Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక ప్రవళిక ఎందుకు ప్రాణాలొదిలింది..? ఒక బర్రెలక్క ఎందుకు బరిలోకి దిగింది..?

November 22, 2023 by M S R

ఒక ఫోటో… కేసీయార్ కుమారుడు కేటీయార్ పలువురు ఉద్యోగాభ్యర్థులతో మాట్లాడుతున్న ఫోటో… ఫోటో యాంగిల్ బాగుంది… ఎన్నికల వేళ నిరుద్యోగుల్లో వ్యతిరేకతను తగ్గించడానికి ఈ ప్రయత్నం, ఈ ఆలోచన కూడా బాగుంది… మరోవైపు ఇస్తామన్న హామీకన్నా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చాం అనే ప్రచారం… అదే సమయంలో ‘జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఖాళీలు భర్తీ చేస్తాం’ అనే హామీ…

బాగా కొలువులు ఇస్తుంటే… కొత్త హామీల అవసరం ఎందుకొచ్చింది..? తెలంగాణ ఉద్యమ మూల నినాదాల్లో ఒకటి ‘నియామకాలు’… మరెందుకు పదేళ్లయినా సరే ఆ నియామకాలు గాడి తప్పే ఉన్నయ్… ఎందుకు నిరుద్యోగుల్లో అసంతృప్తి ప్రబలింది… ఉద్యోగకల్పన మాటెలా ఉన్నా అసలు ఖాళీల భర్తీ ఎందుకు సవ్యంగా లేదు… ఇవన్నీ ప్రశ్నలే…

ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఏమైంది..? కంట్రాక్టు కొలువులు, ఔట్ సోర్సింగ్ మాటలే ఈ రాష్ట్రంలో వినిపించకూడదు అనే పాత భీషణ ప్రతిజ్ఞలు ఏమయ్యాయి..? ఆ పరిస్థితి ఎందుకు మారలేదు..? ఇవీ ప్రశ్నలే…

Ads

ktr

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీల ఆరోపణల్ని ఇదే కేటీయార్ తీవ్రంగా ఖండించాడు మొదట్లో… కానీ అరెస్టులు సాగుతూనే ఉన్నాయి… దర్యాప్తు నడుస్తూనే ఉంది… దాదాపు వంద మంది దాకా అరెస్టయి ఉంటారు… మరి ఏమీ లేనిది ఎందుకీ అరెస్టులు..? ఇంత ఘోరమైన వైఫల్యం ఉన్నా కమిషన్ బాధ్యులు కడుపులో చల్లకదలకుండా నిక్షేపంగా అక్కడే ఉన్నారు… ఎందుకిలా..? కమిషన్ ప్రక్షాళన అని ఇప్పుడు హరీష్ వంటి నేతలూ మాట్లాడుతున్నారు… మరి ఇన్నాళ్లూ ఎందుకు చేయలేదనేది కదా అసలు ప్రశ్న…

మరొక మంచి వార్త కనిపించింది… ప్రధాన పత్రికల్లో లేదు గానీ, సూర్యలో కనిపించింది… ఒక గిరిపుత్రిక ఏకంగా ఏడు కొలువులు సాధించిందట… గుడ్… కేసీయార్ మస్తు నోటిఫికేషన్లు వేయకపోతే ఇన్ని కొలువులు ఎలా వచ్చాయంటూ గులాబీ బ్యాచ్ ప్రచారం అందుకుంది… కానీ తీరా ఆ క్లిప్పింగ్ సావధానంగా చూస్తే అది 2019 నాటిది అని కనిపిస్తోంది… 

గిరిపుత్రిక


 


Gurram Seetaramulu  విశ్లేషణ ఏమిటంటే..? ‘‘ఈ పదేళ్ళ ల్లో ఒక్కసారి కూడా గ్రూప్ I జరగలేదు. ఒక్క విశ్వవిద్యాలయంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క JL/DL ( TSPSC ) (గురుకులం కాదు…) ఇవ్వలేదు. ఒక్క గ్రూప్ iii జరగలేదు. ఇక జరిగిన పరీక్షల కథలు పెద్దవి.

2015 లో గ్రూప్ II నోటిఫికేషన్ , దానికి అదనంగా ఇంకొన్ని పోస్ట్ లు కలిపి  రీ-నోటిఫికేషన్, 2017 లో పరీక్ష జరిగితే 2018 లో ఒక పోస్ట్ కు ముగ్గురి చొప్పున 1:3 చొప్పున ఇంటర్వ్యూ జరిగితే 2020 లో కొలువులు ఇచ్చారు. ఇంకా నలభై మంది ఎక్శైజ్ SI పోస్ట్ ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అంటే 2015 నుండి 2023 దాకా ఎదురుచూడడం అంటే నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించడం కాదూ ?



బర్రెలక్క
అలా ఎదురుచూసీ చూసీ ప్రవలిక అర్ధాంతర మరణం… పాలమూరు శిరీష అలియాస్ బర్రెలక్క ఇవ్వాళ సామాజిక మాధ్యమాలలో ఐకాన్ గా నిలబడ్డది. సక్రమంగా నియామకాలు జరిగితే కోట్లాది కన్నీళ్లు ఉండేవి కావు, వసి వాడని బ్రతుకులు ఉరికి వేలాడాల్సిన అవసరం ఉండేది కాదు. మనకు కావాల్సింది గిరిపుత్రిక విజయాలే… ప్రవలిక లాంటి జీవితాలు పునరావృతం కాకూడదు.
ప్రవలిక

ఎనకటి వెనకబాటు కాలం నేటి బానిస కాలంకన్నా గొప్పదే… ఇది మధ్యయుగాల బానిస రాజ్యం… ఈ చెట్టుకు వేలాడుతున్న ఆ ఫోటోకు బదులు ఆమె పెళ్ళికి దారి చూపే ఫ్లెక్సీ అయి ఉండాలి… కానీ స్మశానానికి దిక్శూచి అవడం ఎవరి వైఫల్యం ? అందుకే గుర్తులు గుర్తుంచుకోవాలి… దొంగలు, దొరల గుర్తులు గుర్తుంచుకోవాలి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions