Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గేట్ల రిపేర్లు చేతకాక… దాన్నలా వదిలేసి, దిగువనే కొత్త ప్రాజెక్టు కడతారట…

October 1, 2023 by M S R

నిజంగా ఆశ్చర్యం… ప్రపంచంలోని ఏ ప్రభుత్వమైనా, ఏ సమాజమైనా సరే… ఒక ప్రాజెక్టును సరిగ్గా నిర్వహించలేక అనగా మెయింటెయిన్ చేయలేక, కనీసం గేట్ల రిపేర్లూ చేతకాక… దాన్ని అబాండన్ చేసేసి, దానికి బదులు వేరే కొత్త ప్రాజెక్టు కడుతుందా..? ఇదీ ఆ ఆశ్చర్యానికి కారణం… దీనికి బేస్ ఈనాడులో వచ్చిన ఓ వార్త… ముందుగా ఆ వార్త చూడండి…

కడెం

ఈ వార్తను ఇక్కడ సరిగ్గా చదవడం సాధ్యపడదేమో… ఓసారి సారాంశం చెప్పుకుందాం… ‘‘నిర్మల్-మంచిర్యాల జిల్లాలోని 65 వేల ఎకరాలకు సాగునీటిని అందించే కడెం ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న వరదను తట్టుకోలేకపోతోందట… గేట్లు మొరాయిస్తున్నాయట… అందుకని దిగువన ఓ కొత్త ప్రాజెక్టు కడతారట… పాత ప్రాజెక్టు రిపేర్ల బదులు కొత్త ప్రాజెక్టే లాభదాయకం అని తేల్చిందట ప్రభుత్వం… అదనంగా అయిదు గేట్లు పెట్టాలి లేదా ఉన్న గేట్లను ఎత్తు పెంచాలి… వాటికి ఖర్చు బోలెడు, సో, కొత్తదే కట్టేద్దాం అని ప్రతిపాదిస్తున్నారట…’’

Ads

అదీ జస్ట్, పాత ప్రాజెక్టుకు 100 మీటర్ల దిగువన… అంటే ఓ ఫర్లాంగు… పాత దాని రిపేర్లకు 500 కోట్లు పెట్టేబదులు 21 లేదా 23 గేట్లతో కడితే 900 కోట్లతో కొత్త ప్రాజెక్టు వస్తుంది కదానేది ప్రభుత్వం ఆలోచన అట… ఈ వార్త నిజమో కాదో ధ్రువీకరణ కాస్త కష్టమే… పైగా కేవలం ప్రతిపాదనల దశే… నిజమైతే మాత్రం ఇంతకుమించిన విడ్డూరం మరొకటి ఉండదు… (ఇంకా రేవంత్‌రెడ్డి వార్త చదివినట్టు లేడు, లేకపోతే కమీషన్ల కోసం కక్కుర్తి అని విమర్శించేవాడేమో…)

కడెం

అదుగో కాలేశ్వరం, ఇదుగో పాలమూరు-రంగారెడ్డి అని గొప్పలు చెప్పే గొంతులు ఇంకా కడెం మీద సవరించుకోలేదు ఎందుకో… నిజానికి పాలమూరు ప్రాజెక్టులో మొన్న జరిగింది కేవలం ఒక మోటారు వెట్ రన్ మాత్రమే… దానికే ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించేసినట్టు హడావుడి, ప్రచారం, హంగామా… ఈ నేపథ్యంలో ఈ ఈనాడు వార్త మరింత అబ్బురంగా ఉంది…

నిర్మాణాత్మక ధోరణి ఏమిటంటే… ముందుగా కడెం ప్రాజెక్టు గేట్ల రిపేర్లు జరగాలి, గేట్ల సంఖ్య పెంచాలి, లేదంటే ఎత్తు పెంచాలి… ఆల్ రెడీ స్థిరీకరించబడిన ఆయకట్టు అది… దశాబ్దాలుగా బాగా సేవలందించింది… ఇప్పుడు కూడా అది ముసలిదైపోలేదు… ముసలిదాన్ని చేస్తున్నారు… దాన్నలా వదిలేసి కొత్త వయసు పోరి కావాలని చూస్తున్నారు… ఎంత అన్యాయం..?

పోనీ, దీన్ని ఇలాగే రన్నింగులో ఉంచి, కొత్త ప్రాజెక్టైనా మరింత అవసరమున్నచోట కడతారా అంటే అదీ కాదట… ఈ ప్రాజెక్టుకు జస్ట్ 100 మీటర్ల దిగువన కడతారట… కేసీయార్‌తో ఇప్పుడు తామున్న స్థితిలో గోక్కోలేక ఈ వార్తను పాజిటివ్ పంథాలో రాసుకొచ్చింది ఈనాడు… వేరే పత్రికలకేమో రాసేవాళ్లే దిక్కులేదు… నమస్తే సాక్షికి ఎలాగూ ఏమీ చేతకాదు ఇప్పుడు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంకా కనిపించనట్టుంది… ఎంతసేపూ ఆ చంద్రబాబు గోలేనా..? కాస్త తమరు సెటిలైన తెలంగాణ గురించీ పట్టించుకొండి సార్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions