శోభాశెట్టి పిచ్చోడా అని యావర్‌ను తిట్టిపోసింది, తన తిట్టు మీదే నిలబడింది… తప్పు… ఎస్… ఆట సందీప్ బొంగులో అనే పదం వాడాదు… సమర్థించుకునే ప్రయత్నం చేశాడు… తప్పు… ఎస్… యావర్ మళ్లీ అరుపులు, కేకల కేరక్టర్ అయిపోయాడు… తప్పు… ఎస్… మరి శివాజీ కూడా చాలాసార్లు బిగ్‌బాస్‌ను తిట్టాడు, పరుషమైన పదాలు వాడాడు… ఈసారైతే ఏకంగా ఎవడో ఒకడిని తన్ని బయటికి పోతాను అని వీరంగం వేశాడు… అది తప్పు కాదా నాగార్జున బాబు గారూ…
అందరి జెండాలు విరగ్గొట్టిన నాగార్జున శనివారం వీకెండ్ షోలో మాత్రం… శివాజీ జెండాను మాత్రం కరుణించి జస్ట్, ఊరికే పక్కన పడేశాడు… ఎందుకు..? శివాజీకి ఏ రూల్సూ వర్తించవా..? తనకే ఈ బిగ్‌బాస్ సీజన్ రాసిచ్చారా..? ఫస్ట్ నుంచీ నాగార్జున ఈ గరుడ పురాణం శివాజీని ప్రేమిస్తూనే ఉన్నాడు, వెనకేసుకొస్తూనే ఉన్నాడు, మిగతావాళ్లు జస్ట్, కంటెస్టెంట్లు, శివాజీ ‘పెద్దమనిషా’…
పోనీ, అంత పెద్దమనిషి తరహా ఏమైనా ఉందా..? ఏమీ లేదు… తను కూడా ఓ గ్రూపు మెయింటెయిన్ చేసి, ఎదుటి గ్రూపు మీద తన రాగద్వేషాల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు… మరి ఎందుకు తనకు ఈ మినహాయింపులు, సడలింపులు నాగార్జున బాబు గారూ… ఎవరిని కొట్టి బయటికి వెళ్తావు అని గట్టిగా అడగలేక పోయాడు నాగ్… పైగా నన్ను నేనే కొట్టుకుని బయటికి పోతా, ఇదే బయట అయితే చూసుకునేవాడిని అంటూ ఏవో తిక్క జవాబులు… అయినా నాగార్జున బాబు గారు జెండా విరగ్గొట్టి కోపంగా చూడరు… అదే ఆట సందీప్ బొంగులో పదాన్ని వాడితే గుచ్చి గుచ్చి వెక్కిరింపు… హేమిటో…
Ads
కంటెస్టెంట్ ఆటతీరును, బిహేవియర్‌ను బట్టి గాకుండా ఇంకేవో కారణాలు బిగ్‌బాస్ టీంను నడిపిస్తున్నాయి… అందుకే నాగార్జున చీఫ్ జడ్జి పాత్రలో రాణించడం లేదు… రాణించకుండా బిగ్‌బాస్ టీం అడ్డుపడుతోంది… అసలు నాగార్జున షో ఎప్పుడైనా చూస్తాడా..? లేక ఆ టీం రాసిచ్చే స్క్రిప్టుకు మాత్రమే పరిమితమవుతాడా..?
ఈ వీకెండ్ షోలో ప్రస్పుటంగా కనిపించింది… మిగతా ఆటగాళ్లందరూ ఒకెత్తు, శివాజీ మరో ఎత్తు… అందుకే, ఆ పక్షపాతం నాగార్జున నుంచి, బిగ్‌బాస్ టీం నుంచి కనిపిస్తోంది కాబట్టే… ఈ గ్రూపుతో గోక్కోవడం దేనికని రతిక ఆ గ్రూపులో అందరి వద్దకూ వెళ్లి ‘శృతి’ కలుపుతోంది… కన్నీళ్లు పెట్టుకుంటోంది… కాళ్లు మొక్కుతోంది… దోస్తానా కోసం తాపత్రయపడుతోంది… దేభ్యం మొహం వేసుకుని కూర్చోవడమే తప్ప ఏ ఆటలోనూ యాక్టివ్ కాదు… హౌజులోకి అనవసర రీఎంట్రీ… ఆ సింగర్ దామినిని తీసుకొచ్చినా బాగుండేదేమో…
శోభాశెట్టిని వెకిలిగా వెక్కిరిస్తూ యావర్ చేసిన విన్యాసాలపై నాగార్జున ఒక్క మాటా అనలేదు… శోభకు నాగార్జున క్లాస్ పీకాడు, అది కరెక్టే… పలుసార్లు ఆమె అదుపు తప్పుతోంది… నాగార్జున నుంచి కొన్ని చురకలు, అదుపు చేసే వ్యాఖ్యలూ అవసరమే… కానీ అదే ధోరణి మిగతా కంటెస్టెంట్ల విషయంలోనూ కనిపించాలి కదా నాగార్జున బాబు గారూ… యావర్ మీదిమీదికొచ్చి పెద్దగా అరుస్తుంటే తప్పుగా అనిపించలేదు, ఎవడో ఒకడిని తన్నిపోతాను అని శివాజీ అంటే తప్పుగా అనిపించలేదు… ఇదెక్కడి ధోరణి నాగార్జున బాబు గారూ…
అశ్విని బాగా ఏదో గేమ్‌లో ఆడింది కాబట్టి ‘జెండా పాతి’ అభినందించిన నాగార్జున బాబు గారూ, మరి శోభాశెట్టి కూడా బాగానే ఆడి, కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది కదా… యావర్‌ను పిచ్చోడు అని తిట్టింది కాబట్టి ఆ గేమ్‌లో బాగా ఆడటం అనేది కొట్టుకుపోయిందా..? అందరి నడుమ పుల్లలు పెట్టే తేజకు ఎందుకు సరైన క్లాస్ పడలేదు..? తప్పు చేశానని తనే అంగీకరించిన అమర్‌దీప్‌కు పనిష్మెంట్ ఎందుకు లేదు..? దాదాపు గంటన్నర సేపు క్లాసులు పీకిన నాగార్జున బాబు గారూ… అప్పుడప్పుడూ షో చూస్తూ ఉండండి, పర్లేదు, మీకు మస్తు డబ్బు తెచ్చిపెడుతున్న షో అది… కేవలం బిగ్‌బాస్ టీం ఏ స్క్రిప్ట్ రాసిస్తే అది చదివేసి ఇజ్జత్ తీసుకోకండి… పైగా మీరు చీఫ్ జస్టిస్…
Share this Article