కలర్స్ స్వాతి… ఇప్పుడు స్వాతిరెడ్డి అని పిలుస్తున్నారు కదా… అలియాస్ స్వెత్లానా… ఆమె అసలు పేరు అదే… రష్యాలో పుట్టింది కదా, అక్కడి పేరే పెట్టారు… తరువాతే స్వాతి అయ్యింది… టీవీ యాంకరింగ్ గానీ, తొలుత నటించిన సినిమాల్లో గానీ యంగ్ లుక్‌తో సరదా మాటలతో గలగలా మాట్లాడుతూ కనిపిస్తుంటేనే కాస్త ముచ్చటగా ఉండేది… ఈ బక్క పిల్ల పెద్ద అందగత్తె కూడా ఏమీ కాదు కదా…! కానీ..?
ఐదారేళ్ల క్రితం పెళ్లయ్యింది… విదేశం వెళ్లింది… సినిమాలకు దూరమైంది… వయస్సూ ఇంకాస్త పెరిగింది… ఈమధ్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది… ఎందుకోగానీ పాత స్వాతి కనిపించలేదు ఆమె తాజా సినిమా ‘మంత్ ఆఫ్ మధు’లో… పైగా సినిమాలో కొంతసేపు ఆ పాత సరదా స్వాతి కనిపించినా, ఆ పాత్ర రీత్యా చాలాసేపు సీరియస్‌గా కనిపించింది… ఆ సీరియస్‌నెస్ ఆమెకు నప్పలేదు… ఎందుకో ఎమోషనల్ బరువు సీన్లు ఆమెకు అంతగా సూటవ్వవేమో…
అలాగని నటనాపరంగా ఏదో తక్కువ చేసిందని కాదు… తన ప్రయత్నం తాను సిన్సియర్‌గానే చేసింది… ఏదో సీన్‌లో కాస్త బోల్డ్‌గా కూడా చేసింది… మరోవైపు నవీన్ చంద్ర… మంచి నటుడే… కానీ తనకు ఈ సినిమాలో దక్కిన పాత్ర పెద్దగా తనకు పరీక్ష పెట్టేదేమీ కాదు… ఉన్నంతలో తనూ బాగానే చేశాడు… వీళ్లే హీరోహీరోయిన్లు… కథలో లవ్వర్లు… పెళ్లవుతుంది… ఎక్కడో తేడా కొట్టి ఆమె తనకు విడాకులు ఇవ్వడానికి కోర్టుకెక్కుతుంది… హీరో గారికి మాత్రం విడిపోవడం ఇష్టముండదు, తాగుడుకు అలవాటవుతాడు…
Ads
ఈలోపు అమెరికా నుంచి ఓ అమ్మాయి వస్తుంది… ఆమె పేరే మధు… ఈ పాత్రను శ్రేయ నవేలి పోషించింది… ఆమె బాగానే చేసింది కానీ ఆ పాత్ర కేరక్టరైజేషన్ వెరీ పూర్… అమెరికాలో పుట్టిపెరిగిన మనవాళ్ల మీద దర్శకుడు శ్రీకాంత్‌కు సరైన అవగాహన లోపించినట్టుంది… ఈ దేశానికి ఆమె వచ్చాక నెలరోజుల్లో జరిగిన కథే ఈ సినిమా… నిజానికి టైటిల్ ఈ పాత్రదే… మంత్ ఆఫ్ మధు… నిజానికి ఈ సినిమా పట్ల రివ్యూయర్ల ఆసక్తికి, కొందరైనా థియేటర్‌కు వెళ్లడానికి కారణం స్వాతే…
కానీ ఆ స్వాతే చూడబుల్‌గా లేదు… మిగతా వాళ్ల గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు… దర్శకుడు ముందుగా స్త్రీ స్వేచ్ఛ అంటే ఏమిటో, స్త్రీ విచ్చలవిడితనం అంటే ఏమిటో ముందుగా కాస్త స్టడీ చేసి, ఓ అభిప్రాయానికి వచ్చి ప్రేక్షకుడికి చెప్పడానికి ప్రయత్నిస్తే బాగుండేది… కథాగమనం కూడా బోరింగ్‌గా సాగుతుంది… నడుమ రెండు ర్యాప్ సాంగ్స్… సందర్భరహితం… నాట్ ఇంప్రెసివ్ కూడా…
కొన్ని సీన్లలో మహేశ్ బాబు సోదరి మంజుల కనిపిస్తే… తనకు వచ్చిన చిన్న పాత్రలోనే జ్ఞానేశ్వరి అందంగా కనిపించి సద్వినియోగం చేసుకుంది… ఇంతకు మించి చెప్పుకోవడం కూడా అనవసరం… నిజానికి కాస్త కఠినంగా అనిపించినా ఇది థియేటర్ సరుకు కాదు… ఏదో ఓ ఓటీటీలో వెబ్ సీరిస్ చేస్తే సరిపోయేది…!!
Share this Article