మొన్నటి 30వ తారీఖున నారా లోకేష్ హైదరాబాద్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ (సీబీఎఫ్సీ) కు ఓ లేఖ రాశాడు… అది కంప్లయింట్… జగన్‌ను కీర్తిస్తూ, ఓ మోస్తరు బయోపిక్ తరహాలో రాంగోపాలవర్మ వ్యూహం అనే సినిమా తీశాడు కదా… రెండో భాగం కూడా తీయబోతున్నాడు కదా… దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని, పబ్లిక్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకూడదని లోకేష్ లేఖ సారాంశం…
వైఎస్ పాదయాత్ర మీద అప్పట్లో ‘యాత్ర’ అనే సినిమా వచ్చింది… తరువాత కూడా చంద్రబాబును చీప్‌గా చిత్రీకరిస్తూ రాంగోపాలవర్మ ఏవేవో సినిమాల్లో పాత్రలు పెట్టాడు… అవేవో ఎన్టీయార్ మీద తీసిన సినిమాల్లో చంద్రబాబును చెడుగా ప్రొజెక్ట్ చేశాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్మ పవన్ కల్యాణ్ వ్యతిరేకి, చంద్రబాబు వ్యతిరేకి, జగన్ వీరాభిమాని…
కానీ వర్మ వంటి కేరక్టర్లకు ఇలాంటి రాగద్వేషాలు ఉండవని అంటారు కదా, వర్మ కూడా అదే చెప్పుకుంటాడు కదా, మరేమిటి ఈ పొలిటికల్ పక్షపాతాలు అంటారా..? వర్మ అనే చిత్తపైత్యాన్ని ఎవరూ జడ్జ్ చేయలేరు… పైగా కంట్రవర్సీలు, బయోపిక్స్ పేరిట డబ్బు సంపాదన… తను గతంలో కొండామురళి బయోపిక్ దారుణాతిదారుణంగా ఫ్లాప్… అసలు వర్మలో ఇంకా దర్శకుడు ఉన్నాడా అనే సందేహం వస్తుంది ప్రేక్షకులకు… అలాంటి వర్మకు జగన్ తన బయోపిక్ తీయడానికి ఎలా అనుమతించాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న… ఫాఫం జగన్…
Ads
గతంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గానీ, చంద్రబాబు గానీ వర్మ చిత్తపైత్యాలపై స్పందించలేదు, ఆయా సినిమాల్ని ఆపాలని కూడా ప్రయత్నించలేదు… కానీ ఇప్పుడు వర్మను ఉపేక్షించదలుచుకోలేదు… ఇప్పుడు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు లోకేష్… ఒకవేళ సదరు బోర్డు కూడా క్రియేటివ్ ఫ్రీడం, ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ సాకులతో సర్టిఫికెట్ ఇస్తే..? లోకేష్, టీడీపీ క్యాంప్ ఏం చేస్తుంది..?
కోర్టుకు వెళ్తుంది… ఎవరినీ వ్యక్తిగతంగా డీఫేమ్ చేయకూడదనీ, చెడుగా చిత్రీకరించకూడదని సెన్సార్ యాక్ట్ చెబుతున్నది నిజమే… తన లేఖలో ఆ సెక్షన్లూ పొందుపరిచాడు లోకేష్… కానీ ఒకవేళ వర్మ ఇవన్నీ కల్పిత పాత్రలని సినిమాలో ముందే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, పాత్రల పేర్లను మార్చేస్తే..? అప్పుడు సెన్సార్ బోర్డు ఏం చేయాలి..? సర్టిఫికెట్ ఇవ్వకతప్పదు… సో, లోకేష్ ఈ విషయంలోనూ కోర్టుకు ఎక్కడం గ్యారంటీ అనిపిస్తోంది…
లోకేష్ తన ఫిర్యాదు లేఖలో ఏమంటాడంటే..? ‘‘11 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ను అమాయకుడిగా చిత్రిస్తున్నారు… మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మా నాన్నను చెడుగా చిత్రిస్తున్నారు… ఒక ఏసీబీ కేసులో జుడిషియల్ కస్టడీలో ఉన్న మా నాన్న గానీ, ఇవే కోర్టు పనుల్లో బిజీగా ఉన్నందువల్ల ఆ ట్రెయిలర్లు, టీజర్లు రిలీజైన వెంటనే స్పందించలేకపోయాం, ఈ సినిమా పూర్తిగా సెన్సార్ యాక్ట్‌కు వ్యతిరేకం, ఒకవేళ అవకాశం ఇస్తే మా లాయర్లు, మేం వచ్చి మా వాదనలు చెబుతాం’’ ఇలా సాగింది ఆ లేఖ…
సో, ఆ సినిమాపై కోర్టుల్లోనూ న్యాయపోరాటం చేయడానికి కూడా లోకేష్ క్యాంప్ రెడీ అయిపోతోంది… అన్నట్టు ఆ ట్రెయిలర్లు, టీజర్ల తరువాత ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన కథనం లింక్ దిగువన… ఓసారి లుక్కేయండి…
వ్యూహం… నిజపాత్రల్ని అచ్చంగా తెర మీదకు దింపడంలో వర్మ పర్‌ఫెక్ట్…
అన్నట్టు RGV స్పందన ఇదీ… సినిమాను సెన్సార్ బోర్డు అధికారి రివైజింగ్ కమిటీకి పంపించాడు… దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది…
Share this Article