మేం చెప్పినట్టు బిగ్‌బాస్ టీం నడుస్తుంది… మేం నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తే బిగ్‌బాస్ టీం పాటిస్తుంది… అని అనుకున్న సైట్లు, చానెళ్లకు బిగ్‌బాస్ టీంకు కాల్చి వాత పెట్టాడు… తెలంగాణ భాషలో చీరి చింతకు కట్టాడు… హౌజులో అందరికన్నా చురుకుగా, దూకుడుగా ఉన్న శోభాశెట్టి శివాజీ గ్యాంగుకు పంటి కింద రాయిలా మారింది…
బిగ్‌బాస్‌ను ప్రస్తుతం శివాజీ ‘ఒంటి చేత్తో’ శాసిస్తున్నాడు కదా… నాగార్జున కూడా సపోర్ట్ కదా… తను, తనకో గ్యాంగు… ఆటలో యాక్టివ్ కాదు, ఎంటర్టెయిన్మెంట్ లేదు, మాట్లాడితే నీతులు, తెర వెనుక గోతులు… పైగా బిగ్‌బాస్ నుంచి పంపించెయ్ అంటూ… ఎవడినో ఒకడిని తన్నిపోతా అంటూ ఏవేవో బెదిరింపులు… భలే కేరక్టర్…
తనకు తగ్గట్టుగా యావర్ ఒకటి… తెలుగు రాదు, అర్థం కాదు, పైగా వెకిలి బాడీ లాంగ్వేజీతో వెక్కిరింపులు, మీదమీదకు దూసుకురావడం, పెద్దగా గొంతు చేసుకోవడం అన్నీ ఉన్నయ్… తోడుగా పాలేరులాగా పల్లవి ప్రశాంత్… శివాజీకి అచ్చం తోక… కొత్తగా వచ్చిన భోలే కూడా సేమ్… ఏవేవో పాడుతూ, ఎవరికీ అర్థం కాని మాటలతో విసిగిస్తున్నాడు… దీనికితోడు కొత్తగా మళ్లీ హౌజులోకి వచ్చిన రతిక అయితే ఏకంగా శివాజీ కాళ్ల మీద పడి, యావర్-భోలేలను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లూ పడుతోంది… ప్రశాంత్‌తో కూడా… అంతగా చలాయించుకుంటోంది శివాజీ గ్యాంగ్…
Ads
ఈ నేపథ్యంలో శివాజీ గ్యాంగుకు సపోర్టుగా బయట సైట్లు అపోజిట్ గ్యాంగ్ మీద విపరీతమైన ద్వేషాన్ని గక్కుతున్నయ్… ప్రత్యేకించి ఎదుటి గ్యాంగులో ఉన్న శోభాశెట్టిని టార్గెట్ చేశాయి, తిట్లు-బూతులు కూడా… ఆమె గ్యాంగులో అమర్దీప్, ప్రియాంక, టేస్టీ తేజ ఉన్నారు… అఫ్ కోర్స్, తేజ అందరినీ నవ్విస్తూ, ఆటలో అరటిపండులా అందరితో బాగుంటూ, సేఫ్ గేమ్ ఆడుతూ ఎన్ని రోజులు వీలైతే అన్నిరోజులు హౌజులో ఉండే ప్లాన్… రిస్క్ తీసుకోడు… కానీ ఏమైంది..?
శోభాశెట్టిని ఎలాగైనా బయటికి పంపించాలని కొన్ని వారాలుగా ప్రయత్నిస్తున్న శివాజీ మార్క్ సోషల్ మీడియా గ్యాంగులకు బిగ్‌బాస్ టీం చురక పెట్టింది… ఒకవారం ఆమెకు బదులుగా నయనని… మరోవారం ఆమెకు బదులుగా ఆట సందీప్‌ను బయటికి పంపించేసిన టీం ఇప్పుడు తేజను పంపించేసింది… రొమాన్స్ నటిస్తున్న శోభా, తేజ జంటలో మగపక్షిని విడదీసింది… శోభను సేవ్ చేసింది… (ఒక సైటు ఇదుగో శోభను వారం మధ్యలోనే బయటికి తన్నితరిమేస్తారన్నట్టు రాసింది…)
నిజానికి హౌజులో యాక్టివిటీ థ్రిల్లింగ్‌గా ఉండాలంటే శోభ వంటి దూకుడు కేరక్టర్లే అవసరం… మాటకుమాట, చేతకుచేత… ఆ టెంపర్మెంట్ ఉండాలి… అది అమర్దీప్లో కూడా ఉంది… కాస్త ప్రియాంక ఇందులో తక్కువే… ఈ స్థితిలో శోెభను బయటికి పంపిస్తే ఆటలో మజా ఎక్కడుంది..? ఉన్న ఆడ లేడీస్‌లో ప్రియాంకను వదిలేస్తే అశ్విని, రతిక ఎంటర్టెయిన్ చేయడంలో వీక్… రతిక మరీ వీక్, పైగా ఒక గ్యాంగు మీద డిపెండెంట్…
అన్నింటికీ మించి శోభతో బిగ్‌బాస్ కంట్రాక్టు ఎక్కువ వారాలు… అందుకని వోటింగుతో సంబంధం లేకుండా ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నారు… ఆటకు రేటింగ్స్ కూడా చూసుకోవాలి కదా… మధ్యలో వచ్చిన కంటెస్టెంట్లు వీక్, రతిక మరీ వీక్… పైగా ఉన్న కంటెస్టెంట్లలో ఆడలేడీస్ సంఖ్య తక్కువ… అందుకని శోభను కంటిన్యూ చేయకతప్పలేదు బిగ్‌బాస్ టీంకు… వచ్చేవారం కెప్టెన్, ఇమ్యూనిటీ వచ్చింది… సో, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మరో రెండు వారాలు ఆమె హౌజులో ఉంటుంది… అంతే… ఏమైనా రాసుకొండి… అప్పటివరకూ శివాజీ కూడా ఏమీ చేయలేడు..!!
వరుసగా ఆరుగుర్ని నామినేట్ చేసి బయటికి పంపిన తేజ చివరికి తనే ఔట్ అయిపోయాడు…
Share this Article