Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పీకే లేడు… కొత్త వ్యూహాలు లేవు… కేసీయార్‌ను మించిన వ్యూహకర్త ఇంకెవరు..?

November 22, 2023 by M S R

ముందుగా ఆంధ్రజ్యోెతి సైట్‌లో వచ్చిన ఓ వార్త చదవండి… అఫ్‌కోర్స్, ఇతర పత్రికలు కొన్ని, సైట్లు ఎట్సెట్రా దాదాపు ఇదే వెర్షన్ రాసుకొచ్చాయి… ఆ వార్త సారాంశం ఏమిటంటే..? ‘‘అవును.. హ్యాట్రిక్ కొడుతున్నాం.. అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చు కానీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మాత్రం బీఆర్ఎస్‌ అని అధినేత మొదలుకుని కార్యకర్తల వరకూ చెబుతున్న మాట. అయితే ఇదంతా రెండ్రోజుల కిందటి వరకేనట. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిందట. గ్రౌండ్ లెవల్‌లో వినిపిస్తున్న టాక్.. అంతర్గత సర్వేలతో కేసీఆర్ కంగుతిన్నారట.

దీంతో హుటాహుటిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను (Prashant Kishor) హైదరాబాద్‌కు (Hyderabad) పిలిపించుకుని అత్యవసర భేటీ అయ్యారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) నడుస్తున్న బిగ్ డిబేట్. ‘ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందే.. ఉన్న ఈ కొద్దిరోజుల్లో ఎలా వ్యూహాలు రచిస్తావో.. ఏం చేస్తావో అవన్నీ తెల్వదు గెలవాల్సిందే’ ఇదొక్కటే పీకేకు పదే పదే కేసీఆర్ చెప్పారట. సోమవారం నాడు ఎన్నికల ప్రచారం ముగించుకున్న కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారట. అప్పటికే పీకే రెడీగా ఉండటంతో మూడు గంటలపాటు ఏం చేద్దాం..? ఎలా ముందుకెళ్దాం..? ఏం చేసైనా సరే హ్యాట్రిక్ కొట్టాల్సిందే..? అని చెప్పారట. ఇప్పుడిదే తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నడుస్తున్న చర్చ. సోషల్ మీడియాలో అయితే ఇదే రచ్చ.

KCR-And-PK.jpg

Ads

గ్రౌండ్‌ లెవల్‌లో, ఇంటెలిజెన్స్‌తో చేయించిన సర్వేల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయట. కాంగ్రెస్‌ విజయం వైపు దూసుకెళ్తోందని వ్యక్తిగత సర్వేల్లో తేలిందట. దీంతో కారు పార్టీ పెద్దలకు నిద్ర పట్టట్లేదట. ఇక ఉన్న ఈ కొద్ది కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి..? ఏం చేయాలి..? అని ముఖ్యనేతలతో కేసీఆర్ చర్చించి.. అనంతరం ఇక ఉన్నది వన్ అండ్ ఓన్లీ ప్రశాంత్ కిశోర్ మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చారట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీకేని హైదరాబాద్‌కు పిలిపించాలని గులాబీ బాస్ ఆదేశించడంతో అప్పటికప్పుడు ఐప్యాక్‌ టీమ్‌ను సంప్రదించడం ఇవన్నీ నిమిషాల్లో జరిగిపోయాయట. సోమవారం నాడు ప్రశాంత్ కిశోర్ ప్రగతిభవన్‌కు రావడంతో మూడు గంటలపాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలియవచ్చింది. 

‘ఈ కొద్దిరోజులు మీ సేవలు మాకు అవసరం.. గెలిపించండి.. తర్వాత ఏమున్నా మాట్లాడుకుందాం’ అని పీకేతో పదే పదే కేసీఆర్ అన్నారట. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి పలు విషయాలు చర్చించినట్లుగా సమాచారం. దీంతో కాస్త టైమ్ ఇవ్వాలని కోరిన పీకే ఫైనల్‌గా ఓకే అన్నట్లుగా తెలిసింది. పీకే కాదనలేనంతగా భారీ ఆఫర్ చేయడంతో ఓకే అన్నట్లు తెలియవచ్చింది. పీకే గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన ఏ పార్టీకి వ్యూహకర్తగా ఉంటారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ కూడా తమకు సేవలు అందించాలని పీకేను కోరింది. అయితే ఆ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రశాంత్ కిశోర్ డ్రాప్ అయ్యారు. దీంతో సొంతంగానే బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది….’’

 

PK.jpg

నిజమా..? కేసీయార్ అంత బెంబేలెత్తిపోతున్నాడా..? ప్రశాంత్ కిషోరే ఇప్పుడు మిగిలిన దిక్కు అనుకుంటున్నాడా..? ఆరా తీస్తే అంతా ఫేక్ అంటున్నారు… మేమూ రాయకపోతే వెనుకబడిపోతామేమో అనే భావనతో రాసినట్టుంది ఆంధ్రజ్యోతి… అందుకే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందంటూ రాసుకొచ్చారు… నిజానికి చాన్నాళ్లుగా కేసీయార్ తన పార్టీ స్థితిగతుల మీద, సిట్టింగుల విజయావకాశాల మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూనే ఉన్నాడు… కొత్తేమీ కాదు, పైగా ఇంటలిజెన్స్ మీద ఆధారపడి ఏ ముఖ్యమంత్రీ నిర్ణయాలు తీసుకోడు…

ipac pk

https://www.andhrajyothy.com/2023/telangana/assembly-elections/prashant-kishore-met-cm-kcr-amid-the-intelligence-reports-full-details-here-nag-1169894.html

ప్రశాంత్ కిషోర్ ఏమీ మంత్రగాడు కాదు, కేసీయార్ కోరగానే అబ్రకదబ్ర అనగానే ముఖచిత్రాలు ఏమీ మారిపోవు… పైగా గతంలో తనను పిలిచి, కొన్నాళ్లు తిప్పి తరువాత వదిలేశాడు… అదే పీకే టీంలో గతంలో పనిచేసినవారితో సహా మరికొందరితో ప్రత్యేకంగా తనకు వర్క్ చేయించుకుంటున్నాడు… దాదాపు ఆరేడు టీంలు తన కోసం పనిచేస్తున్నాయట… ఎంత డబ్బు ధారపోసినా సరే పీకే ఇప్పటికిప్పుడు చేయగలిగేది ఏముంటుంది..?

నిజానికి ప్రచారంలో బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది… సోషల్ మీడియా, యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, డిజిటల్ యాడ్స్, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, బిల్ బోర్డులు, హోర్డింగులు సహా ఏ మార్గాన్నీ విడిచిపెట్టలేదు… మొన్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా హాట్‌స్టార్‌లోనూ యాడ్స్ గుప్పించారు… హరీష్, కేసీయార్, కేటీయార్, కవిత స్టార్ క్యాంపెయినర్స్… గతంలోకన్నా సమ్మేళనాలు, సభలు, గెట్‌టుగెదర్స్ గట్రా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు… విపరీతంగా డబ్బు ఖర్చవుతోంది… ప్రధాన తెలుగు మీడియా మొత్తం డప్పు కొడుతోంది… ఇలా వాళ్లతో పోలిస్తే కాంగ్రెస్ తక్కువే… రేవంతుడొక్కడే రాష్ట్రమంతా చుట్టొస్తున్నాడు… కాంగ్రెస్ కూడా బాగానే యాడ్స్ ఇస్తోంది కానీ బీఆర్ఎస్‌తో పోలిస్తే చాలా తక్కువ… ఈ రెండు పార్టీలతో పోలిస్తే బీజేపీ చాలా దూరంలో ఉంది… సో, బీఆర్ఎస్ గరిష్ట స్థాయి ప్రచారంతో బరిలో ఉంది… ఇలాంటప్పుడు పీకే వచ్చి ప్రత్యేకంగా చేసేదేముంది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions