Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఛాంపియన్స్.., ఇప్పుడు తలవంచుకుని అవమానకరంగా ఇంటికి..!?

November 4, 2023 by M S R

…. (నారపరాజు నరసింహా రావు) …. వరల్డ్ కప్ 2023 ముగింపు కు వచ్చే సమయంలో క్రీడాభిమానులకు మ్యాచ్ జరుగుతున్న తీరుతెన్నులు వస్తున్న ఫలితాలు కొంత ఉత్కంఠ భరితంగా మారాయి.. … ఈసారి మ్యాచ్ లు రౌండ్ రాబిన్ పద్ధతి లో జరుగుతున్నాయి..అంటే టోర్నమెంట్ లో పాల్గొనే పది టీమ్ లు కూడా ప్రతి ఒక్క టీమ్ తో ఒక మ్యాచ్ ఆడాలి (అంటే తొమ్మిది మ్యాచ్ లు )….


దీంతో బలమైన జట్లు సగం మ్యాచ్ లు అయ్యేవరకు దాదాపు సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకోవడం వల్ల తరువాత మ్యాచ్ లు నామమాత్రంగా ఉంటాయి అని అందరూ భావించారు…. అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన న్యూజిలాండ్ అనూహ్యంగా వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడి పోయి ( భారత్ , సౌత్ ఆఫ్రికా , ఆస్ట్రేలియా పాకిస్థాన్ ) టేబుల్ లో నాలుగవ స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితికి వెళ్ళింది….

మొదట రెండు మ్యాచ్ లు ఓడిపోయి టేబుల్ లో కింద ఉన్న ఆస్ట్రేలియా అనూహ్యంగా వరుసగా నాలుగు విజయాలతో మూడో స్థానం లోకి ఎగబాకింది…


ఇదే సమయంలో పసికూనలైన ఆఫ్ఘనిస్తాన్ నెదర్లాండ్స్ జట్లు మేటి జట్లను ఓడించి కొన్ని సంచలనాలను సృష్టించాయి…

దీంతో ఈరోజు రెండు మ్యాచులు చాలా కీలకంగా మారాయి…
న్యూజిలాండ్ – పాకిస్థాన్
ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్

వాస్తవానికి నిన్నటి వరకూ పాకిస్థాన్ సెమీస్ ఆశలు అడుగంటి పోయాయి..ఈరోజు మ్యాచ్ లో న్యూజిలాండ్ 400 పై చిలుకు భారీ పరుగులు సాధించినా కూడా వర్షం వల్ల పాకిస్థాన్ ను విజేత గా ప్రకటించడంతో టేబుల్ లో పాకిస్థాన్ 5 స్థానానికి చేరి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది….

ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ల మధ్య మరొక మ్యాచ్ కూడా రసవత్తరమైన పోరు జరిగింది అనే చెప్పాలి…

ఈరోజు మ్యాచ్ లు అయ్యే వరకు టేబుల్ లో ఉన్న మొదటి 6 జట్ల సెమీస్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి..

1 భారత్.. ఇకొంక రెండు మ్యాచ్ లు మిగిలి వుండగానే 14 పాయింట్ల తో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది …. రేపు సౌతాఫ్రికా తో దీపావళి రోజున నెదర్లాండ్స్ తో మ్యాచ్ లు ఉన్నాయి…మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే 18 పాయింట్ల తో టేబుల్ లో మొదటి స్థానంలో ఉంటుంది… ఒకవేళ సౌతాఫ్రికా తో ఓడిపోయి నెదర్లాండ్స్ తో గెలిచినా కూడా 16 పాయింట్ల తో మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది… ఏదైనా అద్భుతం జరిగి నెదర్లాండ్స్ చేతిలో కూడా ఓడిపోతే 14 పాయింట్ల తో యథాతథ స్థితి లో ఉంటుంది…..

2. సౌతాఫ్రికా… 12 పాయింట్ల తో రెండో స్థానంలో ఉన్న ఈ జట్టుకు ఇంకొక రెండు మ్యాచ్ లు ఉన్నాయి

Ads


ఒకటి భారత్ తో రెండోది ఆఫ్ఘనిస్తాన్ తో తలపడాల్సి ఉంటుంది… ఒకవేళ రెండూ గెలిస్తే 16 పాయింట్ల తో ఉండి ( భారత్ నెదర్లాండ్స్ తో గెలిస్తే) రన్ రేట్ ఆధారంగా ఒకటి రెండు స్థానాల కోసం పోటీ పడుతుంది…


ఒకవేళ భారత్ తో ఓడి ఆఫ్ఘన్ తో గెలిస్తే 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటుంది…
ఒకవేళ రెండూ ఓడిపోయినా కూడా 12 పాయింట్ల తో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది కానీ ఏ స్థానంలో ఉంటుంది అనేది ఆస్ట్రేలియా రన్ రేట్ బట్టి ఆధారపడి ఉంటుంది…

3. ఆస్ట్రేలియా … ప్రస్తుతం 10 పాయింట్ల తో ఈ జట్టు మూడో స్థానంలో ఉంది…
ఇంకొక రెండు మ్యాచ్ లు ఉన్నాయి ఒకటి ఆఫ్ఘనిస్తాన్ తో మరోకటి బంగ్లాదేశ్ తో .. రెండూ గెలిస్తే 14 పాయింట్లతో 2,3 స్థానాల కోసం సౌతాఫ్రికా తో నెట్ రన్ రేట్ తో పోటీ పడుతుంది..


.ఒక వేళ ఒక మ్యాచ్ గెలిచి మరొకటి ఓడిపోతే (ఆఫ్ఘన్ తో) 12 పాయింట్ల తోనే ఉంటుంది..
ఏదైనా అద్భుతం జరిగి రెండు కు రెండూ ఓడిపోతే పది పాయింట్ల తో నాలుగో స్థానం కోసం పోటీ పడాల్సి వస్తుంది..



4.న్యూజిలాండ్ … ప్రస్తుతం 8 పాయింట్లతో టేబుల్ లో నాలుగవ స్థానం లో ఉన్న న్యూజిలాండ్ కు ఒకే ఒక మ్యాచ్ మిగిలివుంది… శ్రీలంక తో…ఆ మ్యాచ్ లో గెలిచినా కూడా సెమీస్ అవకాశం లేదు… పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ ల జయాపజయాల మీద న్యూజిలాండ్ భవితవ్యం ఆధార పడి ఉంది..
శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం సాధిస్తే 10 పాయింట్ల తో ఉంటుంది..

5 ప్రస్తుతం 8 పాయింట్ల తో ఉన్న పాకిస్థాన్ తన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మీద కూడా గెలిస్తే పాకిస్థాన్ కు కూడా పది పాయింట్లు ఉంటాయి..న్యూజిలాండ్ ఆఫ్ఘన్ లతో నెట్ రన్ రేట్ తో నాలుగవ స్థానం కోసం పోటీ పడాలి..మెరుగయిన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది… ఇంగ్లాండ్ తో ఓడితే ఆ జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది…


6 ఆఫ్ఘనిస్తాన్ కూడా సెమీస్ అవకాశాలు లేకపోలేదు..ప్రస్తుతం ఆఫ్ఘన్ కు 8 పాయింట్లు ఉన్నాయి మరొక రెండు మ్యాచ్ లు ఉన్నాయి ఏదైనా అద్భుతం చేసి తన చివరి రెండు మ్యాచ్ లు ఒకటి సౌతాఫ్రికా మరొకటి ఆస్ట్రేలియా మీద గెలిస్తే ఏ నెట్ రన్ రేట్ లేకుండా 12 పాయింట్ల తో సెమీస్ చేరే అవకాశం ఉంది….ఒకటి ఓడిపోయి ఒకటి గెల్చినా కూడా పది పాయింట్ల తో సెమీస్ కోసం పాక్ న్యూజిలాండ్ లతో పోటీ పడుతుంది… ఒక వేళ పాక్ ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడితే ఆఫ్ఘన్ 10 పాయింట్ల తో నేరుగా నాలుగో స్థానం దక్కించుకుని సెమీస్ చేరుతుంది…

ఆరోజు మ్యాచ్ లు అయ్యే వరకు సెమీస్ లో నాలుగో స్థానం కోసం మూడు జట్లు బరిలో ఉన్నాయి… ఎవరు సెమీస్ చేరుతారు అనే ఉత్కంఠ మరొక వారం వరకు కొనసాగే అవకాశం ఉంది … ఇంగ్లాండ్ పాకిస్థాన్ మ్యాచ్ శనివారం నాడు ఉంది…ఏదైనా అద్భుతం జరిగి ఆఫ్ఘన్ రెండు మ్యాచులు గెలిస్తే శనివారం పాకిస్థాన్ మ్యాచ్ నామ మాత్రమే……

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions