అప్పుడెప్పుడో ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన సినిమా జయం… అప్పటికి ఇంకా టీన్స్‌లో ఉన్న నితిన్‌కు భారీ విజయం… తరువాత..? అదే పెద్ద క్వశ్చన్ మార్క్… రాజమౌళి తీసిన సై బెటర్… ఆ తరువాత..? మళ్లీ క్వశ్చన్ మార్క్… మళ్లీ 2012లో ఇష్క్ వచ్చేవరకూ ఫ్లాపులే ఫ్లాపులు… నితిన్ అసలు హీరోగా నిలదొక్కుకుంటాడా అనేదే పెద్ద ప్రశ్నగా నిలిచిన తరుణంలో… ఈ సినీ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆ ఇష్క్ ఊపిరి పోసింది… అందులో హీరోయిన్ నిత్యామేనన్ పాత్ర ప్రధాన ఆకర్షణ, అది వేరే సంగతి…
సేమ్, గుండె జారి గల్లంతయ్యిందే కూడా బెటరే… ఈ ఫ్లాపుల హీరోను మళ్లీ ఆదుకుంది త్రివిక్రమ్… అఆ సినిమా మళ్లీ నిలబెట్టింది… రెండేళ్ల క్రితం వచ్చిన రంగ్ దే కూడా పర్లేదు… నిత్య, సమంత, కీర్తి… హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాలే తనను నిలబెట్టాయి… అఫ్‌కోర్స్, మొదట్లో ఉన్నట్టు రా సరుకు కాదు, మెరుగయ్యాడు… ప్రత్యేకించి కామెడీ టైమింగ్ బాగా అలవడింది… కానీ తనకు మాస్ కేరక్టర్లు సూట్ కావు… రగ్గడ్ లుక్స్ ఉన్న పాత్రలు తన హ్యాండ్‌సమ్ మొహానికి ఫిట్ కావు…
ఇప్పుడు ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ పేరిట వచ్చాడు… రచయిత వక్కంతం వంశీ దీనికి దర్శకుడు… ప్రధానంగా కామెడీ, ఎంటర్‌టెయిన్‌మెంటే ప్రధానంగా కథ నడిపించాడు… నితిన్‌కు మూడు వేరియేషన్స్… ఓ జూనియర్ ఆర్టిస్టు, ఎర్ర బాలు అనే ఓ ఆకు రౌడీ కేరక్టర్, ఎస్ఐ పాత్ర… పర్లేదు, అన్నీ బాగానే చేశాడు నితిన్… కాకపోతే సినిమాలో ఇంటెన్స్ లేదు… ఏదో అలా అలా సాగిపోతుంది… సినిమా చూస్తున్నంతసేపు రేసుగుర్రం, కిక్ సినిమాలు గుర్తొస్తుంటాయి… ఆ సినిమాల్లోని కొన్ని భాగాలే కలిపి కుట్టుకుని వక్కంతం ఈ కొత్త డ్రెస్ ఇచ్చాడు నితిన్‌కు…
Ads
పాటలు, బీజీఎం సోసో… మిగతా నిర్మాణ విలువలకు ఢోకా లేదు… ఎటొచ్చీ కథే రక్తికట్టలేదు… నటి శ్రీలీల గురించీ చెప్పుకోవాలి… యువతలో ఆమెకు ఉన్న పాపులారిటీ దృష్ట్యా… విపరీతమైన ఆఫర్లు వచ్చి పడ్డయ్ ఆమెకు… ఏది పడితే అది ఒప్పేసుకుంది… గాలి ఉన్నప్పుడే తూర్పార బట్టుకోవాలి అన్నట్టుగా… అలాంటి ఆఫర్స్‌లో ఒకటి ఇది కూడా… అందంగా ఉండి, బాగా డాన్స్ చేయగలిగితే చాలా..? ఈ సినిమాలో అప్పుడప్పుడూ ఆమె వచ్చిపోతుంటుంది… ఏమాత్రం ప్రాధాన్యం లేదు… ఆమె సినిమాల ఎంపిక ఇలాగే ఉంటే త్వరగానే తెరమరుగు కావడం తథ్యం… (ఆమధ్య వచ్చిన బాలయ్య సినిమా భగవంత్ కేసరిలో హీరో దత్తత బిడ్డ పాత్ర చాలా నయం)
ఈ ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ లో ఎక్సట్రా అనే పదం తీసేయండి, చాలు… అవును, జస్ట్, ఓ ఆర్డినరీ సినిమా… సినిమాలోకి హీరో రాజశేఖర్‌ను తీసుకొచ్చారు ఓ సర్‌ప్రయిజ్ ఎలిమెంట్‌గా… పర్లేదు… కానీ గొప్పగా తన రేంజ్‌కు తగ్గట్టు ఇమడలేదు… జూనియర్ ఆర్టిస్టు పాత్ర కదా, సినీమాఫియా మీద ఏవో సెటైర్లు గట్రా ఉంటాయని అనుకోకండి… అంత సీన్ లేదు… పైగా నితిన్ తనే ఓ సినిమా పెద్దమనిషి కొడుకు… సో… సినిమా సోసో…
Share this Article