Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శారద అనగానే… కథలూ, మాటలూ రెచ్చిపోయి రాసేస్తారు బ్రదర్స్…

February 13, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఈ అగ్గిరాముడు యన్టీవోడి అగ్గిరాముడు కధ కాదు . నిజానికి ఈ సినిమాకు కాటి రాముడు అని పెట్టాలి . కాటి రాముడు అంటే జనం రిసీవ్ చేసుకోకపోయే అవకాశాలు మెండు . బహుశా అందువలనే అగ్గిరాముడు అనే టైటిల్ పెట్టుకుని ఉంటారు .

పరుచూరి బ్రదర్స్ సినిమా యాత్రలో మరో మైలురాయి ఈ సినిమా అని చెప్పవచ్చు . మరో కుంతీపుత్రుడి కధ అయినా చివర్లో ట్విస్ట్ బాగుంటుంది . భర్త వివాహేతర భార్యకు పుట్టిన బిడ్డను శారద పెంచుతుంది . తన బిడ్డను వివాహేతర భార్య జయలలితకు ఇస్తుంది . అయితే చనిపోతూ తండ్రి అల్లు రామలింగయ్యకు అందచేస్తుంది ఆమె .

Ads

తల్లిదండ్రుల వివరాలు తెలవని ఆ కుంతీపుత్రుడు సమాజం మీద , జనం మీద , ముఖ్యంగా తల్లిదండ్రుల మీద కసి , కోపం పెంచుకుని తన శ్మశాన రాజ్యంలో తానే జడ్జి అయి శిక్షలు వేస్తుంటాడు . దర్యాప్తు బాధ్యత అతని కాలభైరవుడు నిర్వహిస్తూ ఉంటాడు .

పరుచూరి బ్రదర్స్ శారద కోసం చాలా పాత్రల్ని సృష్టించారు . ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అంతా పరుచూరి బ్రదర్స్ పుణ్యమే . ఆ కోవలో సినిమాయే ఈ అగ్గిరాముడు సినిమా . జడ్జిగా , తల్లిగా అద్భుతంగా నటించింది . వెంకటేష్ హీరో అయితే ఆమె షీరోయే .

వెంకటేష్ అదరగొట్టేసాడు . ద్విపాత్రాభినయం కావటంతో ఇద్దరు వెంకటేషులు . ఒక వెంకటేష్ జల్సాగా , హాయిహాయిగా తిరిగే పాత్ర . మరో పాత్ర అగ్గి మీద గుగ్గిలం పాత్ర . రెండు పాత్రలనీ అదరగొట్టేసారు . రెండింటిలో అగ్గిరాముడు పాత్రలో విజృంభించాడు .

జోడీగా గౌతమి , అమల నటించారు . ఇద్దరూ చాలా చలాకీగా , అల్లరి అల్లరిగా బ్రహ్మాండంగా నటించారు . డ్యూయెట్లలో అదరగొట్టేసారు . చాలా హాట్ గా నటించారు . దర్శకుడు యస్ యస్ రవిచంద్ర పాటల్ని అద్భుతంగా చిత్రీకరించారు . ఈ సినిమాలో డ్యూయెట్ల పాత్ర చాలా ఉంది .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల సాహిత్యంలో పాటలు హిట్టయ్యాయి . తెర మీద ఇంకా బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , జానకమ్మ చాలా శ్రావ్యంగా పాడారు . మొత్తం అయిదు డ్యూయెట్లూ బాగుంటాయి . హాయిలే హాయిలే , శృంగార తైలాల , మల్లేశా మావా లగాయించరా , సవాల్ చేస్తావా , తగిలితే కోపం అంటూ సాగుతాయి .

వెంకటేష్ , శారద తర్వాత మెచ్చుకోవలసింది నిర్మలమ్మనే . బాగా నటించింది . విలన్లుగా సత్యనారాయణ , చలపతిరావు , ప్రదీప్ శక్తి విలనీని బాగా పండించారు . ఇతర పాత్రల్లో శరత్ బాబు , అల్లు రామలింగయ్య , జయలలిత , కోట శ్రీనివాసరావు , నర్రా , బాబూ మోహన్  తదితరులు నటించారు .

ఎమోషనల్ , ఏక్షన్ సీన్లలో వెంకటేష్ డైలాగులను పరుచూరి బ్రదర్స్ చాలా పదునుగా వ్రాసారు . శ్రీ రాఘవేంద్ర పిక్చర్స్ బేనర్లో యం కృష్ణ & శేఖర్లు నిర్మించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడతగ్గ సినిమాయే . వెంకటేష్ , శారద అభిమానులు మరలా కూడా చూడవచ్చు . It’s an action and emotional movie .

నేను పరిచయం చేస్తున్న 1237 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!
  • ‘‘భావి తరాలు రీల్స్‌ బందీలు – ‘రిథమ్’ తప్పిన అల్గా‘రిథమ్ బతుకులు’’
  • క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)
  • క్షుద్రోపాసన ! నెత్తురు, మద్యం, ఎముకలు, పుర్రెలు ! (మూడో భాగం)
  • దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)
  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions