సహజమే… పత్రికాధిపతి, ఛానెలధిపతి తనే ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి తన పత్రికలో ఫస్ట్ పేజీలో సగం వేయడమే గాకుండా ఓ ఫుల్ పేజీ కేటాయించారు… ఆయనేమో కాబోయే ముఖ్యమంత్రాయె… పైగా ఎన్నికల సందర్భం… సో, ఆ ఇంటర్వ్యూకు ఖచ్చితంగా ప్రయారిటీ ఉంది… ఆంధ్రజ్యోతి దాన్ని పాటించింది… అందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు… కాకపోతే..?
కేటీయార్ బోలెడు యూట్యూబ్ చానెళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు… జేపీ, నాగేశ్వర్ వంటి ప్రముఖులతో చిట్‌చాట్… చివరకు గంగవ్వతో వంటావార్పు… జనంలోకి తన వాదనను, తన ప్రచారాన్ని తీసుకుపోవడానికి ఏది దొరికితే అది వాడుకుంటున్నాడు… అది పెయిడా..? అన్ పెయిడా అనే సంగతి పక్కన పెడితే… వాటితో వచ్చే ప్రయోజనం ఏమిటనేది పక్కన బెడితే… ప్రధాన పత్రికలు, టీవీ చానెళ్లలో ఇలాంటి ఇంటర్వ్యూలే బెటర్…
అనేక ఇంటర్వ్యూలు, ప్రసంగాలలో లేనిది కేటీయార్, రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో కొత్త విషయం ఏముంది..? నిజం చెప్పాలంటే ఏమీ లేదు… ఒకటీ అరా చిన్న చిన్న అంశాలు తప్పితే… కాకపోతే… ఎంతసేపూ రాధాకృష్ణ ఒక ట్రాప్‌లోకి కేటీయార్‌ను లాగడానికి ప్రయత్నించాడు… ప్రొఫెషనల్‌గానే… ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది, ఓడిపోవడానికి మానసికంగా సిద్ధమవుతున్నారా..? అనే కోణంలోకి కేటీయార్‌ను తీసుకుపోవడానికి, తద్వారా కేటీయార్‌తో ఏదో అనిపించడానికి ఓ యత్నం…
Ads
కానీ కేటీయార్‌కు ఆర్కే ఇంటర్వ్యూల స్టయిల్ తెలుసు, పైగా తనూ రాజకీయ వ్యాఖ్యానాలు, అభిప్రాయ వ్యక్తీకరణలో కేసీయార్‌ను మించి ముదిరిపోయాడు కదా… తనే చెప్పినట్టు ముందే ప్రిపేరై వచ్చినట్టున్నాడు… ఎక్కడా టంగ్ స్లిప్ కాలేదు… తను చెప్పదలుచుకున్నది తను స్పష్టంగా, తత్తరపాట్లేమీ లేకుండా చెప్పాడు… గుడ్… సేమ్, వర్తమాన పాత్రికేయంలో ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడంలో రాధాకృష్ణ పర్‌ఫెక్ట్… పరమ చికాకు పెట్టించే సోకాల్డ్ టీవీ డిబేట్ల పరమ నాసిరకం ప్రజెంటర్లు తనకు వంద మైళ్ల దూరంలో ఉంటారు…
ప్రశ్నలు అడగడంలో వెరపు, సంకోచం, దాపరికం వంటివేమీ ఉండవు… అఫ్‌కోర్స్, కేసీయార్‌తో తనకున్న సాన్నిహిత్యం (ఇప్పుడు కొన్నాళ్లుగా ‘బాగా లేనట్టుంది‘) కారణంగా కేటీయార్ మీద కాస్త అభిమానపూర్వక చనువు కూడా ఉండటం వల్ల ఇంటర్వ్యూలో తన ప్రశ్నలు మరీ బరువుగా లేనట్టు అనిపించింది… ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు… ఐనా సరే ప్రస్తుత ఇంటర్వ్యూలలో చెప్పుకోదగిందే… సుదీర్ఘంగా సాగింది… కేటీయార్ రాజకీయ నాయకుడు కదా చాలా అంశాల్లో హిపోక్రటిక్ ధోరణి సహజంగానే వచ్చేసింది… కొన్ని అంశాల్లో…
2018 ఎన్నికల్లో చంద్రబాబు కేసీయార్‌తో పొత్తును ప్రతిపాదించడం… దానికి కేసీయార్ సమ్మతించకపోవడం… దాంతో చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి టీఆర్ఎస్‌ను ఓడించడానికి ప్రయత్నించడమే ఇరువురి నడుమ పంచాయితీ పెరగడానికి కారణమని కేటీయార్ చెప్పుకొచ్చాడు… కాంగ్రెస్‌తో కలవద్దని మాత్రమే కాదు, చేస్తే టీడీపీ ఒంటరిగా మాత్రమే పోటీచేయాలని కేసీయార్ షరతులు పెట్టినట్టు ఆర్కే చెప్పుకొచ్చాడు… (ఈసారి పూర్తిగా తెలుగుదేశం అనే జాతీయ పార్టీ తెలంగాణ బరి నుంచి పూర్తిగా తప్పుకుంది…)
కేటీయార్ మాటల్లో బాగా కనిపించిన ఆసక్తి ఏమిటంటే… ఆమధ్య చంద్రబాబు అరెస్టు మీద హైదరాబాద్‌లో ఆంధ్రులు సాగించిన ఆందోళనల మీద కేటీయార్ నెగెటివ్‌గా స్పందించాడు… కస్సుమన్నాడు… చంద్రబాబు అరెస్టు వ్యవహారం బీఆర్ఎస్ మీద నెగెటివ్‌గా పడింది… సెటిలర్ల వోట్లు కాంగ్రెస్ వైపు మళ్లడానికి దోహదపడుతోంది… తన మాటలకు వివరణ ఇవ్వడానికి కేటీయార్ బాగా ప్రయత్నించాడు… సెటిలర్ల వాయిస్‌గా వాళ్లు భావించే ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూయే దీనికి సరైన వేదిక అనుకున్నట్టున్నాడు…
రామోజీరావు అరెస్టు విషయంలో కూడా కేసీయార్ మానవతాదృక్పథంతో వ్యవహరించాడాని చెబుతూ… ఆయనకు 88 ఏళ్లు, పైగా కేన్సర్‌తో బాధపడుతున్నాడు… అందుకని తన అరెస్టుకు కెసిఆర్ అంగీకరించలేదు అని చెప్పుకొచ్చాడు… తీరా పొద్దున పత్రికలో చూస్తే కేన్సర్ అనే మాట మాయమై, అనారోగ్యం అని పబ్లిషైంది… ప్రత్యక్షప్రసారంలో జనంలోకి వెళ్లిన అంశాన్ని పత్రికలో ఎడిట్ చేయడం దేనికి..? అదేం బూతు కాదు, నిందారోపణ కాదు, దాన్నెందుకు దాచిపెట్టడం..?
తమ దగ్గర నమోదైన కేసుల్లోని నిందితులు ఎక్కడున్నా సరే, ఆ పోలీసులు వెళ్లడం అరెస్టు చేయడం, సంబంధిత పోలీసులు సహకరించడం కామన్… కానీ కేసీయార్ రామోజీరావు అరెస్టు సబబు కాదని తనే జడ్జిగా మారి, తనే తీర్పు చెప్పేసుకుని, రామోజీరావుకు తనే క్షమాభిక్ష పెట్టడం ఓ డిబేటబుల్ అంశం… సరే, ఇప్పుడు కేసీయార్‌తో గోక్కునే ఉద్దేశంతో లేడు కాబట్టి జగన్ ఊరుకున్నాడేమో… మన దేశంలో కేసులకు సంబంధించి విదేశాలకు వెళ్లి మరీ అరెస్టులు చేస్తుంటారు… ఇతర రాష్ట్రాలకు వెళ్లి చేస్తుంటారు… కానీ ఇక్కడ కేసీయార్‌తో రామోజీరావు సఖ్యత బాగుంది కదా… అందుకని హైదరాబాదులో ఉన్నన్నిరోజులూ రామోజీరావు ఏ నేరమూ ఎరుగనట్టే… ఇందులో మానవతాదృక్పథం ఏముంది..? ఒకరికొకరు సపోర్ట్… అంతే…
చివరగా… రోజూ 13 పేపర్లు చదువుతాను అని చెప్పుకొచ్చిన కేటీయార్ తను ఆంధ్రజ్యోతిలో అక్షరమక్షరం చదువుతాను అనడమే కాదు, నమస్తే తెలంగాణను అన్నింటికన్నా చివరగా చదువుతాను అన్నాడు… నిజానికి దాన్ని చదువుతాడా అనేది పెద్ద సందేహం… సరే, దానికీ ఏదో వివరణ వెంటనే ఇచ్చుకున్నాడు… విమర్శకులు ఏమంటున్నారో తెలుసుకోవడానికే ప్రయారిటీ ఇస్తాం కదా అన్నాడు… ప్చ్, చివరకు నమస్తే దాని ఓనర్లకూ పనికిరాని పత్రిక’ అయిపోయిందా..?!
Share this Article