ముందుగా ఆంధ్రజ్యోతి వాడు రాసినట్టున్నాడు… అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్ అని…! కేంద్ర ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చింది… ఇది ఆనవాయితీయే… రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతను ఉన్నత స్థాయిలో సమీక్షించి వెళ్లాక షెడ్యూల్ జారీ చేస్తుంటారు… సో, ఉజ్జాయింపుగా వాళ్లు ఢిల్లీ తిరిగి వెళ్లాక షెడ్యూల్ ప్రకటన వస్తుందనే భావనతో ఆ తేదీని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది… వాస్తవానికి దగ్గరగా ఉన్న అంచనా అది…
గత ఎన్నికలు… అంటే 2018 తెలంగాణ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఇవే తేదీలలో షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్ తేదీ ఉన్నాయి… దాన్ని బట్టి, ఆంధ్రజ్యోతి వార్తను బట్టి చాలా చిన్న పత్రికలు, సైట్లు అదుగో నోటిఫికేషన్, ఇదుగో పోలింగ్ అన్నట్టుగా రాసిపారేశాయి… నిజానికి ఈ ఎన్నికల బృందం ఢిల్లీ వెళ్లగానే షెడ్యూల్ ప్రకటించాలని లేదు, ఎలాగూ ముందస్తు లేదు, జమిలి ఎన్నికలూ లేవు కాబట్టి టైం ప్రకారమే జరుగుతాయని మనం అంచనా వేసుకోవచ్చు…
Ads
2018 ఎన్నికలకు నవంబరు 12న నోటిఫికేషన్ వెలువడింది… అంటే వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది… 19 వరకూ నామినేషన్లకు చివరి తేదీ… పరిశీలన 20న… ఉపసంహరణ గడువు 22 వరకు… పోలింగ్ ఏడున, లెక్కింపు 11న… 13 నాటికి ఎన్నికల ప్రక్రియ క్లోజ్… అయిదేళ్ల గడువు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చూస్తుంటే తిరిగి ఆ తేదీల్లోనే ఎన్నికల ప్రక్రియ ఉండే చాన్స్ అయితే ఉంది…
ఇప్పుడిక సాక్షి డెయిలీ వార్తా దరిద్రాన్ని ఓసారి చెప్పుకుందాం… మొన్నొకసారి పత్రికలో రాశారు… అక్టోబరు మొదటి వారంలో (ఏదో తేదీ కూడా రాశారు…) నోటిఫికేషన్ జారీ అవుతుందని..! ఫాఫం, ఎవరేం రాస్తున్నారో కాస్త చెక్ చేసుకునే దిక్కే లేనట్టుంది… షెడ్యూల్‌కు నోటిఫికేషన్‌కూ తేడా తెలియదు… షెడ్యూల్ అంటే కాస్త ముందుగా తేదీల్ని ప్రకటిస్తారు… ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది… నోటిఫికేషన్ జారీ అంటే నామినేషన్ల స్వీకరణ సహా మిగతా ఎన్నికల అధికారిక ప్రక్రియ ఆరంభమవుతుంది…
సరే, అప్పుడేదో తప్పు రాశారులే అనుకుంటే ఈరోజు తమ న్యూస్ వెబ్‌సైట్‌లో కూడా అలాగే రాసేశారు… సో, ప్రింట్‌కూ, వెబ్ మీడియాకూ తేడాయే లేదన్నమాట… ఎలాగూ జగన్ వదిలిపెట్టాడు కదా… ఇక పైస్థాయలో అందరూ వదిలేసినట్టున్నారు… పాఠకుడు నవ్వుకుంటాడనే సోయి కూడా లేదు… టీవీ లైవ్‌లో చాలాసార్లు పొరపాటుగా ఏదేదో చెబుతుంటారు… అర్థం చేసుకోవచ్చు… వెబ్ మీడియాలో పెద్దగా శిక్షణ, అనుభవం ఉన్న సిబ్బంది ఉండరు, అదీ అర్థం చేసుకోవచ్చు… కానీ పత్రికలో ఒక వార్త పబ్లిషింగ్ వరకూ రావాలంటే పలు దశల్లో పరిశీలన దాటి రావాలి… ఐనా సరే, ఇలాంటి తప్పులు… ఫాఫం జగన్..!
Share this Article