మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా 150 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న భక్తకన్నప్ప సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించబోతున్నాడనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… అసలు భక్తకన్నప్ప సినిమాను మంచు కుటుంబం నిర్మిస్తుందనే వార్తతో కలిగిన విభ్రమ ముందు మరే ఇతర ఆశ్చర్యాలూ పెద్దవి కావు… ఎందుకంటే..?
1976లో కృష్ణంరాజు నటించి నిర్మించిన చిత్రం భక్త కన్నప్ప… తెలుగు భక్తి సినిమాల్లో ఇదీ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది… కృష్ణంరాజును జనసామాన్యంలోకి బాగా తీసుకెళ్లింది కూడా ఈ సినిమాయే… ఒకవేళ దీన్ని రీమేక్ చేయాలంటే ప్రభాసే చేయాలి అనుకుంది ఇండస్ట్రీ… నిజంగానే ప్రభాస్‌కు సరిగ్గా నప్పేది ఈ పాత్ర… కానీ తను వదిలేశాడు ఎందుకో మరి…
తను తీయడం లేదు సరికదా మంచు విష్ణు తీసే ఈ సినిమాలో ప్రభాస్ శివుడట… నయనతార పార్వతి అట… అసలు భక్తకన్నప్ప రైట్స్ మంచు కుటుంబానికి ఎలా ఇచ్చాడు ప్రభాస్..? (అఫ్‌కోర్స్ భక్తకన్నప్ప కథ మీద ఎవరికీ హక్కులుండవు… అది శతాబ్దాలుగా జనం నోళ్లలో నానే కథ… ఎవరైనా తీయొచ్చు… కానీ పాత భక్తకన్నప్పతో తప్పకుండా పోలిక వస్తుంది…) అసలు పాత భక్తకన్నప్ప సినిమాలో హైలైట్స్ ఏమిటి..?
Ads
పాత సినిమాలో హైలైట్ కిరాతార్జునీయం… వేటూరి రాసిన వచనాన్ని బాలు అద్బుతంగా పాడాడు… ఇప్పుడు అలా రాసేవాళ్లు ఎవరున్నారు..? బాలులా పాడేవాళ్లూ లేరు… అసలు మంచు విష్ణు సినిమాలో ఈ కిరాతార్జునీయం బిట్ ఉంటుందా..? ఈ సినిమాకు బలం బాపు దర్శకత్వం… భక్తి సినిమాయే అయినా ‘శివశివ అననేలరా’ వంటి హాట్ సాంగ్స్ కూడా పెట్టి వాణిజ్యవిలువలను పొదిగాడు బాపు… ఎక్కడో గిరిజన తండాల్లో సెట్లు వేసి, బెన్‌హర్ తరహాలో సీన్లు తీయాలని ప్రయత్నించారు…
ఎన్నీయెల్లో ఎన్నీయెల్లో సందామామా పాట ఈరోజుకూ సూపర్ హిట్టే… అఫ్‌కోర్స్, శివశివ శంకరా, ఆకాశం దించాలా వంటి పాటలన్నీ హిట్లే… ఈ సినిమాకు మరో బలం వాణిశ్రీ… నాస్తికుడైన కన్నప్పకు ఆస్తికురాలైన భార్యగా, అమాయక భక్తురాలిగా, ప్రేమికగా, ఓ ఫేక్ బాబా కామవాంఛకు బాధితురాలిగా రకరకాల పార్శ్వాలను సరైన అభినయంతో ప్రదర్శించింది… ఇక రోజూ కైలాసానికి వెళ్లొచ్చే ఫేక్ బాబాగా రావుగోపాలరావు నటన అద్వితీయం… ఇన్ని ప్లస్సులు మళ్లీ ఓ కొత్త సినిమాలో సాధ్యమేనా..?
అనవసరంగా తీసి నాటి భక్తకన్నప్ప పేరును చెడగొడుతున్నారా అనే సందేహం ఇండస్ట్రీలో ఉంది… కానీ మోహన్‌బాబు నోటికి భయపడి ఎవరూ తన ఎదుట ఏమీ అనరు… అసలు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ డిఫరెంటుగా మాట్లాడతారు… ఆ నెగెటివిటీ ప్రబలిపోయి ఉంది… మోహన్‌బాబు అదేదో దేశభక్తి పేరిట ఓ పిచ్చి సినిమా తీస్తే జనం నిర్ఘాంతపోయారు ఆమధ్య… తరువాత విష్ణు జనం మనోభావాలకు వ్యతిరేకంగా జిన్నా అనే పేరుతో సినిమా తీస్తే ప్రేక్షకులు అడ్డంగా తిప్పికొట్టారు… (మా ఎన్నికల్లో విష్ణు పేలిన పెకాహం పంతులు వంటి నత్తి డైలాగులు మహా వైరల్ తెలుసు కదా…)
మొన్న అదేదో రజినీ సినిమాలో మోహన్‌లాల్, శివరాజకుమార్, రమ్యకృష్ణ, తమన్నా, జాకీ ష్రాఫ్ ఎట్సెట్రా నటించి అన్ని భాషల కలర్ ఇద్దామని ప్రయత్నించారు… కానీ సినిమా ఈ కారణం వల్ల కాదు ఆడింది… కథాబలం వల్ల…! తమన్నా నడుమూపుళ్ల డాన్స్ కూడా ఓ కారణమే… మోహన్‌బాబుకూ రజినీకాంత్‌కూ ఏరాపోరా బాపతు దోస్తీ ఉంది కదా, తనను కూడా ఈ సినిమాలోకి తీసుకొస్తే బెటరేమో… ఓ పనైపోతుంది…
అన్నింటికీ మించి తను మోహన్‌లాల్, నయనతార, ప్రభాస్ తదితరులను పెట్టి ఎంత పాన్ ఇండియా లుక్కు ఇద్దామని ప్రయత్నించినా అది ఇట్టే వర్కవుట్ అవుతుందనేది కష్టమే… ప్రధానంగా విష్ణుకు అంత మార్కెట్ లేదు… ఎంత బంపర్ హిట్టయినా సరే 20- 30 కోట్లు వస్తే విష్ణుకు చాలా ఎక్కువ… మరి ఎందుకీ 150 కోట్ల ప్రయత్నం..? అవునూ, ఓ పాత కళాఖండం పేరు ప్రఖ్యాతులను ఈ ప్రయత్నంతో ఖండఖండాలు చేయబోతున్నారా..? ఇలాంటి సినిమాల జోలికి ఎవరూ రాకుండా ఏమైనా నిషేధాలు ఉంటే బాగుండేది…!!
పాపం, మొదట్లో దీనికి దర్శకుడు తనికెళ్ల భరణి అనుకున్నారట, ఇప్పుడు వినిపించే పేరు ముఖేష్ కుమార్ సింగ్… పెద్దగా ఎప్పుడూ వినలేదు… తను బాపును మరిపిస్తాడా… హవ్వ… ఇంతకీ వాణిశ్రీ ప్లేసులో ఎవరో… ఎందుకోగానీ, ప్రభాస్ ఆదిపురుష్ పదే పదే గుర్తొస్తోంది… పాపం శమించుగాక…!!
Share this Article