Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియల్లీ గ్రేట్ తల్లీ..! నూటికి నూరుశాతం మార్కులు అరుదైన విశేషం..!

April 23, 2025 by M S R

.

సెంట్ పర్సెంట్… నూటికి నూరు మార్కులు… నూరు శాతం… అది ఏ పరీక్షయినా సరే, ఈ వాక్యాలు చదవడానికే అబ్బురంగా ఉంటాయి.,. అరుదైన విశేషం…

ఎపీ టెన్త్ ఫలితాల్లో యాళ్ల నేహాంజని అనే ఓ ప్రైవేటు స్కూల్ (నారాయణ, శ్రీచైతన్య బాపతు కార్పొరేట్ కాలేజీలు కాదు, ఏదో ఓ చిన్న ప్రైవేటు స్కూల్) విద్యార్థిని ఏకంగా 600 మార్కులకు గాను 600 మార్కులు స్కోర్ చేసింది…

Ads

కష్టం, ఈ రికార్డును ఇంకెవరూ బ్రేక్ చేయలేరేమో ఇప్పట్లో… కంగ్రాట్స్ తల్లీ… ఇంటర్ ఫలితాలు, పహెల్‌గాం దుశ్చర్య, అఘోరి, ప్రవస్తి, సివిల్స్ వార్తల నడుమ నీ ఘనతకు దక్కాల్సినంత ప్రయారిటీ దక్కడం లేదు మీడియాలో…

నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పిల్లలు 90 నుంచి 99 శాతం మార్కులు సంపాదించడం కామన్ అయిపోయింది… ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా రాయాలో ఇప్పటి పిల్లలకు బాగా తెలుసు… రెండుమూడు మార్కుల తేడాతో సెంట్ పర్సెంట్ ఘనతను మిస్సయినవాళ్లూ ఉన్నారు… కానీ ఈ సెంట్ పర్సెంట్ మార్కులు మాత్రం నిజంగా విశేషమే…

100 percent

తన వ్యక్తిగత ప్రతిభే అయినా సరే, ఆ స్కూల్, టీచర్లు కూడా ఈ ఘనతను చెప్పుకోవచ్చు… గతంలో లాంగ్వేజీల్లో నూటికి నూరు మార్కులు ఎంత బ్రహ్మాండంగా రాసినా సరే వేసేవాళ్లు కాదు… ఇప్పుడు ఎన్యుమరేటర్లు అదీ బ్రేక్ చేశారు…

సో, ఆ అమ్మాయి జవాబు పత్రాల్ని యథాతథంగా నెట్‌లో పెట్టి… పరీక్షలకు కూర్చునే విద్యార్థులకు అందుబాటులో పెడితే బాగుంటుంది… ఒక ఇన్‌స్పిరేషన్ మాత్రమే కాదు, ఎలా రాయాలో కూడా కొందరు నేర్చుకునే సౌలభ్యం ఉంటుంది… అఫ్‌కోర్స్, వాటిని చూపి మరింత ఒత్తడిని పెంచడం గాకుండా…

ఇక మరో వార్త కూడా కనిపిస్తోంది… 600 మార్కులకు గాను కేవలం ఒక్క మార్కు వచ్చిన ఓ స్టూడెంట్ మార్కుల వివరాల్ని కొన్ని షార్ట్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ పబ్లిష్ చేశాయి… సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది… బాగుండదని పేర్లు, వివరాలు ఏమీ ఇవ్వడం లేదు… గుడ్… సరైన నిర్ణయమే…

zero

ఐతే… కేవలం ఒక్క మార్కు, అదీ సైన్స్ సబ్జెక్టులో ఎలా సాధ్యం..? ఇదీ ప్రశ్నే… మిగతా ఐదు సబ్జెక్టులు అసలు రాయలేదా..? హాలుకు వచ్చీ ఏమీ అటెంప్ట్ చేయలేదా..? ఆ సైన్స్ పేపర్‌లో కూడా ఓ బిట్ అటెంప్ట్ చేసి ఇక వదిలేశాడా…/ వదిలేసిందా..? తెలియదు… అన్ని సబ్జెక్టులు రాసీ, ఆ ఒక్క మార్కు తప్ప మిగతా దేనికీ మార్కులు సంపాదించలేకపోవడమే నిజమైతే… అదీ విశేషమే…

(అఫ్ కోర్స్, అన్నీ రాసి ఉంటే, ఆ ఒక్క మార్కు కూడా రాకుండా మొత్తం సున్నా గనుక వచ్చి ఉంటే అదీ ఓ రికార్డు అయి ఉండేదేమో… పాపం శమించుగాక…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘తిరుచ్చిలో మా పోటీ అనైతికం’ – త్రిష కాళ్లల్లో లారెన్స్ కట్టెలు!
  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!
  • అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!
  • ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!
  • తల్లిదండ్రుల ఓవర్ కంట్రోల్ అసలు సమస్య – చేతన్ భగత్ విశ్లేషణ!
  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!
  • ఆచితూచి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు– ఎటొచ్చీ చిరంజీవి భార్య పేరుతోనే..!!
  • 95 ఏళ్ల వయస్సు దాకా… భారతీయ గుండెలకు అవిశ్రాంత సేవ..!!
  • “కొలై పండ్రాంగప్పో” – కరుణానిధి అరెస్టు రాత్రి అసలేం జరిగింది?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions