హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓటర్ల వద్ద ఎమోషనల్ వ్యాఖ్యలు… తనను గెలిపించక పోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామన్న కౌశిక్ రెడ్డి… మీరు ఓటేసి దీవిస్తే 4వ తారీకు నా జైత్రయాత్ర… గెలిపించకుంటే మా కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటాం… మా కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… కమలాపూర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి…
—- ఇదీ తాజాగా వాట్సప్‌లో కనిపించిన ఓ వార్త… అంతకుముందు కేటీయార్ ఇలాగే మాట్లాడిన మరో వార్త చదివాను… కాంగ్రెస్‌కు వోటేస్తే చచ్చిపోతారు… కారుకు వోటేయకపోతే కళ్లు పోతయ్… అని సాక్షాత్తూ కేటీయార్ ఏదో రోడ్ షోలో చేసిన వ్యాఖ్యలు… నిజంగానే కేటీయార్ అంతగా ఫ్రస్ట్రేట్ మూడ్‌లోకి వెళ్లిపోయాడా అని ఆశ్చర్యమేసింది…
Ads
ఒక్కో మాట ఆచితూచి మాట్లాడతాడు అని పేరొచ్చిన కేటీయార్ ఇంతగా మరీ ఓ ఊరి కార్యకర్త తరహాలో మాట్లాడటం ఏమిటనే సందేహం, జాలి కలిగాయి… ఎప్పుడైతే మేడిగడ్డ కుంగుబాటును పీసా టవర్‌తో పోల్చాడో అప్పుడే తన వ్యాఖ్యల పరిణతి మీద డౌట్ వచ్చింది… ఇప్పుడైతే మరీ…
బాస్ అలా మాట్లాడితే ఫాలోయర్ ఎలా మాట్లాడతాడు మరి… పైగా కౌశిక్ రెడ్డి మెంటాలిటీ, స్టేటస్ తెలిసిందే కదా… ఏకంగా తనకు గెలిపించకపోతే సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటారట… కుటుంబసభ్యుల శవయాత్ర ఉంటుందట… ఇదేం బెదిరింపు..? ఇదేం బ్లాక్ మెయిలింగు..? అయ్యా కేసీయారూ… ఇదుగో ఇలాంటి కేరక్టర్లనా మన తెలంగాణ సమాజం మీద రుద్దావు… గర్విస్తున్నావా..?
పోనీ, అదే హుజూరాబాద్‌లో ఇంకెవరో స్వతంత్ర అభ్యర్థి ఇదే బెదిరింపు ప్రకటనలు చేసి ఉంటే..? మరి వాళ్లవీ ప్రాణాలే కదా… అవునూ, ఎవరి కోసం బరిలో నిలబడ్డావు… ఓడితే ఆత్మహత్యలు చేసుకుంటామనే చిల్లర స్థాయి ప్రకటనలు చేసే లీడర్ షిప్ ఆ హుజూరాబాద్ ప్రజలకు ఎందుకు..? ఇది ఫైనల్ బ్లాక్ మెయిలింగ్ కాల్ అనుకోవాలా..?
అయ్యా, వికాస్ రాజ్ సాబ్… ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కిందకు వస్తాయా..? ఐనా, తమరేమీ చేయలేరులే… ఇలాంటి నాయకుల్ని అభ్యర్థులుగా చూస్తున్న తెలంగాణ ఎన్నికల ముఖచిత్రాన్ని చూసి నవ్వుకుంటున్నారు, అంతే కదా… అవును సారూ… ఎమోషనల్ బ్లాక్ మెయిలింగు ఎన్నికల నియమావళి ప్రకారం నేరమా..? కాదా..?
బర్రెలక్కకు ఎందుకింత సపోర్ట్ అని అడిగారుగా బ్రదర్స్… ఇదుగో ఇలాంటి కౌశిక్ రెడ్డిల కన్నా చాలా నయం కాదా..? ఆమె సాహసి… మొండి… కౌశిక్ రెడ్డి భీరువు, పిరికి… పొలిటికల్ డిగ్నిటీ ఏమాత్రం లేదు… ఇలాంటి వాళ్లు ప్రజలకు ఎలా నాయకులు కాగలరు..? ఓడినా గెలిచినా జనంలోనే ఉంటామనే మాటలు ఎందుకు రావడం లేదు..? ఎక్కడుంది తేడా..?!
Share this Article