సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారూ… కాలర్ ఎగరేయండి సార్… మొహం కాస్త పైకెత్తండి… నవ్వండి ఓసారి… ఆఁ అదీ, అద్గదీ… మీరు సూపర్ సార్, మీకేం తక్కువ సార్… మీ కొత్త పలుకు, మీ తెలుగుదేశం డప్పు కాస్త పక్కన పెట్టేద్దాం కానీ… అసలు మీ వెబ్సైట్ ఉంది చూశారూ… ఎహె, తిరుగు లేదు సార్… జర్నలిజానికి కొత్త పాఠాలు నేర్పిస్తున్న మీవాళ్లకు మీరు అర్జెంటుగా జీతాలు పెంచేసి, బోనస్ ప్రకటించేసి, వీలయితే అందరికీ బహుమతులు ఇవ్వాలి సార్… వాళ్లకూ ఉత్సాహం ఉండాలి కదా… మీకూ గర్వకారకులు కదా… తెలుగుదేశం యవ్వారాల్లో పడి మీరు సరిగ్గా మీ సైటు చదువుతున్నట్టుగా లేరు… అప్పుడప్పుడూ చదువుతూ ఉండండి సార్, మీరే అలా వదిలేస్తే ఎలా ఫాఫం..? మీకూ కొత్త సంగతులు తెలియాలి కదా… వచ్చేవారం కొత్త పలుకులో కుమ్మిపారేయాలి కదా… అబ్బే, కాస్త తీరిక చేసుకుని, చదువుతూ ఉండాలి సార్… ఇదీ వార్త… మీ సైటులోనిదే… స్క్రీన్ షాట్…
ప్రపంచంలో ఏ జర్నలిస్టూ ఇలా రాయలేడు, ఏ సైటు ఇన్ఛార్జి ఇంత దారుణంగా నాయకత్వం వహించలేడు… గ్యారంటీ… పీఠాధిపతుల కీలక సమావేశం ఏపీ రాజకీయాల్లో సంచలనం అట… వోకే, పర్లేదు… ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఒక గ్రామంలో పీఠాధిపతుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారట… గుడ్, మంచి స్కూప్… అసలు స్కూపులంటేనే ఆంధ్రజ్యోతి కదా… స్కూప్ జ్యోతి… సమావేశానికి ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ పెద్దలు కూడా హాజరయ్యారని తెలిసిందట… సూపర్… అసలు ఇంటలిజెన్స్ కన్ను కూడా పడకుండా మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశం కూడా అయ్యిందట… వావ్, ఎవరికీ తెలియని ఆ గుప్తసమావేశం మీరే బయటపెడుతున్నారన్నమాట… వావ్.., ఇంకా..? ఇంకా..?
Ads
ఏపీలో బలవంతపు మతమార్పిళ్లు (జ్యోతి భాషలో మార్పిడులు అనాలేమో…), ఆలయాలపై దాడులకు వ్యతిరేకంగా సమావేశమైనట్టు తెలిసిందట… అంతే, అంతే, జగన్ దుర్మార్గ క్రిస్టియన్ పాలనకు వ్యతిరేకంగా సమావేశం అయ్యారన్నమాట… సరే, సరే, తరువాత..? మీటింగుకు దేశంలోని కీలక పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారట… గుడ్, వెరీగుడ్… తరువాత..? భేటీ సమాచారం తెలిసి ప్రభుత్వంలోని ముఖ్యనేత పీఠాధిపతులతో మాట్లాడటానికి ట్రై చేశాడట, ఓ మంత్రి రంగంలోకి దిగాడట, కానీ ఫెయిలయ్యాడట… వావ్… ఇంతకీ ఈ మీటింగు ఎక్కడ జరిగింది సార్..? మీరే మీ ఆంధ్రజ్యోతి పత్రికలో మరి ఇలా రాశారేమిటి..? ఈరోజు పత్రికే…
రేపు సాయంత్రం మూడు గంటలకు రహస్య సమావేశం జరుగుతుందని మీరే పత్రికలో రాస్తారు… మళ్లీ మీరే సమావేశం జరిగిందని రాస్తారు… ఎట్లా చచ్చేది సార్..? ఓహో… ఎలాగూ జరగకపోదు, జగన్ బెంబేలెత్తిపోయి, మీటింగు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయకపోడు, ఎవరో ఓ మంత్రిని పంపించకపోడు అని ముందే ఊహించేసుకుని, లేటెందుకులే అనుకుని, ముందే వార్తను సైటులో కుమ్మేశారన్నమాట… సూపర్, వార్తను ఎవడైనా రాయగలడు… రెండు రోజుల ముందే వార్తను రాయగలవాడే తోపు రిపోర్టర్, వీరతోపు మీడియా హౌజు… అంతే కదా సార్..? ఎంతైనా మీరు సూపర్ సారూ… పనిలోపని… జగన్ మిలాఖత్ స్వామి వైజాగ్ స్వరూపుడు, కేసీయార్ జాన్ జిగ్రీ చినజియ్యరుడు కూడా ఈ భేటీ జరగకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా నాలుగు వాక్యాలు రాసేస్తే సరిపోయేది… సూడో క్రిస్టియన్ జగన్, సూడో ముస్లిం కేసీయార్ ఇద్దరూ ఈ భేటీపై భగభగ మండిపోతున్నారని కూడా యాడ్ చేస్తే ఇంకా మంచి మసాలా ఉండేది… అవునూ, మన డ్రోన్లు, మన స్పయింగ్ కెమెరాలు ఆ భేటీ దగ్గర ఆల్రెడీ పెట్టేశాం కదా సార్… వోకే… ష్… ఆ భేటికి అమిత్ షా వెళ్తున్నాడట… ముందే రాయకండి, ముందు కనుక్కొండి…!!
Share this Article