Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీన్ కట్ చేస్తే… ఆ పోలీస్ భార్య ఏకంగా కలెక్టర్ అయిపోతుంది…

March 8, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … A good entertainer . సినిమా పేరు పోలీస్ భార్య, అవును, ఓ పోలీసాయన భార్య ఏకంగా కలెక్టర్ కావటం 1990 లో వచ్చిన ఈ సినిమాకు కథ… నటుడు , రచయిత ఓంకార్ కధతో పాటు డైలాగులను వ్రాసి ఒక ముఖ్యమైన పాత్రను కూడా వేసారు . సినిమాలో సీతే షీరో .

తిక్క మొగుడు నరేష్ పోలీస్ . టివిలో వార్తలు చదివే సీతను ప్రేమించి , వెంటపడి , విసిగించి , తల్లిదండ్రులను ఎదిరించి పెళ్ళి చేసుకుంటాడు .  ఆ ప్రేమించే క్రమంలో సీత ఉద్యోగం కూడా కోల్పోయి నిరుద్యోగి అవుతుంది .

Ads

రాజా వాసిరెడ్డి వారి ఆడపడుచునని మాట మాటకూ చెప్పుకునే S.P గారి భార్య కానిస్టేబులుగా ఉండే తిక్క నరేషుని అవమానిస్తుంది . అతని భార్య సీతతో సహా . ఆ గొడవలో తిక్క మొగుడిని వదిలేసి అత్తమామల దగ్గరకు ఐడెంటిటీ చెప్పకుండా చేరుతుంది .

అక్కడ పట్టుదలతో IAS కు ప్రిపేరయి వాళ్ళ జిల్లాకే కలెక్టరుగా వచ్చి తిక్క మొగుడిని ఆశ్చర్యపరుస్తుంది . విధి నిర్వహణలో తన S.P భర్త కలెక్టర్ సీతతో కలిసి పనిచేయటాన్ని అనుమానించి కలెక్టరుతో ఘర్షణకు దిగుతుంది రాజా వాసిరెడ్డి వారి ఆడపడుచు .

ఈ ఘర్షణలో కలెక్టర్ సీత తిక్క మొగుడు , మామ , అందరూ సీత వెంట నిలబడతారు . S.P గారి భార్యకు గర్వభంగం జరుగుతుంది . అందరూ కలవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

సినిమా ప్రారంభం స్లోగా సాగుతూ విసిగించినా పోనుపోను ఆసక్తికరంగా ఉండి స్పీడందుకుంటుంది . కలెక్టర్ సీతగా సీత , తిక్క పోలీసు మొగుడిగా నరేష్ , అత్తమామలుగా గొల్లపూడి , డబ్బింగ్ జానకి , ఆడబిడ్డగా వరలక్ష్మి , వదినగా రాజ్యలక్ష్మి చక్కగా నటించారు .

సీత అన్నగా ఓంకార్ చెల్లెల్ని , భార్యనే కాకుండా ప్రేక్షకులను కూడా ఘట్టిగానే విసిగిస్తాడు . ఈ సినిమా కధా రచయితగా అన్ని పాత్రలనీ బాగా మలిచినా తన పాత్రను మాత్రం గందరగోళంగా మలుచుకున్నాడు . ఉద్యోగం రాలేదని దొంగ రిజర్వేషన్ సర్టిఫికెటుతో పట్టుబడి కలెక్టర్ చెల్లెలు తీర్పుతోనే మూడేళ్ల జైలుశిక్షకు గురవుతాడు . ఇతర ప్రధాన పాత్రల్లో లతశ్రీ , అంజన , ఆహుతి ప్రసాద్ తదితరులు బాగా నటించారు . ఈ ముగ్గురిలో లతశ్రీ బాగా నటించింది .

హాస్య దర్శకుల స్కూల్లో ఒకరయిన రేలంగి నరసింహారావు స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని వహించారు . రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో కార్తీక మాసాన కలికి వెన్నెల దీపం చాలా శ్రావ్యంగా ఉంటుంది . చక్కగా చిత్రీకరించబడింది కూడా . మహిళలకు బాగా నచ్చే పాట .

ఇతర పాటలు వయ్యారి దొరసాని , ఈ ఒక్క సారి నా తప్పు కాసి డ్యూయెట్లు థియేటర్లో ఓకే . ఓంకార్ మీద చిత్రీకరించబడే పాట లబకు దబుకు (ఆయనే వ్రాసుకున్నాడు అనుకుంటా) అంతులేని కధలో రజనీకాంత్ పాట దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాటను గుర్తు చేస్తుంది .

వేటూరి , ఓంకార్ , నారాయణ వర్మ వ్రాసిన లిరిక్సుకు సుశీలమ్మ , మనో , జానకమ్మ , రాధికలు పాడారు .
సినిమా యూట్యూబులో ఉంది . నేను టివి లోనే చూసినట్లు గుర్తు . సినిమా బాగుంటుంది . చూడతగ్గ సినిమా .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పట్లోనే రాఘవేంద్రరావు కంట్రాక్టు పెళ్లిని చూపించాడు !!
  • వెకిలి రాఖీ యాడ్‌ను నగల కంపెనీ తీసేసింది ! ఎవరి పరువు పోయింది ?!
  • మతం మా విశ్వాసం – ఓనం మా సంస్కృతి – కేరళ కొత్త తరం అభిమతం !!
  • ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!
  • Very Toxic – పక్కా విషస్వభావి – Not for Grown-Ups also !!
  • అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు…
  • గవర్నర్‌పై ఐదు బుల్లెట్లు… ఆ 21 ఏళ్ల యువతి ఎవరు?
  • అసలే ఖర్చు తడిసిమోపెడు- పైగా ఇన్ని సుమోలు ఎందుకురా బుజ్జా..!
  • SLBC – ప్రకృతి కోపంతో దారిమూస్తే – మరో దారి తవ్వి గెలుస్తున్నాం !!
  • చిరంజీవి గ్లామర్ చీర నుంచి అన్నమయ్య చీర తత్వం దాకా..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions