీనపడటానికి ఇదేనా కారణం..? భలే చెప్పారు సార్…

ఆర్కే… 2018లో బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారకుడు అయ్యారు. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో నష్టం అంటూ జరిగితే అందుకు చంద్రబాబు అరెస్టు అంశం కూడా అంతో ఇంతో కారణం అవుతుంది. ఈ వాస్తవాలను గుర్తిస్తే బీఆర్‌ఎస్‌కే మంచిది.

……. 2018లో చంద్రబాబును వ్యతిరేకిస్తే కేసీయార్‌కు అధికారం వచ్చిందే నిజమైతే… మరి ఇప్పుడు ఆయనను మెచ్చుకుని మేకతోలు కప్పితే జనం హర్షిస్తారా..? ఇదెక్కడి వాదన..?

ఆర్కే…. ‘చంద్రబాబును అరెస్టు చేయడం జగన్మోహన్‌ రెడ్డికి ఆత్మహత్యా సదృశం’ అని ఐప్యాక్‌ అధిపతి ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారంటే భవిష్యత్తులో జరగబోయేది ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

……. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు అంత విలువ ఉందా..? భలే సర్టిఫికెట్ ఇస్తున్నారు సార్ మీరు..?

మొత్తానికి రాధాకృష్ణ శోకాలు నిన్న పళ్లేలపై మోగించిన స్పూన్ కొట్టుళ్లలాగే ధ్వనిస్తున్నాయి… స్టేలు ఇచ్చినన్ని రోజులూ న్యాయవ్యవస్థ గొప్పది, ఇప్పుడు రిమాండ్‌కు పంపిస్తే న్యాయవ్యవస్థ లోపాలమయం… ఇదేనా తమరు అంతిమంగా చెప్పదలిచింది… చంద్రబాబును విడిచిపెట్టండి అని చెప్పకపోతే సుప్రీంకోర్టు కూడా గౌరవాన్ని కోల్పోతుందన్నమాటేనా… వావ్… ఏం చెప్పారు సార్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions