Padmakar Daggumati…….. “మీ అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?”
కొన్ని గంటల్లో ఏడుపుల శబ్దం
పూర్తిగా ఆగిపోతుంది
Ads
మీ కుటుంబ సభ్యులు బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి
వడ్డీంచడంలో బిజీగా ఉంటారు
మీ మనవళ్లు మనవరాండ్రు అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు
వయసులో ఉన్న యువతీ యువకులు
ఒకరినిఒకరు చూసుకుంటూ
రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నంబర్లను
మార్చుకునే పనిలో ఉంటారు
వయసు మళ్ళిన కొందరు
లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ
టీ తాగుతూ సమయం గడపుతారు
మీ అంత్యక్రియలు జరిపిన తరువాత
మిగిలిన వ్యర్ధాలను మీ ఇంటి నుంచి
దూరంగా విసిరి పరిసరాలను
పాడుచేసి ఉంటారని భావించి
మీ పొరుగువారు కోపంగా ఉంటారు
అత్యవసర పరిస్థితి కారణంగా
వ్యక్తిగతంగా రాలేకపోవడంపై
మీ బంధువొకరు మీ కుమార్తెతో
ఫోన్‌లో మాట్లాడుతూంటారు
మరుసటి రోజు
కొంతమంది బంధువులు వెళ్లిపోతారు
మిగిలిన వారిలో ఒకరు
కూరలో తగినంత ఉప్పు లేదని
ఆనాటి విందులో ఫిర్యాదు చేసుండొచ్చు
అంత్యక్రియల ఖర్చు భరించే మీవారిలో ఒకరు
మీఅంత్యక్రియలకు అవసరానికి మించి
ఎక్కువ ఖర్చు చేశారని గొడవలాడవచ్చు
జనం మెల్లగా ఒకరి తర్వాత మరొకరు
వెళ్లిపోవడం మొదలవుతుంది
మీరు చనిపోయారని తెలియక
కొంతకాలం మీ ఫోన్‌కి కొన్ని కాల్స్ రావచ్చు
మీ ఆఫీస్ వాళ్ళు మీస్థానంలో
వేరొకరిని నియమించుకొనే పనిలో ఉంటారు
మీ మరణ వార్త విన్న ఒక వారం తరువాత
కొంతమంది ఫేస్‌బుక్ స్నేహితులు విచారంతో
మీ చివరి పోస్ట్ ఏమిటో తెలుసుకోవడానికి
ఆసక్తిగా వెతకవచ్చు
అత్యవసర సెలవు ముగిసిన రెండు వారాలలో
మీ కొడుకో కుమార్తో తిరిగి
ఆఫీస్ పనులకు వెళ్ళిపోతారు
మీ జీవిత భాగస్వామి
నెలతిరిగే సరికల్లా అన్నీ మర్చిపోయి
ఎదో ఒక కామెడీ షో చూస్తు
హాయిగా గడుపుతుంటారు
మీ బంధువులు
సినిమాలుచూస్తూ షికార్లు చేస్తూ
సరదాగా కాలం గడుపుతూ ఉంటారు
ఈ ప్రపంచంలోని అందరూ
అతిత్వరగా నిన్ను పూర్తిగా మరచిపోతారు.
ఈలోగా మీ మొదటి సంవత్సరం వర్ధంతి వస్తుంది
మీ వాళ్ళు ఘనంగా జరుపుకుంటారు
ఏదో ఒక రోజు
పాత ఫోటోలు చూస్తూ
మీ స్నేహితుడొకరు మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు
వీరందరినీ సంతృప్తి పరచడానికి మీరు జీవితాన్ని గడుపుతున్నారా? దాని వల్ల ఉపయోగం లేదు..
జీవితం ఒకటే మిత్రమా!
దానిని జీవించు మిత్రమా!!
■■■■
రచయిత ఎవరో తెలియదుగాని వాట్సప్ సేకరణ. చిన్నచిన్న మార్పులతో… (ఇందులో లేనివి కూడా చాలా జరగొచ్చు… ఆస్తి తగాదాలు, తన్నులాటలు గట్రా… మీ ఫ్రెండ్స్ తమ ఫోన్ కంటాక్టుల నుంచి నిర్వికారంగా మీ నంబర్ డిలిట్ చేస్తారు… ఫేస్‌బుక్‌లో మీ ప్రొఫైల్ డిలిట్ చేస్తారు… వాట్సప్ గ్రూపుల నుంచి మీ నంబర్ రిమూవ్ అయిపోతుంది… ఇలాంటివి… ఎవరి కోసమూ ఏదీ ఆగదు… మన జర్నీ ముగిసింది, స్టేషన్ రాగానే దిగిపోయాం… అంతే… రైలు అలా సాగిపోతూనే ఉంటుంది…)
Share this Article